Andhra News: వైకాపా రాజ్యసభ అభ్యర్థులు ఖరారు

ఏపీలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో వైకాపా అభ్యర్థులను ఖరారు చేసింది. అభ్యర్థుల పేర్లను

Updated : 17 May 2022 17:28 IST

అమరావతి: ఏపీలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో వైకాపా అభ్యర్థులను ఖరారు చేసింది. అభ్యర్థుల పేర్లను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి మరోసారి అవకాశం కల్పించారు. ఆయనతో పాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య, న్యాయవాది నిరంజన్‌ రెడ్డి, బీద మస్తాన్‌రావును అభ్యర్థులుగా ఖరారు చేశారు. అభ్యర్థుల ఎంపికపై వైకాపా అధినేత, సీఎం జగన్‌ పలుమార్లు ముఖ్యనేతలతో చర్చించారు. అనంతరం అభ్యర్థులను ఖరారు చేశారు.

సామాజిక న్యాయం పాటిస్తూ అభ్యర్థుల ఎంపిక: బొత్స

ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో అన్ని అంశాలను పరిశీలించి సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. బలహీనవర్గాలకు ఆయన ప్రాధాన్యం ఇచ్చారని.. సామాజిక న్యాయం పాటిస్తూ అభ్యర్థులను ఎంపిక చేశారని చెప్పారు. పరిపాలన, నామినేటెడ్‌ స్థానాల్లో బలహీనవర్గాలకు అవకాశం కల్పించి వారిని పైకి తీసుకురావాలన్నదే జగన్‌ ఆలోచన అని బొత్స అన్నారు. 

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ బీసీలంటే బ్యాక్ వర్డ్‌ కాదు.. బ్యాక్‌ బోన్‌ అనేది సీఎం అభిప్రాయమని చెప్పారు. భవిష్యత్తులో మహిళలకు జగన్‌ ప్రాధాన్యమిస్తారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్నింటా సమాన అవకాశాలు ఉండాలనేది సీఎం విధానమని.. మూడేళ్లలో అన్నింటా సామాజిక న్యాయాన్ని అమలు చేసి జగన్‌ నిబద్ధత పాటించారని చెప్పారు. తెదేపాలా అన్నింటినీ తాము రాజకీయం చేయడం లేదని సజ్జల వ్యాఖ్యానించారు.

‘‘సీఎం జగన్‌ బీసీలకు 44 శాతం రిజర్వేషన్‌ కల్పించారు. బీసీల పోరాటం అనేది తెలంగాణకు పరిమితమైన అంశం కాదు. దేశవ్యాప్తంగా బీసీల కోసం నేను పోరాడుతున్నాను. బీసీల హక్కుల కోసం జాతీయ స్థాయిలో పోరాటం చేస్తున్నాను. నా పోరాటాన్ని గుర్తించి ఏపీ సీఎం జగన్‌ నాకు ఈ అవకాశం కల్పించారు. - ఆర్‌ కృష్ణయ్య

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని