Raghurama: ఐఆర్‌ కంటే పీఆర్సీ తక్కువ.. చరిత్రలో చూడలేదు: రఘురామ

ఐఆర్‌ కంటే పీఆర్సీ తక్కువ ఉండటం చరిత్రలో ఎప్పుడూ చూడలేదని వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. పీఆర్సీ విషయంలో మోసపోయి..

Published : 19 Jan 2022 10:42 IST

దిల్లీ: ఐఆర్‌ కంటే పీఆర్సీ తక్కువ ఉండటం చరిత్రలో ఎప్పుడూ చూడలేదని వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. పీఆర్సీ విషయంలో మోసపోయి డిమాండ్ల సాధన కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగులకు సంఘీభావంగా ఆయన దిల్లీలోని తన నివాసంలో ఇవాళ ఉపవాస దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రఘురామ మీడియాతో మాట్లాడారు.

‘‘చదువుకుని ఉద్యోగంలో చేరిన వారిని చిన్నచూపు చూడటం మంచిది కాదు. రివర్స్‌ పీఆర్సీపై ఇచ్చిన జీవోలను తక్షణం వెనక్కి తీసుకోవాలి. ఉద్యోగుల నిరసన దీక్షకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నా. ప్రభుత్వ ఉద్యోగులు, గురువులకు మన వంతు సాయం చేద్దాం. ఉద్యోగులకు ఎన్నికల సమయంలో ఎన్నో వాగ్దానాలు చేశారు. ఉద్యోగులకు చేసిన అన్యాయాన్ని చెప్పడానికే ఉపవాస దీక్ష చేస్తున్నాను. జీతాలు పెంచకపోతే అవినీతిని పెంచినట్లే అని సీఎం చాలా సార్లు చెప్పారు. ఇప్పుడు యూటర్న్‌ తీసుకోవడం బాధపెడుతోంది. కేవలం జీతం పైనే బతికే వాళ్లకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి’’ అని రఘురామ అన్నారు. ఎంపీ దీక్ష ఈ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని