Published : 08/09/2021 15:02 IST

Cm Jagan: విలేజ్‌ క్లినిక్స్‌ స్థాయిలోనూ అన్ని రకాల పరీక్షలు: సీఎం జగన్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో శిశు మరణాలు తగ్గించడంపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వైద్యారోగ్య శాఖపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. కొవిడ్‌ నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫ్యామిలీ హెల్త్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ మేరకు చక్కటి విధివిధానాలను ఖరారు చేయాలని అధికారులకు సూచించారు. కొత్త వైద్య కళాశాలల్లో పీజీ కోర్సులు, పారామెడికల్‌ సిబ్బందికీ శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. పబ్లిక్‌ హెల్త్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సులు పెట్టాలని సూచించారు. ప్రజారోగ్యంపై నిరంతర పరిశీలన, పర్యవేక్షణ ఉండాలన్నారు. రక్తం, నీరు, గాలి మూడింటిపై పరీక్షలు జరగాలని పేర్కొన్నారు. విలేజ్‌ క్లినిక్స్‌ స్థాయిలోనూ పరీక్షలు అందుబాటులో ఉండాలని వెల్లడించారు. అవసరమైన చోట సీహెచ్‌సీల్లోనూ డయాలసిస్‌ యూనిట్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. హెల్త్‌డేటాపై అన్ని రకాల చర్యలు తీసుకోవాలని తెలిపారు.

Read latest Andhra pradesh News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని