CM Jagan: తల్లీ బిడ్ద ఎక్స్‌ప్రెస్‌.. 500 ఏసీ వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్‌

‘నాడు-నేడు’ పనులతో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తున్నామని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. ‘డా.వైఎస్సార్‌

Updated : 01 Apr 2022 14:08 IST

విజయవాడ: ‘నాడు-నేడు’ పనులతో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తున్నామని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. ‘డా.వైఎస్సార్‌ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ సేవల్లో భాగంగా 500 ఏసీ వాహనాలను విజయవాడ బెంజి సర్కిల్‌ వద్ద సీఎం జెండా ఊపి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ గర్భిణిలకు సత్వర వైద్య సదుపాయం అందించేందుకు తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. గర్భం దాల్చిన మహిళలకు తమ ప్రభుత్వం అండగా ఉంటోందన్నారు. వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్లడమే కాకుండా అక్కడా నాణ్యమైన సేవలు అందించే ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ సూచించిన ప్రమాణాలు కలిగిన మందులు అందజేస్తున్నట్లు సీఎం వివరించారు. ప్రసవం తర్వాత విశ్రాంతి సమయంలో సిజేరియన్‌కు రూ.3వేలు, సహజ ప్రసవానికి రూ.5వేలు అందజేస్తున్నామన్నారు. 104, 108 వాహనాలతో పాటు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌తో అక్కచెల్లెమ్మలకు ఇంకా మంచి జరగాలని కోరుకుంటున్నట్లు సీఎం జగన్‌ చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని