ఆనంద తీర్థం
సుఖంగా, సంతోషంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. సుఖం ఇంద్రియాలకు, సంతోషం ఆరో ఇంద్రియం అనే మనసుకు పరిమితం. భౌతిక ప్రపంచంలోని పదార్థాల ద్వారా మనసేంద్రియాలు పొందే తృప్తి తాత్కాలికం.
సుఖంగా, సంతోషంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. సుఖం ఇంద్రియాలకు, సంతోషం ఆరో ఇంద్రియం అనే మనసుకు పరిమితం. భౌతిక ప్రపంచంలోని పదార్థాల ద్వారా మనసేంద్రియాలు పొందే తృప్తి తాత్కాలికం. సుఖదుఃఖాలు సంసార సాగరంలో పడిలేచే తరంగాలు. ఆటుపోట్లకు అలసిపోయిన మనసుకు అంతకు మించినదేమైనా ఉన్నదా అన్న ఆలోచన కలుగుతుంది.
ఆ ఆలోచన జ్ఞానోదయానికి తొలి సోపానం. పదార్థంలో శాశ్వతమైన సుఖ సంతోషాలు లేవన్న నిజం తెలుసుకుని, నిరతిశయ నిత్యానందం కోసం అన్వేషణ మొదలవుతుంది. ‘ఆనందం బ్రహ్మ; ఆకాశం బ్రహ్మ’ అంటున్నది ఉపనిషత్తు. ఆ మహావాక్యాలను అర్థం చేసుకోగల మానసికస్థితిని సాధించాలి. పరి పూర్ణమైన మానసిక స్థితికి ఎదిగాకే ఆనందం బయటలేదని, మనలోపలే ఉన్నదని స్ఫురిస్తుంది.
ప్రపంచంలో పంచభేదాలు, మానవుల్లో తరతమభేదాలు ఉన్న విధంగా ఆనంద రసాను భూతిలోనూ తేడాలు తప్ప వంటారు శ్రీ ఆనందతీర్థులు. నారద భక్తి సూత్రాలూ ఆనంద సాగరంలో కెరటాలు ఉన్నాయని చెబుతున్నాయి. సాగర తరంగాలు ఎంతగా ఎగసినా చివరికి సముద్ర గర్భంలో చేరవలసిందే. స్వరూపభేదాలు విశ్వరూపంలో మమేకం అయిన విధంగానే, ఆనందరస ప్రసవాలన్నీ బ్రహ్మార్పణం కావలసిందే. ‘ఆనందోబ్రహ్మ’ అంటున్నది వేదం.
ఆత్మచింతన లేకపోతే మనిషి బతుకు అడవికాచిన వెన్నెలవుతుంది. ఆత్మజ్ఞానం పొందకపోతే జీవితకాలం వృథా కాలక్షేపమే. భవ్యజీవితాన్ని దివ్యజీవనంగా తీర్చిదిద్దగల సాధనామార్గంలో పయనించాలి. ఆధ్యాత్మిక సాధనామయ జీవన విధానమే ముక్తిని ప్రసాదిస్తుంది. ఆత్మసాక్షాత్కారానికి ప్రశాంత మానసిక స్థితిని ముందుగానే సాధించాలి. మనసులో చెలరేగే తుపానులన్నీ అశాంతికి సంకేతాలే. నిలకడ లేని మనసుకు సుఖం అందని ద్రాక్ష అంటున్నది గీతోపనిషత్తు. క్షణికమైన సుఖసంతోషాలకే దిక్కులేని మానసిక పరిస్థితిలో ఆనందానుభవం అంటే- ఆకాశానికి నిచ్చెన వేయడమే!
ఆత్మజ్ఞానం అంటే అంతటా బ్రహ్మను చూడగలగడం. ఆత్మపరమాత్మల మధ్య విభజన రేఖ సమసిపోయి తానే బ్రహ్మలా కనిపిస్తాడు. ‘అహంబ్రహ్మాస్మి’ అని యజుర్వేదం, ‘అహం ఆత్మాబ్రహ్మ’ అని అధర్వవేదం, ‘ప్రజ్ఞానం బ్రహ్మ’ అని రుగ్వేదం, ‘తత్త్వమసి’ అని సామవేదం- ఆత్మజ్ఞానానికి బ్రహ్మానందానికి లంకె వేస్తున్నాయి. స్వర్గసుఖాలకోసం వెంపర్లాడుతూ ఉన్నంతకాలం మనిషికి జీవితంలో కైవల్య సుఖం అందుబాటు కాదు. కేవల సుఖమే ఆనందం. దుఃఖం నీడపడగానే సుఖం చల్లారిపోతుంది. సుఖం కోసం చేసేపనులన్నీ చివరికి దుఃఖానికే దారితీస్తాయి. కామ్యకర్మల వల్ల ముక్తి దొరక్కపోగా, రాగద్వేషాలు మరింత చెలరేగుతాయి. నిష్కామకర్మయోగం వల్ల అహంకారం, మమకారం నశించి ఆశించిన నిశ్చలానందం వరిస్తుంది. ఎనభైనాలుగు లక్షల యోనుల నరక యాతన అనంతరం చేజిక్కిన మానవ జీవితం ధన్యమవుతుంది.
- ఉప్పు రాఘవేంద్రరావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రేమే దైవం
ఈ లోకంలో సమస్తాన్నీ కలిపే ఒకే ఒక శక్తి ప్రేమ. ఆ ప్రేమ స్వచ్ఛమైనది. స్వార్థం లేనిది. ద్వేషాన్ని, పశుతత్వాన్ని మనిషి నుంచి తొలగించే దివ్యౌషధం ప్రేమ. అలాంటి ప్రేమ అందరిలో ఉంటే అసమానతలు, ఘర్షణలు, అసూయ, అశాంతి తొలగిపోతాయి. కులమతాలకు అతీతమైన నవసమాజ నిర్మాణానికి కూడా ప్రేమ ఎంతగానో దోహదపడుతుంది. -
నిజ స్వభావం
మనిషి జీవితానికొక పరమార్థం ఉండాలనేవారు శాక్యముని. జీవితానికి అర్థం లేకపోతే బతుకు వ్యర్థమే. నాకెందుకు పుట్టావురా అని కన్నతల్లి ఈసడించుకొనే జీవితం నిరర్థకం. -
శోక పురాణం
పుట్టగానే శిశువు చేసే మొదటి పని ఏడవడం. ‘చిన్నపిల్లలకు ఏడుపే బలం’ అనేది నానుడి. చిన్న వయసులో బాలలకు ఏ ఇతర వ్యాయామాలూ ఉండవు. కాబట్టి ఏడవడం వల్ల అవయవాలు బాగా కదిలి శారీరక వ్యాయామం జరుగుతుంది. -
రంగులహేల... హోలీ!
జీవితం వర్ణమయం. ప్రతి వర్ణం ఒక్కో అనుభూతిని ఆవిష్కరిస్తుంది. ఆ వర్ణాలన్నీ ముంగిట నిలిచి మురిపిస్తే అది రంగుల హరివిల్లుగా, హోలీ పర్వంగా సాకారమవుతుంది. వసంత రుతువు అడుగిడే తరుణంలో ప్రకృతి రసాకృతిని ధరిస్తుంది. ఆకుపచ్చని పొదరిళ్లు, పూలపుంతలతో ముస్తాబవుతాయి. ఆమని పేరంటానికి ప్రకృతి నవ వధువై సింగారించుకుంటుంది. ఆ సందర్భంలో విచ్చేసే అందమైన... -
ప్రవచనం
‘విద్వాంసులేమో అసూయాగ్రస్తులు, ప్రభువులా గర్వాంధులు, ఇక సామాన్యులు అజ్ఞానులు. నేను చెప్పదలచుకున్న సుభాషితం నాలోనే నశించిపోతోంది’ అని వాపోయాడు భర్తృహరి. సుభాషితం అంటే మంచిమాట. మంచి మాటలు వినే సహృదయులు ఈ లోకంలో కనిపించడం లేదని కవి ఆవేదన. -
నిలువునా కాల్చేసే ద్వేషం
మానవ సమాజంలో సమదృష్టి, సమభావన చాలా అవసరం. మనిషి పుట్టింది మొదలు మరణించే వరకు అన్నింటి పట్లా ఒకే విధమైన భావం కలిగి ఉండటం చాలా కష్టం. -
అణువణువునా గురువులే
విద్యాభ్యాసం అంటే గురుముఖతా విద్య నేర్చుకోవడమే అని పలువురి అభిప్రాయం. లౌకికమైన విద్యలు వృత్తి వ్యాపారాల్లో ఉపకరిస్తాయే గాని చదువుల్లోని మర్మాలను వివరించవు. నిశితంగా పరికిస్తే విద్యాలయాల్లో బోధించని విద్యలు జీవిత పాఠాలను చెప్పకనే చెబుతాయి. ఎందరెందరో గురువులు అణువణువునా దర్శనమిస్తారు. -
దేవుడిచ్చిన ఇల్లు
దేహం ఒక దేవాలయమని, అందులో ఉండే జీవుడే దేవుడనీ మహర్షుల వాక్కు. భగవంతుడు ప్రసాదించిన ప్రాణధారణ పంజరం వంటి దేహాన్ని రక్షించుకోవడం మనిషికి అత్యావశ్యకం. ప్రాణం అనే చిలుక, దేహం అనే పంజరంలో సురక్షితంగా ఉంటుంది. -
జీవనాధార ప్రకృతి
ప్రకృతి- జీవరాశికి మాతృక, సౌందర్యానికి ప్రతీక. మానసికోల్లాసానికి నెలవు, ఖేదపడిన మనసుకు ఓదార్పు. ఉద్వేగానికి నిర్వేదానికి ఉపశమనం, కృత్రిమ జీవితం నుంచి ఆటవిడుపు. ప్రకృతి మనిషిలో జిజ్ఞాస రేకెత్తిస్తుంది. అన్వేషణకు స్ఫూర్తినిస్తుంది. కవులకు కళాకారులకు ప్రేరణ కలిగిస్తుంది. చిత్రంలోని ప్రకృతి కంటినే ఆహ్లాదపరుస్తుంది. -
ఎవరు వామనుడు?
భగవంతుడి అవతార విభూతి రెండు విధాలుగా ఉంటుందన్నారు అరవింద యోగి. మనిషిగా రావాలనుకొంటే- మనిషి ఆకారాన్ని, స్వభావాన్ని తనలో ఆవాహన చేసుకొని మరీ దిగిరావడాన్ని ‘అవరోహణ’ అన్నారాయన. -
మనసుతో మనం కాసేపు...
జీవితం అనుభూతుల నిలయం. అనుభవాల మణిహారం. సమాజంలో వ్యక్తులతో అనుబంధాలు పూల అల్లికలా అందంగా సుగంధ భరితంగా నెలకొల్పుకోవాలి. అందుకు ప్రపంచం అంతా నిండి ఉండే ప్రేమ, శాంతి, మంచితనం తోడ్పడతాయి. -
సుసంస్కారం
నిర్మానుష్య కీకారణ్యాల్లో ఒంటరిగా నివసించే మనిషికి ఎలాంటి సభ్యత, సంస్కారం, మర్యాదలతో పనిలేదు. అదే ప్రదేశానికి మరో వ్యక్తి వచ్చినప్పుడే వాటి అవసరం తెలుస్తుంది. వాటిని పాటించకపోతే ఘర్షణ తలెత్తుతుంది. -
ఊరొక్కటే- దారులెన్నో....
ఒక ఊరికి వెళ్ళాలంటే చుట్టుపక్కల గ్రామాలవారు దగ్గరిదోవ చూసుకుంటారు. సులువుగా, తొందరగా, సుఖంగా చేరే మార్గం వెదుక్కుంటారు. తెలియకపోతే తోటివాళ్లను వాకబు చేస్తారు. అలా క్షుణ్నంగా తెలుసుకున్న తరవాత నమ్మకం కలుగుతుంది. -
గోవిందం... పరమానందం!
జీవితంలో ప్రతి మనిషీ పరితపించేది ఆనందం కోసమే. అది అంత సులభంగా అందుబాటు అయ్యే సిద్ధాన్నం కాదని తెలుసు. కష్టపడి సాధించినప్పుడే రససిద్ధి కలుగుతుంది. ఆ ఆనందరసాన్ని అనుక్షణం ఆస్వాదించాలని ఆశించడం మానవ సహజం. -
నీకు నీవే సృష్టికర్తవి!
ప్రతీ మనిషిని ఆ భగవంతుడు సర్వస్వతంత్రుడిగా సృష్టించాడు. అందుకే మనిషి స్వయంకృషితో ఏం సాధించాలనుకున్నా, ఏది పొందాలనుకున్నా అది అతడి చేతుల్లోనే ఉంది. మనిషి వేసే ప్రతి అడుగూ అతడి జీవితపథాన్ని నిర్దేశిస్తుంది. అందువల్ల మనిషి జీవితంలో ఏది జరిగినా అది అతడి ఉన్నతికేనని ప్రతి ఒక్కరూ భావించాలి. -
దైవసన్నిధి
చీకట్లో ఆకాశంవైపు చూసినప్పుడు మనం అశాశ్వతమని గుర్తొస్తుంది. ఎక్కడినుంచి వచ్చామో, మరణం తరవాత ఎక్కడికి వెడతామో తెలియదు. ఇది తీరికలేని జీవితంలో ఒక విరామాన్ని మాత్రం తీసుకొస్తుంది. -
దైవానుగ్రహం
ఆరాధనలతో అల్లాహ్ దాసులు ఆనందించే రోజులు తిరిగివచ్చాయి. రంజాన్ మాసపు నెలవంక ఆకాశవీధిలో మెరవగానే విశ్వాసుల కళ్ళలో సంతోషం విప్పారుతుంది. వెంటనే వారు చేసే దుఆతో ప్రకృతి పరవశిస్తుంది. అనేక భయ ప్రమాదాలు, ఆకలి బాధలు, ధన ప్రాణ, ఆదాయ నష్టాలు చుట్టుముట్టిన ప్రజలకు రక్షగా నిలిచే రంజాన్ పవిత్ర మాసాన్ని అల్లాహ్ తిరిగి అందించాడు. -
సప్త సూత్రాలు
ఆధ్యాత్మిక జీవన వాహిని- అనంతమైన మధుర మనోజ్ఞ తరంగిణి. ఆధ్యాత్మికత అనేది భావన కాదు, జీవన సంవిధానం. చింతనా మార్గంలో ఎవరికివారు సాగించే అలుపెరగని ప్రయాణం. ఆధ్యాత్మిక ధోరణి అంటే కేవలం పూజాది అభిషేకాలకు పరిమితమైంది కాదు. అంతకుమించిన, అవ్యక్తమైన దార్శనిక శక్తి. -
వినయం భూషణం
విద్యార్జనకు, విషయం తెలుసుకోవాలన్న తపనకు, వినయం గుణసంపదగా భాసిల్లి కార్యసాఫల్య మార్గం సుగమం చేస్తుంది. గురుకుల సంస్కృతిలో, సన్యాస ఆశ్రమాల్లో గురువులు శిష్యుల్లో వినయాన్ని చూసేవారు. -
ధర్మ రక్షణ
సుపరిపాలన అనే మాట తరచుగా వింటుంటాం. రామాయణ మహా భారతాల్లో మంచి పరిపాలన అంటే ఏమిటో పాలకులకు ఎలాంటి లక్షణాలు ఉండాలో, ఏ గుణాలు ఉండకూడదో మహర్షులు చెప్పారు. అనేక క్లిష్ట సమయాల్లో ధర్మ స్థాపన యత్నాల్లో సంఘర్షణల్లో పురాణపురుషుల నుంచి మార్గదర్శనం లభించడం మన ఇతిహాసాల్లో కనిపిస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్‌లో సిక్స్‌లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM