TTD: సిబ్బంది అంచనా తప్పడంతోనే తోపులాట: తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

తితిదే విజిలెన్స్‌, క్షేత్రస్థాయి సిబ్బంది అంచనా తప్పడంతోనే తిరుపతిలో భక్తుల తోపులాట చోటుచేసుకుందని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

Updated : 17 May 2022 16:22 IST

తిరుపతి: తితిదే విజిలెన్స్‌, క్షేత్రస్థాయి సిబ్బంది అంచనా తప్పడంతోనే తిరుపతిలో భక్తుల తోపులాట చోటుచేసుకుందని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. వెంటనే పరిస్థితిని సమీక్షించి చర్యలు చేపట్టామని తెలిపారు. తిరుపతి ఎస్వీ గోశాలలో రూ.3కోట్లతో నిర్మించనున్న నెయ్యి ఉత్పత్తి కేంద్రానికి సుబ్బారెడ్డి శంకుస్థాపన చేశారు. 8 నెలల్లో ఘీ ప్లాంట్‌ నిర్మాణాన్ని పూర్తిచేస్తామని చెప్పారు. పూర్తి విరాళాలతోనే దీన్ని నిర్మిస్తున్నామని.. రోజుకు 60 కిలోల నెయ్యి ఉత్పత్తి చేసేలా కేంద్రాన్ని రూపొందించామన్నారు. 

భక్తులకు టైమ్‌ స్లాట్‌ టోకెన్ల జారీని పూర్తిగా నిలిపివేశామని సుబ్బారెడ్డి తెలిపారు. కంపార్ట్‌మెంట్లలో భక్తులను ఉంచి సర్వదర్శనానికి అనుమతిస్తున్నామన్నారు. వేసవిలో రద్దీ అధికంగా ఉంటుందని అంచనా వేశామని.. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని