TTD: 10 నుంచి వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్లు జారీ: తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఈ నెల 10వ తేదీ నుంచి వైకుంఠ ద్వార సర్వదర్శన టికెట్లను జారీ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ..

Updated : 08 Jan 2022 16:37 IST

తిరుపతి‌: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఈ నెల 10వ తేదీ నుంచి వైకుంఠ ద్వార సర్వదర్శన టికెట్లను జారీ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. కరోనా దృష్ట్యా తిరుపతి వాసులకే సర్వదర్శన టోకెన్లను జారీ చేయనున్నట్లు చెప్పారు. ఇందుకోసం తిరుపతిలో 5 చోట్ల సర్వదర్శన టోకెన్ల జారీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ధర్మారెడ్డి పేర్కొన్నారు. టోకెన్ల జారీ కేంద్రాలను శనివారం ధర్మారెడ్డి పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

‘‘వైకుంఠ ద్వార దర్శనం కోసం జనవరి 10న ఉదయం 9 గంటలకు తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తాం. తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి, ముత్యాలరెడ్డిపల్లె, సత్యనారాయణపురం జిల్లా పరిషత్ పాఠశాలలు, బైరాగి పట్టెడ రామానాయుడు పాఠశాల, మున్సిపల్ కార్యాలయంలో టికెట్ల జారీకి కౌంటర్లను ఏర్పాటు చేశాం. వైకుంఠ ద్వార దర్శనానికి స్థానికులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ నెల 13 నుంచి 22వ తేదీ వరకు రోజుకు 5 వేల చొప్పున 50 వేల సర్వదర్శనం టికెట్లు జారీ చేస్తాం. టికెట్ల కోసం వచ్చే భక్తులు క్యూలో కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. టికెట్లు పొందిన భక్తులను ముందురోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి అలిపిరి మార్గం నుంచి తిరుమలకు అనుమతిస్తాం’’ధర్మారెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని