ప్రేమను ప్రేమిద్దాం
సృష్టిలోని సకల ప్రాణికోటి మనుగడ ప్రేమపైనే ఆధారపడి ఉంది. ముఖ్యంగా మానవజాతికి భగవంతుడు అందజేసిన మహావరం ప్రేమ. పంచభూతాల ప్రేమ మనకు లభిస్తోంది. గగనంలోని మేఘం మనకు
సృష్టిలోని సకల ప్రాణికోటి మనుగడ ప్రేమపైనే ఆధారపడి ఉంది. ముఖ్యంగా మానవజాతికి భగవంతుడు అందజేసిన మహావరం ప్రేమ. పంచభూతాల ప్రేమ మనకు లభిస్తోంది. గగనంలోని మేఘం మనకు వాననిస్తోంది. వాయువు ప్రేమతో మనకు ఊపిరినిస్తోంది. అగ్ని ప్రేమతో ఆహారం ఇస్తోంది. నీరు ప్రేమతో దాహం తీరుస్తోంది. ప్రతిఫలాపేక్ష ఏమాత్రం లేని ప్రేమ ఇది. వీటిని సద్వినియోగపరుచుకుంటున్నామా?
వేదవాఙ్మయం అంతా ప్రేమనే ప్రబోధిస్తోంది. సకల జీవులు భద్రంగా సుఖప్రదంగా వర్ధిల్లాలని కోరుకుంటోంది. ప్రేమ పొలాల్లో పండేది కాదు, డబ్బుతో కొనగలిగేది కాదు. అహంకారం వదిలేస్తే చాలు- పుష్కలంగా ఎటువైపునుంచైనా అది ఇట్టే చేతికందుతుంది.
విశ్వశాంతికి మూలం ప్రేమ. సర్వమత సారం ప్రేమ. అంతర్యామి అవతార గాథలన్నీ ప్రేమించమనే మహత్తర సందేశాలే ఇస్తున్నాయి. ‘ఎన్ని శాస్త్రాల పాండిత్యం సంపాదించినా పండితుడు ప్రేమ అనే రెండక్షరాల మాటలోని ఆంతర్యం గ్రహించలేకపోతే అతడి పాండిత్యం అంతా వ్యర్థమే’ అంటాడు కబీర్దాసు.
హృదయ సౌందర్యాన్ని, ఆత్మ సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేయగలిగేది ప్రేమయాగం మాత్రమే. ప్రతి మనిషీ ఆ యాగ సోమయాజి కావాలి. ప్రేమిస్తే ప్రేమ వస్తుంది. వచ్చిన ప్రేమను నిలబెట్టుకోవడమూ కష్టమే. ప్రేమ తపస్సు, ఉషస్సు... దేవతలను ప్రసన్నం చేసే హవిస్సు.
నిష్కల్మష ప్రేమ నిస్వార్థ సేవకు దారి చూపుతుంది. ‘నాకు రాజ్యం, స్వర్గం, పునర్జన్మ ఇవేమీ వద్దు... కేవలం కష్టాల్లో ఉన్నవారి కన్నీరు తుడిచే శక్తినివ్వు ప్రభూ!’ అని అర్థిస్తాడు రంతిదేవుడు పరమాత్మను. శ్రీరాముడు సర్వులనూ ప్రేమించాడు. పశుపక్ష్యాదులనూ ప్రేమించాడు. శ్రీకృష్ణుడు తనను నమ్మినవారిని అందరినీ ప్రేమించాడు. గోవులను పోషించి గోపాలుడైనాడు. బాల్యమిత్రుడు కుచేలుడి పట్ల అతడు చూపిన ప్రేమ, స్నేహభావం ఎంతో ఆదర్శవంతమైనవి!
భారతీయ కుటుంబ వ్యవస్థకు అసలైన పునాది- ప్రేమ. కుటుంబ సభ్యుల మధ్య ఉండే సదవగాహన, విశ్వాసం, పరస్పర సహకారం... అన్నింటికీ కారణభూతమైంది ప్రేమ. మానవతా మహావృక్షానికి వేరువంటిది ప్రేమ. మహోన్నత మానవ జీవనయాగానికి అది పూర్ణాహుతి. పవిత్ర ప్రేమ భగవచ్ఛింతనకు ప్రేరకమవుతుంది. ఆధ్యాత్మిక జీవన ప్రస్థానానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. హింస, అత్యాచారం, పగ, ప్రతీకారం లాంటి అవగుణాలను విచ్ఛిన్నం చేస్తుంది. ‘సత్యం శివం, సుందరం’ అనే తాత్త్విక భావనా చైతన్యానికి అంకురారోపణ చేస్తుంది. ‘ప్రేమ ఒక అలౌకిక ఆధ్యాత్మిక భూమిక’ అంటుంది ఉపనిషత్తు. తనను తాను ముందుగా ప్రేమించుకోగలిగే మనిషి అందరినీ, అన్నింటినీ ప్రేమించగలుగుతాడు. ‘ప్రేమే దైవం’ అంటారు విజ్ఞులు.
భాషకు, వ్యాఖ్యకు, నిర్వచనానికి అందని ప్రేమ రెండు మనసులను కలిపే మహామంత్రం. అది ఎన్నో జీవితాలను నిలిపే సజీవ యంత్రం. ఏ ప్రేమ ఎంత కాలం కొనసాగినా రోజూ ఓ చిన్న పలకరింపు, అభిమానపు చిలకరింపు చాలు- అది ప్రేమకు శాశ్వతంగా ప్రాణం పోస్తూనే ఉంటుంది. ప్రేమ ఆత్మీయులను పెంచుతుంది. ద్వేషం మనిషిని తననుంచి తననే దూరం చేస్తుంది. ప్రేమను పొందగలిగే అర్హతను, అధికారాన్ని అందుకోగలిగే ధన్యుణ్ని మించినవాడు ఈ లోకంలో మరెవ్వడూ ఉండడు.
- చిమ్మపూడి శ్రీరామమూర్తి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రేమే దైవం
ఈ లోకంలో సమస్తాన్నీ కలిపే ఒకే ఒక శక్తి ప్రేమ. ఆ ప్రేమ స్వచ్ఛమైనది. స్వార్థం లేనిది. ద్వేషాన్ని, పశుతత్వాన్ని మనిషి నుంచి తొలగించే దివ్యౌషధం ప్రేమ. అలాంటి ప్రేమ అందరిలో ఉంటే అసమానతలు, ఘర్షణలు, అసూయ, అశాంతి తొలగిపోతాయి. కులమతాలకు అతీతమైన నవసమాజ నిర్మాణానికి కూడా ప్రేమ ఎంతగానో దోహదపడుతుంది. -
నిజ స్వభావం
మనిషి జీవితానికొక పరమార్థం ఉండాలనేవారు శాక్యముని. జీవితానికి అర్థం లేకపోతే బతుకు వ్యర్థమే. నాకెందుకు పుట్టావురా అని కన్నతల్లి ఈసడించుకొనే జీవితం నిరర్థకం. -
శోక పురాణం
పుట్టగానే శిశువు చేసే మొదటి పని ఏడవడం. ‘చిన్నపిల్లలకు ఏడుపే బలం’ అనేది నానుడి. చిన్న వయసులో బాలలకు ఏ ఇతర వ్యాయామాలూ ఉండవు. కాబట్టి ఏడవడం వల్ల అవయవాలు బాగా కదిలి శారీరక వ్యాయామం జరుగుతుంది. -
రంగులహేల... హోలీ!
జీవితం వర్ణమయం. ప్రతి వర్ణం ఒక్కో అనుభూతిని ఆవిష్కరిస్తుంది. ఆ వర్ణాలన్నీ ముంగిట నిలిచి మురిపిస్తే అది రంగుల హరివిల్లుగా, హోలీ పర్వంగా సాకారమవుతుంది. వసంత రుతువు అడుగిడే తరుణంలో ప్రకృతి రసాకృతిని ధరిస్తుంది. ఆకుపచ్చని పొదరిళ్లు, పూలపుంతలతో ముస్తాబవుతాయి. ఆమని పేరంటానికి ప్రకృతి నవ వధువై సింగారించుకుంటుంది. ఆ సందర్భంలో విచ్చేసే అందమైన... -
ప్రవచనం
‘విద్వాంసులేమో అసూయాగ్రస్తులు, ప్రభువులా గర్వాంధులు, ఇక సామాన్యులు అజ్ఞానులు. నేను చెప్పదలచుకున్న సుభాషితం నాలోనే నశించిపోతోంది’ అని వాపోయాడు భర్తృహరి. సుభాషితం అంటే మంచిమాట. మంచి మాటలు వినే సహృదయులు ఈ లోకంలో కనిపించడం లేదని కవి ఆవేదన. -
నిలువునా కాల్చేసే ద్వేషం
మానవ సమాజంలో సమదృష్టి, సమభావన చాలా అవసరం. మనిషి పుట్టింది మొదలు మరణించే వరకు అన్నింటి పట్లా ఒకే విధమైన భావం కలిగి ఉండటం చాలా కష్టం. -
అణువణువునా గురువులే
విద్యాభ్యాసం అంటే గురుముఖతా విద్య నేర్చుకోవడమే అని పలువురి అభిప్రాయం. లౌకికమైన విద్యలు వృత్తి వ్యాపారాల్లో ఉపకరిస్తాయే గాని చదువుల్లోని మర్మాలను వివరించవు. నిశితంగా పరికిస్తే విద్యాలయాల్లో బోధించని విద్యలు జీవిత పాఠాలను చెప్పకనే చెబుతాయి. ఎందరెందరో గురువులు అణువణువునా దర్శనమిస్తారు. -
దేవుడిచ్చిన ఇల్లు
దేహం ఒక దేవాలయమని, అందులో ఉండే జీవుడే దేవుడనీ మహర్షుల వాక్కు. భగవంతుడు ప్రసాదించిన ప్రాణధారణ పంజరం వంటి దేహాన్ని రక్షించుకోవడం మనిషికి అత్యావశ్యకం. ప్రాణం అనే చిలుక, దేహం అనే పంజరంలో సురక్షితంగా ఉంటుంది. -
జీవనాధార ప్రకృతి
ప్రకృతి- జీవరాశికి మాతృక, సౌందర్యానికి ప్రతీక. మానసికోల్లాసానికి నెలవు, ఖేదపడిన మనసుకు ఓదార్పు. ఉద్వేగానికి నిర్వేదానికి ఉపశమనం, కృత్రిమ జీవితం నుంచి ఆటవిడుపు. ప్రకృతి మనిషిలో జిజ్ఞాస రేకెత్తిస్తుంది. అన్వేషణకు స్ఫూర్తినిస్తుంది. కవులకు కళాకారులకు ప్రేరణ కలిగిస్తుంది. చిత్రంలోని ప్రకృతి కంటినే ఆహ్లాదపరుస్తుంది. -
ఎవరు వామనుడు?
భగవంతుడి అవతార విభూతి రెండు విధాలుగా ఉంటుందన్నారు అరవింద యోగి. మనిషిగా రావాలనుకొంటే- మనిషి ఆకారాన్ని, స్వభావాన్ని తనలో ఆవాహన చేసుకొని మరీ దిగిరావడాన్ని ‘అవరోహణ’ అన్నారాయన. -
మనసుతో మనం కాసేపు...
జీవితం అనుభూతుల నిలయం. అనుభవాల మణిహారం. సమాజంలో వ్యక్తులతో అనుబంధాలు పూల అల్లికలా అందంగా సుగంధ భరితంగా నెలకొల్పుకోవాలి. అందుకు ప్రపంచం అంతా నిండి ఉండే ప్రేమ, శాంతి, మంచితనం తోడ్పడతాయి. -
సుసంస్కారం
నిర్మానుష్య కీకారణ్యాల్లో ఒంటరిగా నివసించే మనిషికి ఎలాంటి సభ్యత, సంస్కారం, మర్యాదలతో పనిలేదు. అదే ప్రదేశానికి మరో వ్యక్తి వచ్చినప్పుడే వాటి అవసరం తెలుస్తుంది. వాటిని పాటించకపోతే ఘర్షణ తలెత్తుతుంది. -
ఊరొక్కటే- దారులెన్నో....
ఒక ఊరికి వెళ్ళాలంటే చుట్టుపక్కల గ్రామాలవారు దగ్గరిదోవ చూసుకుంటారు. సులువుగా, తొందరగా, సుఖంగా చేరే మార్గం వెదుక్కుంటారు. తెలియకపోతే తోటివాళ్లను వాకబు చేస్తారు. అలా క్షుణ్నంగా తెలుసుకున్న తరవాత నమ్మకం కలుగుతుంది. -
గోవిందం... పరమానందం!
జీవితంలో ప్రతి మనిషీ పరితపించేది ఆనందం కోసమే. అది అంత సులభంగా అందుబాటు అయ్యే సిద్ధాన్నం కాదని తెలుసు. కష్టపడి సాధించినప్పుడే రససిద్ధి కలుగుతుంది. ఆ ఆనందరసాన్ని అనుక్షణం ఆస్వాదించాలని ఆశించడం మానవ సహజం. -
నీకు నీవే సృష్టికర్తవి!
ప్రతీ మనిషిని ఆ భగవంతుడు సర్వస్వతంత్రుడిగా సృష్టించాడు. అందుకే మనిషి స్వయంకృషితో ఏం సాధించాలనుకున్నా, ఏది పొందాలనుకున్నా అది అతడి చేతుల్లోనే ఉంది. మనిషి వేసే ప్రతి అడుగూ అతడి జీవితపథాన్ని నిర్దేశిస్తుంది. అందువల్ల మనిషి జీవితంలో ఏది జరిగినా అది అతడి ఉన్నతికేనని ప్రతి ఒక్కరూ భావించాలి. -
దైవసన్నిధి
చీకట్లో ఆకాశంవైపు చూసినప్పుడు మనం అశాశ్వతమని గుర్తొస్తుంది. ఎక్కడినుంచి వచ్చామో, మరణం తరవాత ఎక్కడికి వెడతామో తెలియదు. ఇది తీరికలేని జీవితంలో ఒక విరామాన్ని మాత్రం తీసుకొస్తుంది. -
దైవానుగ్రహం
ఆరాధనలతో అల్లాహ్ దాసులు ఆనందించే రోజులు తిరిగివచ్చాయి. రంజాన్ మాసపు నెలవంక ఆకాశవీధిలో మెరవగానే విశ్వాసుల కళ్ళలో సంతోషం విప్పారుతుంది. వెంటనే వారు చేసే దుఆతో ప్రకృతి పరవశిస్తుంది. అనేక భయ ప్రమాదాలు, ఆకలి బాధలు, ధన ప్రాణ, ఆదాయ నష్టాలు చుట్టుముట్టిన ప్రజలకు రక్షగా నిలిచే రంజాన్ పవిత్ర మాసాన్ని అల్లాహ్ తిరిగి అందించాడు. -
సప్త సూత్రాలు
ఆధ్యాత్మిక జీవన వాహిని- అనంతమైన మధుర మనోజ్ఞ తరంగిణి. ఆధ్యాత్మికత అనేది భావన కాదు, జీవన సంవిధానం. చింతనా మార్గంలో ఎవరికివారు సాగించే అలుపెరగని ప్రయాణం. ఆధ్యాత్మిక ధోరణి అంటే కేవలం పూజాది అభిషేకాలకు పరిమితమైంది కాదు. అంతకుమించిన, అవ్యక్తమైన దార్శనిక శక్తి. -
వినయం భూషణం
విద్యార్జనకు, విషయం తెలుసుకోవాలన్న తపనకు, వినయం గుణసంపదగా భాసిల్లి కార్యసాఫల్య మార్గం సుగమం చేస్తుంది. గురుకుల సంస్కృతిలో, సన్యాస ఆశ్రమాల్లో గురువులు శిష్యుల్లో వినయాన్ని చూసేవారు. -
ధర్మ రక్షణ
సుపరిపాలన అనే మాట తరచుగా వింటుంటాం. రామాయణ మహా భారతాల్లో మంచి పరిపాలన అంటే ఏమిటో పాలకులకు ఎలాంటి లక్షణాలు ఉండాలో, ఏ గుణాలు ఉండకూడదో మహర్షులు చెప్పారు. అనేక క్లిష్ట సమయాల్లో ధర్మ స్థాపన యత్నాల్లో సంఘర్షణల్లో పురాణపురుషుల నుంచి మార్గదర్శనం లభించడం మన ఇతిహాసాల్లో కనిపిస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్‌నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్‌ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్