TTD: శ్రీవారికి వైభవంగా చక్రస్నానం.. స్వామివారి సన్నిధిలో సీజేఐ

కళియుగ వైకుంఠనాథుడైన శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Updated : 15 Oct 2021 16:07 IST

తిరుమల: కళియుగ వైకుంఠనాథుడైన శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో ఆఖరి ఘట్టమైన శ్రీవారి చక్రస్నానం ఘనంగా నిర్వహిస్తున్నారు. కరోనా దృష్ట్యా ఏకాంతంగా సేవలు జరుగుతున్నాయి. శ్రీవారి చక్రస్నానం కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ హాజరయ్యారు. ఆయనతో పాటు పలువురు సుప్రీంకోర్టు, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరి అంకం చక్రస్నానం. స్వామికి, ఉభయదేవేరులకు, చక్రాత్తాళ్వార్లకు స్నపన తిరుమాంజనం నిర్వహిస్తారు. పంచామృతాలతో అభిషేక కైంకర్యంతో స్వామి ప్రసన్నుడవుతాడు. స్వామి ప్రతినిధిగా చక్రత్తాళ్వారుకి స్నానం చేస్తారు.  స్వామివారి చివరి రూపమైన అర్చా విగ్రహానికి చక్రస్నానం నిర్వహించాక స్వామివారిని ఆనంద నిలయానికితరలిస్తారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని