సమయపాలన
అనంతమైన కాలవాహినిలో ఒక నిర్దిష్ట భాగాన్నే ‘సమయం’ అంటారు. అది క్షణాలు, నిమిషాలు, గంటలు, రోజులు- ఏదైనా కావచ్చు.
అనంతమైన కాలవాహినిలో ఒక నిర్దిష్ట భాగాన్నే ‘సమయం’ అంటారు. అది క్షణాలు, నిమిషాలు, గంటలు, రోజులు- ఏదైనా కావచ్చు.
మనిషి ప్రతి చర్యను సమయం శాసిస్తుంది. ఏ సమయంలో ఏమి చెయ్యాలో ముందే నిర్దేశితమై ఉంటుంది. మనిషి క్రియలన్నీ ప్రకృతికి అనుసంధానమై ఉన్నంతకాలం సర్వత్రా సత్ఫలితాలే లభిస్తాయి. ప్రకృతికి వ్యతిరేకంగా ఏది చేసినా విరుద్ధ ఫలితాలే ఉంటాయి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు తానే బలిష్ఠమైన, కాలస్వరూపుడినంటాడు. యమధర్మరాజును కాలుడనీ పిలుస్తారు. మృత్యు దేవతా కాల స్వరూపమే.
మనిషి మరణాన్ని జయించగలడా? ఎక్కువ మంది వినోద విలాసాలు సుఖభోగాలతోనే గడపాలనుకుంటారు. లేదా నీతి నియమాలను గాలికి వదలి అక్రమ సంపాదనతో అపర కుబేరులుగా జీవించాలనుకుంటారు. అంతే తప్ప ‘పరోపకార మిదమ్ శరీరమ్’ అనే ఆర్యోక్తిని ఆచరించాలని పొరపాటునైనా అనుకోరు. శరీరంతో సుదీర్ఘకాలం జీవిస్తూ, స్వార్థానికి పెద్దపీట వేసేకన్నా, ఆదిశంకరుల్లా అల్పాయుష్షుతో జీవించినా జీవన సాఫల్యాన్ని సాధించి కీర్తి శరీరంతో చిరంజీవిగా ఉండిపోవచ్చు.
ఈ లోకంలోకి అనునిత్యం లక్షలమంది వస్తూ, మరికొన్ని లక్షలమంది నిష్క్రమిస్తున్నారు. కానీ, కాల చరిత్రలో వీరిలో బహుకొద్ది మంది మాత్రమే కనిపిస్తారు. ఆ కొద్ది మందే తమ జీవితాలను సార్థకం చేసుకోగలిగినట్లు మనం గ్రహించాలి. అర్థవంతంగా జీవించడమే సార్థకత.
అర్ధవంతమైన జీవితమంటే కోట్లాది రూపాయల ధనం కన్నా విలువైన ప్రతిక్షణాన్ని సద్వినియోగం చేసుకోవడం. ప్రతి మనిషీ తనకొక వ్యాపకం పెట్టుకుంటాడు. అది వృత్తి, లలితకళలు, సాహిత్యం వంటిది ఏదైనా కావచ్చు. ఉద్యోగమూ కావచ్చు. అందులో అంకితభావం ఉంటేనే సత్ఫలితాలు, పదోన్నతులు, ప్రశంసలు, పురస్కారాలు, ప్రజ్ఞకు గుర్తింపు లభిస్తాయి. అసలు ప్రజ్ఞ లభించాలంటేనే గట్టి పట్టుదలతో తాను ఎంపిక చేసుకున్న రంగంలో కృషి చెయ్యాలి. ఎంత కృషి చేస్తే అంత ఫలితాలు తప్పక లభిస్తాయి. విద్యార్థుల చదువు విషయమూ అంతే. ఏ రంగానికైనా ఇది వర్తిస్తుంది. భక్తి స్థాయిని బట్టే ఫలితాలు, దైవానుగ్రహం లభిస్తాయి.
చాలా మంది తమ కృషిని గురించి తామే ఘనంగా భావిస్తారు. కొందరు ఆర్బాటంగా సందర్భం లేకపోయినా ప్రచారాలు చేసుకుంటారు. దానివల్ల అపహాస్యం పాలబడే ప్రమాదం ఉంది. ఎవరి పరీక్షా పత్రానికి వారే మార్కులు వేసుకోనట్టే, ఎవరి కృషిని వారు నిర్ణయించుకోకూడదు.
ప్రతిక్షణాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ‘దైవనామస్మరణ’ అత్యుత్తమంగా మహర్షులు చెప్పారు. నామస్మరణ చేస్తూనే తమ నిత్యకృత్యాలు చక్కబెట్టుకోవచ్చు. సద్గురు గోవిందసింగ్ ‘యుద్ధంలో ఉన్నా హృదయంలో పరమాత్మను నిలుపుకోవాలి’ అన్న అమృతవాక్కులు అందరికీ శిరోధార్యం. ఎందుకంటే జీవితమే ఒక యుద్ధరంగం. ఇక్కడ సమయానికి మించిన ఆయుధాలు ఉండవు. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమే జీవన సాఫల్యం.
- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రేమే దైవం
ఈ లోకంలో సమస్తాన్నీ కలిపే ఒకే ఒక శక్తి ప్రేమ. ఆ ప్రేమ స్వచ్ఛమైనది. స్వార్థం లేనిది. ద్వేషాన్ని, పశుతత్వాన్ని మనిషి నుంచి తొలగించే దివ్యౌషధం ప్రేమ. అలాంటి ప్రేమ అందరిలో ఉంటే అసమానతలు, ఘర్షణలు, అసూయ, అశాంతి తొలగిపోతాయి. కులమతాలకు అతీతమైన నవసమాజ నిర్మాణానికి కూడా ప్రేమ ఎంతగానో దోహదపడుతుంది. -
నిజ స్వభావం
మనిషి జీవితానికొక పరమార్థం ఉండాలనేవారు శాక్యముని. జీవితానికి అర్థం లేకపోతే బతుకు వ్యర్థమే. నాకెందుకు పుట్టావురా అని కన్నతల్లి ఈసడించుకొనే జీవితం నిరర్థకం. -
శోక పురాణం
పుట్టగానే శిశువు చేసే మొదటి పని ఏడవడం. ‘చిన్నపిల్లలకు ఏడుపే బలం’ అనేది నానుడి. చిన్న వయసులో బాలలకు ఏ ఇతర వ్యాయామాలూ ఉండవు. కాబట్టి ఏడవడం వల్ల అవయవాలు బాగా కదిలి శారీరక వ్యాయామం జరుగుతుంది. -
రంగులహేల... హోలీ!
జీవితం వర్ణమయం. ప్రతి వర్ణం ఒక్కో అనుభూతిని ఆవిష్కరిస్తుంది. ఆ వర్ణాలన్నీ ముంగిట నిలిచి మురిపిస్తే అది రంగుల హరివిల్లుగా, హోలీ పర్వంగా సాకారమవుతుంది. వసంత రుతువు అడుగిడే తరుణంలో ప్రకృతి రసాకృతిని ధరిస్తుంది. ఆకుపచ్చని పొదరిళ్లు, పూలపుంతలతో ముస్తాబవుతాయి. ఆమని పేరంటానికి ప్రకృతి నవ వధువై సింగారించుకుంటుంది. ఆ సందర్భంలో విచ్చేసే అందమైన... -
ప్రవచనం
‘విద్వాంసులేమో అసూయాగ్రస్తులు, ప్రభువులా గర్వాంధులు, ఇక సామాన్యులు అజ్ఞానులు. నేను చెప్పదలచుకున్న సుభాషితం నాలోనే నశించిపోతోంది’ అని వాపోయాడు భర్తృహరి. సుభాషితం అంటే మంచిమాట. మంచి మాటలు వినే సహృదయులు ఈ లోకంలో కనిపించడం లేదని కవి ఆవేదన. -
నిలువునా కాల్చేసే ద్వేషం
మానవ సమాజంలో సమదృష్టి, సమభావన చాలా అవసరం. మనిషి పుట్టింది మొదలు మరణించే వరకు అన్నింటి పట్లా ఒకే విధమైన భావం కలిగి ఉండటం చాలా కష్టం. -
అణువణువునా గురువులే
విద్యాభ్యాసం అంటే గురుముఖతా విద్య నేర్చుకోవడమే అని పలువురి అభిప్రాయం. లౌకికమైన విద్యలు వృత్తి వ్యాపారాల్లో ఉపకరిస్తాయే గాని చదువుల్లోని మర్మాలను వివరించవు. నిశితంగా పరికిస్తే విద్యాలయాల్లో బోధించని విద్యలు జీవిత పాఠాలను చెప్పకనే చెబుతాయి. ఎందరెందరో గురువులు అణువణువునా దర్శనమిస్తారు. -
దేవుడిచ్చిన ఇల్లు
దేహం ఒక దేవాలయమని, అందులో ఉండే జీవుడే దేవుడనీ మహర్షుల వాక్కు. భగవంతుడు ప్రసాదించిన ప్రాణధారణ పంజరం వంటి దేహాన్ని రక్షించుకోవడం మనిషికి అత్యావశ్యకం. ప్రాణం అనే చిలుక, దేహం అనే పంజరంలో సురక్షితంగా ఉంటుంది. -
జీవనాధార ప్రకృతి
ప్రకృతి- జీవరాశికి మాతృక, సౌందర్యానికి ప్రతీక. మానసికోల్లాసానికి నెలవు, ఖేదపడిన మనసుకు ఓదార్పు. ఉద్వేగానికి నిర్వేదానికి ఉపశమనం, కృత్రిమ జీవితం నుంచి ఆటవిడుపు. ప్రకృతి మనిషిలో జిజ్ఞాస రేకెత్తిస్తుంది. అన్వేషణకు స్ఫూర్తినిస్తుంది. కవులకు కళాకారులకు ప్రేరణ కలిగిస్తుంది. చిత్రంలోని ప్రకృతి కంటినే ఆహ్లాదపరుస్తుంది. -
ఎవరు వామనుడు?
భగవంతుడి అవతార విభూతి రెండు విధాలుగా ఉంటుందన్నారు అరవింద యోగి. మనిషిగా రావాలనుకొంటే- మనిషి ఆకారాన్ని, స్వభావాన్ని తనలో ఆవాహన చేసుకొని మరీ దిగిరావడాన్ని ‘అవరోహణ’ అన్నారాయన. -
మనసుతో మనం కాసేపు...
జీవితం అనుభూతుల నిలయం. అనుభవాల మణిహారం. సమాజంలో వ్యక్తులతో అనుబంధాలు పూల అల్లికలా అందంగా సుగంధ భరితంగా నెలకొల్పుకోవాలి. అందుకు ప్రపంచం అంతా నిండి ఉండే ప్రేమ, శాంతి, మంచితనం తోడ్పడతాయి. -
సుసంస్కారం
నిర్మానుష్య కీకారణ్యాల్లో ఒంటరిగా నివసించే మనిషికి ఎలాంటి సభ్యత, సంస్కారం, మర్యాదలతో పనిలేదు. అదే ప్రదేశానికి మరో వ్యక్తి వచ్చినప్పుడే వాటి అవసరం తెలుస్తుంది. వాటిని పాటించకపోతే ఘర్షణ తలెత్తుతుంది. -
ఊరొక్కటే- దారులెన్నో....
ఒక ఊరికి వెళ్ళాలంటే చుట్టుపక్కల గ్రామాలవారు దగ్గరిదోవ చూసుకుంటారు. సులువుగా, తొందరగా, సుఖంగా చేరే మార్గం వెదుక్కుంటారు. తెలియకపోతే తోటివాళ్లను వాకబు చేస్తారు. అలా క్షుణ్నంగా తెలుసుకున్న తరవాత నమ్మకం కలుగుతుంది. -
గోవిందం... పరమానందం!
జీవితంలో ప్రతి మనిషీ పరితపించేది ఆనందం కోసమే. అది అంత సులభంగా అందుబాటు అయ్యే సిద్ధాన్నం కాదని తెలుసు. కష్టపడి సాధించినప్పుడే రససిద్ధి కలుగుతుంది. ఆ ఆనందరసాన్ని అనుక్షణం ఆస్వాదించాలని ఆశించడం మానవ సహజం. -
నీకు నీవే సృష్టికర్తవి!
ప్రతీ మనిషిని ఆ భగవంతుడు సర్వస్వతంత్రుడిగా సృష్టించాడు. అందుకే మనిషి స్వయంకృషితో ఏం సాధించాలనుకున్నా, ఏది పొందాలనుకున్నా అది అతడి చేతుల్లోనే ఉంది. మనిషి వేసే ప్రతి అడుగూ అతడి జీవితపథాన్ని నిర్దేశిస్తుంది. అందువల్ల మనిషి జీవితంలో ఏది జరిగినా అది అతడి ఉన్నతికేనని ప్రతి ఒక్కరూ భావించాలి. -
దైవసన్నిధి
చీకట్లో ఆకాశంవైపు చూసినప్పుడు మనం అశాశ్వతమని గుర్తొస్తుంది. ఎక్కడినుంచి వచ్చామో, మరణం తరవాత ఎక్కడికి వెడతామో తెలియదు. ఇది తీరికలేని జీవితంలో ఒక విరామాన్ని మాత్రం తీసుకొస్తుంది. -
దైవానుగ్రహం
ఆరాధనలతో అల్లాహ్ దాసులు ఆనందించే రోజులు తిరిగివచ్చాయి. రంజాన్ మాసపు నెలవంక ఆకాశవీధిలో మెరవగానే విశ్వాసుల కళ్ళలో సంతోషం విప్పారుతుంది. వెంటనే వారు చేసే దుఆతో ప్రకృతి పరవశిస్తుంది. అనేక భయ ప్రమాదాలు, ఆకలి బాధలు, ధన ప్రాణ, ఆదాయ నష్టాలు చుట్టుముట్టిన ప్రజలకు రక్షగా నిలిచే రంజాన్ పవిత్ర మాసాన్ని అల్లాహ్ తిరిగి అందించాడు. -
సప్త సూత్రాలు
ఆధ్యాత్మిక జీవన వాహిని- అనంతమైన మధుర మనోజ్ఞ తరంగిణి. ఆధ్యాత్మికత అనేది భావన కాదు, జీవన సంవిధానం. చింతనా మార్గంలో ఎవరికివారు సాగించే అలుపెరగని ప్రయాణం. ఆధ్యాత్మిక ధోరణి అంటే కేవలం పూజాది అభిషేకాలకు పరిమితమైంది కాదు. అంతకుమించిన, అవ్యక్తమైన దార్శనిక శక్తి. -
వినయం భూషణం
విద్యార్జనకు, విషయం తెలుసుకోవాలన్న తపనకు, వినయం గుణసంపదగా భాసిల్లి కార్యసాఫల్య మార్గం సుగమం చేస్తుంది. గురుకుల సంస్కృతిలో, సన్యాస ఆశ్రమాల్లో గురువులు శిష్యుల్లో వినయాన్ని చూసేవారు. -
ధర్మ రక్షణ
సుపరిపాలన అనే మాట తరచుగా వింటుంటాం. రామాయణ మహా భారతాల్లో మంచి పరిపాలన అంటే ఏమిటో పాలకులకు ఎలాంటి లక్షణాలు ఉండాలో, ఏ గుణాలు ఉండకూడదో మహర్షులు చెప్పారు. అనేక క్లిష్ట సమయాల్లో ధర్మ స్థాపన యత్నాల్లో సంఘర్షణల్లో పురాణపురుషుల నుంచి మార్గదర్శనం లభించడం మన ఇతిహాసాల్లో కనిపిస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్‌బర్గ్ గాలం?
-
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్‌కతా మాజీ ఆటగాడు
-
కేసీఆర్ ఎవరినీ నమ్మలేదు.. అందుకే ఫోన్ ట్యాపింగ్: భాజపా ఎంపీ లక్ష్మణ్
-
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
-
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
-
భారత సంతతి డాక్టర్‌కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్