Ap News: విసుగు చెందిన దంపతులు.. హైకోర్టు ముందు ఆత్మహత్యాయత్నం

రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వద్ద గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లకు చెందిన దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ధూళిపాళ్ల గ్రామానికి చెందిన భార్యాభర్తలు చీలికోటి దేవేంద్ర రావు, చీలికోటి భానుశ్రీల ఇంటి స్థలానికి సంబంధించిన వివాదంలో కొందరు వ్యక్తులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని...

Updated : 04 Oct 2021 16:09 IST

అమరావతి: రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వద్ద గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లకు చెందిన దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ధూళిపాళ్ల గ్రామానికి చెందిన భార్యాభర్తలు చీలికోటి దేవేంద్ర రావు, చీలికోటి భానుశ్రీల ఇంటి స్థలానికి సంబంధించిన వివాదంలో కొందరు వ్యక్తులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని హైకోర్టు వద్ద ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే గమనించిన ఎస్పీఎఫ్ సిబ్బంది దంపతుల చేతిలో ఉన్న డీజిల్ సీసాను లాక్కున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు తుళ్లూరు స్టేషన్‌కు తరలించారు.

2003 నుంచి తమకు ఉన్న స్థలంలో నివాసం ఉంటున్నామని.. 2017లో బస్ షెల్టర్ నిర్మాణానికి బలవంతంగా తీసుకొనేందుకు యత్నించగా తాము హైకోర్టును ఆశ్రయించామని బాధితుడు దేవేంద్ర తెలిపారు. హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా.. గ్రామంలో కొంత మంది పెద్దలు తమను నిత్యం వేధిస్తున్నారని వాపోయారు. దీంతో విసుగు చెంది హైకోర్టు వద్దే ఆత్మహత్య చేసుకుందామని ఇక్కడికి వచ్చినట్లు దేవేంద్రరావు పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని