Andhra News: భారీ వర్షాలు.. అనకాపల్లి జిల్లాలో కుంగిపోయిన వంతెన..

‘అసని’ తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు అనకాపల్లి జిల్లా వడ్డాది వద్ద వంతెన కుంగిపోయింది. పెద్దేరు నదిపై నిర్మించిన ఈ వంతెన కుంగిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

Published : 12 May 2022 16:09 IST

వడ్డాది: ‘అసని’ తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు అనకాపల్లి జిల్లా వడ్డాది వద్ద వంతెన కుంగిపోయింది. పెద్దేరు నదిపై నిర్మించిన ఈ వంతెన కుంగిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

వంతెన కుంగిన ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్‌ రవి సుభాష్‌, జేసీ కల్పనా కుమారి పరిశీలించారు. అనంతరం అధికారులతో జేసీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుంగిన వంతెనపై నుంచి రాకపోకలను నిలిపివేసినట్లు చెప్పారు. అటువైపు వాహనాలు రాకుండా పోలీస్‌, రెవెన్యూ సిబ్బందితో పహారా ఏర్పాటు చేశామన్నారు. రెండు రోజుల్లో తాత్కాలిక మార్గాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఇంటర్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం సహాయక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గౌరీపట్నం నుంచి చోడవరం, బుచ్చయ్యపేట, రావికమతం వెళ్లేవారికి తగిన నిర్దేశాలు చేస్తున్నామని జేసీ తెలిపారు. సమీప గ్రామాల్లో ఉండే గర్భిణీలకు ఏఎన్‌ఎంల ద్వారా సహాయం అందిస్తున్నట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని