
స్ఫూర్తిదాతలు
రాదు, కాదు, లేదు- జరగదు, చేతకాదు, తెలియదు...ఇలాంటివి పలాయన వాదులు చెప్పే మాటలు. కాబట్టి ‘దు’ చివరగా ఉండే ఇలాంటి పదాలు చేదు అన్నాడొక కవి.
అవయవాలు, అవకాశాలు, అవస్థలు లాంటివన్నీ సరిగ్గా ఉన్నా ఏదో ఒక నెపం పెట్టి పనుల్ని వాయిదా వెయ్యడం, తప్పించుకోవడం లాంటివి చేస్తూంటారు చాలా మంది. పైగా తాము చేయని పనులను సమర్థించుకోవడానికి ఏవో సాకులు చెబుతూ ఉంటారు. నిజానికి ఏ అవకాశం లేని వారు, అన్ని దారులూ మూసుకుపోయిన వారు సైతం అసాధ్యాలను సుసాధ్యం చేసి చూపించారు. ‘మనసుంటే మార్గం ఉంటుంది- ఆలోచన ఉంటే అవకాశం కనబడుతుంది’ అనే నానుడిని నిజం చేశారు.
తినగ తినగ వేప తియ్యగా అనిపించినట్టే, పాడగా పాడగా రాగం వినసొంపుగా వస్తుంది. కావలసిందల్లా ‘సాధన’. అది ఉంటే అన్ని పనులూ జరుగుతాయని వేమన ఒక పద్యంలో వివరించాడు.
కన్నడంలో సర్వజ్ఞ, బసవేశ్వరుడు లాంటి వారు, తమిళంలో తిరువళ్లువరు, మరాఠీలో తుకారాం, ఒడియా భాషలో కింబదంతి (జనశ్రుతి) పేరుతో ప్రచారంలో ఉన్న ఎన్నో బోధనలు వివిధ రూపాల్లో స్ఫూర్తిని కలిగి స్తున్నాయి.
సుందరకాండలో సీతమ్మవారి జాడ తెలుసుకోవడం కోసం హనుమంతుడు ఎన్నో ఇక్కట్లు పడ్డాడు. అనుభవించిన వేదన, పొందిన అవమానాలు- నైరాశ్యాలు, ఆమె జాడ తెలియక పోవడంతో ప్రాణ త్యాగం చేసుకోవాలని తీసుకున్న నిర్ణయాలు... వీటన్నింటినీ అధిగమించి తనకు తానే స్ఫూర్తి పొంది సీతమ్మవారి జాడ తెలుసుకోవడంలో కృతకృత్యుడయ్యాడు.
బాలుడైన వరదరాజ్ మందబుద్ధి. గురువు చెప్పినవి ఏవీ తలకెక్కేవి కాదు. చదువు రాదని నిరాశ చెంది ఇంటిదారి పట్టాడు. తోవలో దాహం తీర్చుకునేందుకు నూతి దగ్గరకు వెళ్ళాడు. రాపిడి వల్ల ఏర్పడిన తాళ్ల జాడలున్న నూతి గట్టు, కుండల అడుగు భాగపు రాపిడి వల్ల అరిగి జాడలు ఏర్పడ్డ రాళ్లను చూసి ‘నేను వీటికంటే మందబుద్ధినా?’ అనుకుని గురువు దగ్గరకు తిరిగి వెళ్ళి పట్టుదలతో విద్యాభ్యాసం చేశాడు. పాణినిగా పేరు మారిన అతడు సంస్కత భాషకు ప్రామాణిక వ్యాకరణమైన ‘పాణినీయం’ రచించాడు.
ఏకలవ్యుడికి విద్య నేర్పడానికి నిరాకరించాడు ద్రోణుడు. అయినా ఆయన మూర్తిని ఏర్పాటు చేసుకుని దాన్నే గురువుగా నిలిపి విలువిద్యలో ప్రవీణుడయ్యాడు.
స్టీఫెన్ విలియం హాకింగ్ సుప్రసిద్ధ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త. 21 ఏళ్ల వయసులో నాడీ మండలానికి సంబంధించిన జబ్బు మొదలై క్రమేపీ అతడి అవయవాలన్నీ పూర్తిగా చచ్చుబడేలా చేసింది. మెదడు మాత్రం చక్కగా పనిచేస్తూ ఉండేది. ఆ స్థితిలోనే కృష్ణబిలాలకు(బ్లాక్ హోల్) సంబంధించిన అనేక అంశాలు మొదలుకొని, సైద్ధాంతిక భౌతిక శాస్త్రంలో ఎన్నో పరిశోధనలు చేశాడు. శరీరం కదల్చడానికి కుదరని స్థితిలోనూ చేసిన పరిశోధనా కృషి ఆయనకు ప్రపంచ ప్రఖ్యాతిని తెచ్చిపెట్టింది.
లక్కోజు సంజీవరాయ శర్మ జన్మతః అంధుడు. బ్రెయిలీ లిపి కానీ, అంధుల్ని చేరదీసే వ్యవస్థ కానీ లేని కాలమది. అతడి అక్క పాఠశాలలో చదివిన విషయాలను ఇంటి దగ్గర గొంతెత్తి బిగ్గరగా మననం చేస్తే, వాటిని విని, గుర్తుపెట్టుకుని, గణితంలో అపార విజ్ఞానం సాధించాడు. గణిత మేధావిగా గణనకెక్కాడు. ఇలా... ఎన్నెన్నో ఉదంతాలు, ఉదాహరణలు. ఇవన్నీ అమిత స్ఫూర్తి దాయకాలు.
- అయ్యగారి శ్రీనివాసరావు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Ukraine Crisis: జీ-7 సదస్సు వేళ.. కీవ్‌పై విరుచుకుపడిన రష్యా!
-
Politics News
AAP: ఆప్‌కు చుక్కెదురు! సీఎం మాన్ ఖాళీ చేసిన ఎంపీ స్థానంలో ఓటమి
-
Crime News
Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
-
Technology News
WhatsApp: మహిళల కోసం వాట్సాప్‌లో కొత్త సదుపాయం
-
Movies News
Chiranjeevi: నాకూ గోపీచంద్‌కు ఉన్న సంబంధం అదే: చిరంజీవి
-
World News
Ukraine Crisis: యుద్ధ భూమిలో వివాహ వేడుకలు.. ఒక్కటవుతున్న వేలాది జంటలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- డబుల్ చిన్.. ఇలా తగ్గించుకుందాం!
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Crime News : ఆ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఇంట్లో డబ్బే డబ్బు.. చూస్తే షాకే
- PCOD: అధిక బరువుకు బై బై చెప్పేద్దామా.. పరిష్కార మార్గాలివిగో..!
- Ukraine Crisis: యుద్ధ భూమిలో వివాహ వేడుకలు.. ఒక్కటవుతున్న వేలాది జంటలు
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (25-06-2022)
- Nikhil: లైవ్ ఈవెంట్లో అభిమానికి నిఖిల్ సూపర్ గిఫ్ట్.. ఆ తర్వాత ఏం చేశారంటే..!
- టెస్టుల్లో 100 సిక్సర్లు..అరుదైన క్లబ్లో బెన్ స్టోక్స్
- Prithviraj Sukumaran: ‘సలార్’లో రెండేళ్ల కిందటే అవకాశం వచ్చింది.. కానీ!