నిరీక్షణ
సద్భావం, విశ్వాసం, శాంతి, కరుణ, దానం, సత్యభాషణం, అహింస, సహాయం, ధైర్యం, సంతోషం, ప్రేరణ, సమృద్ధి, ప్రేమ... ఇవన్నీ ఆధ్యాత్మిక సంపదలో భాగమైన అంశాలు. పలికినంత మాత్రాన సానుకూల శక్తిని పెంచి పోషించగల పదాలివి. అలాంటిదే మరో ...
సద్భావం, విశ్వాసం, శాంతి, కరుణ, దానం, సత్యభాషణం, అహింస, సహాయం, ధైర్యం, సంతోషం, ప్రేరణ, సమృద్ధి, ప్రేమ... ఇవన్నీ ఆధ్యాత్మిక సంపదలో భాగమైన అంశాలు. పలికినంత మాత్రాన సానుకూల శక్తిని పెంచి పోషించగల పదాలివి. అలాంటిదే మరో విలక్షణమైన సానుకూల పదం ఉంది. అదే నిరీక్షణ!
అందరూ మంచే జరగాలని కోరుకుంటారు. మంచి ఓ జంట పదం. దాని వెంట చెడు ఉంటుంది. వెలుగు పక్కన నీడలా! రాత్రి గడిచాక ఉషోదయపు సంధ్యవెలుగులు అనుసరిస్తాయి. ప్రతికూల శక్తి సానుకూల శక్తి వెనక నీడలా తన ఉనికిని చాటుకుంటుంది. దానిపై ఒక కన్నేసి ఉంచాలి. కార్య సాఫల్యతను కోరుకుంటాం కాబట్టి ఆటంకాలను వదిలించుకోవాలి. ప్రతికూలశక్తిని అణచివేయగల సామర్థ్యం సానుకూల శక్తికే ఉంది. అందుకు కావలసింది మనిషిలో పరిపూర్ణమైన విశ్వాసం! ఆత్మవిశ్వాసంతో ఎవరైనా సానుకూల స్థితిని సృష్టించుకోవచ్చన్నది పరిశో ధకుల మాట! ఓ కొత్త వస్తువు కొనడం, ఇష్టపడిన కొత్త వ్యక్తితో పరిచయం, పెళ్ళిచూపులు, వివాహం, శుభకార్యం, ఉద్యోగప్రాప్తి, ధనప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి... ఇలాంటి ఎన్నో అంశాలు మానవుడిలో సహజంగానే ఉత్సుకతను రేకెత్తిస్తాయి. వాటి కార్యరూపం కోసం మనిషి తహతహ లాడతాడు. మనసులో వాటి భావన సైతం తీయని తలపును రేకెత్తిస్తుంది. నిరీక్షణలో అంత ఆనందం ఉంది కాబట్టే కవి, విరహం (తాత్కాలిక ఎడబాటు, తదనంతర సమాగమం కోసం నిరీక్షణ) కూడా సుఖమే కాదా, విరహపు చింతన మధురం కాదా అన్నాడు.
కోరికల సాకారం కోసం చేసే నిరీక్షణ అందరికీ అనుభవమే. ఆ శుభఘడియ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తాం. ఒకప్పుడు బంధుమిత్రుల నుంచి వచ్చే ఉత్తరాల కోసం ఎదురుచూసిన అనుభవాలు అందరికీ ఉండేవి. అదో విశ్వజనీనమైన అనుభవం!
ఎదురుచూపులను ఓ అందమైన అనుభవంగా చెబుతారు శాస్త్రవేత్తలు. నిరీక్షణలోని ఆనందం అనుభవంలోకి వచ్చి ఒళ్ళు పులకరించగా ఆహ్లాదభరిత రసాయనం డోపమైన్ శరీరంలో విడుదలవుతుంది. దానివల్ల మనిషిలో శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందని, తద్వారా మనశ్శరీరాలకు స్వస్థత చేకూరుతుందని శాస్త్రవేత్తలు చెబుతారు. డోపమైన్ వల్ల శరీర కణాలు సానుకూల స్పందనలు పొందుతాయని దానివల్ల ఆనందం పెల్లుబుకుతుందని మనోవిజ్ఞానం చెబుతుంది.
ఆనందరసాలు స్రవించినప్పుడు చదువుకున్న విషయాలు చక్కగా గుర్తుండటమేకాక, మానవప్రమేయంతో సంబంధంలేని శ్వాసక్రియ, హృదయస్పందన వంటి శరీర వ్యాపకాలు ఆరోగ్యప్రదంగా సాగుతాయంటున్నారు. మనిషి మానసికంగా ఉల్లాసంగా ఉండటమేకాక చక్కని నిద్ర, మంచి జీర్ణక్రియ, చురుకుగా ఆకలి, కొత్తవిషయాల పట్ల ఆసక్తి... ఇత్యాది అనుభవాలు సొంతమవుతాయని విజ్ఞాన శాస్త్రం చెబుతుంది. నిరీక్షణ, జరగగల శుభకార్యం కోసం మనసు, శరీరం ఆరాటంతో, ఆశాభావంతో ఎదురుచూసే ముచ్చటైన సమయం. ఆనందాన్ని ఇవ్వగల ఒక అంశాన్ని నిజం చేసుకోవడం కోసం అలా ఎదురుచూసే అనుభవం అటు శరీరానికి ఇటు మనసుకు ఆరోగ్యప్రదం అంటున్న శాస్త్రవేత్తల మాటలను పట్టించుకుందాం. చక్కని మానసిక, ఆధ్యాత్మిక, ఆరోగ్య ప్రయోజనాలు పొందుదాం!
- గోపాలుని రఘుపతిరావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రేమే దైవం
ఈ లోకంలో సమస్తాన్నీ కలిపే ఒకే ఒక శక్తి ప్రేమ. ఆ ప్రేమ స్వచ్ఛమైనది. స్వార్థం లేనిది. ద్వేషాన్ని, పశుతత్వాన్ని మనిషి నుంచి తొలగించే దివ్యౌషధం ప్రేమ. అలాంటి ప్రేమ అందరిలో ఉంటే అసమానతలు, ఘర్షణలు, అసూయ, అశాంతి తొలగిపోతాయి. కులమతాలకు అతీతమైన నవసమాజ నిర్మాణానికి కూడా ప్రేమ ఎంతగానో దోహదపడుతుంది. -
నిజ స్వభావం
మనిషి జీవితానికొక పరమార్థం ఉండాలనేవారు శాక్యముని. జీవితానికి అర్థం లేకపోతే బతుకు వ్యర్థమే. నాకెందుకు పుట్టావురా అని కన్నతల్లి ఈసడించుకొనే జీవితం నిరర్థకం. -
శోక పురాణం
పుట్టగానే శిశువు చేసే మొదటి పని ఏడవడం. ‘చిన్నపిల్లలకు ఏడుపే బలం’ అనేది నానుడి. చిన్న వయసులో బాలలకు ఏ ఇతర వ్యాయామాలూ ఉండవు. కాబట్టి ఏడవడం వల్ల అవయవాలు బాగా కదిలి శారీరక వ్యాయామం జరుగుతుంది. -
రంగులహేల... హోలీ!
జీవితం వర్ణమయం. ప్రతి వర్ణం ఒక్కో అనుభూతిని ఆవిష్కరిస్తుంది. ఆ వర్ణాలన్నీ ముంగిట నిలిచి మురిపిస్తే అది రంగుల హరివిల్లుగా, హోలీ పర్వంగా సాకారమవుతుంది. వసంత రుతువు అడుగిడే తరుణంలో ప్రకృతి రసాకృతిని ధరిస్తుంది. ఆకుపచ్చని పొదరిళ్లు, పూలపుంతలతో ముస్తాబవుతాయి. ఆమని పేరంటానికి ప్రకృతి నవ వధువై సింగారించుకుంటుంది. ఆ సందర్భంలో విచ్చేసే అందమైన... -
ప్రవచనం
‘విద్వాంసులేమో అసూయాగ్రస్తులు, ప్రభువులా గర్వాంధులు, ఇక సామాన్యులు అజ్ఞానులు. నేను చెప్పదలచుకున్న సుభాషితం నాలోనే నశించిపోతోంది’ అని వాపోయాడు భర్తృహరి. సుభాషితం అంటే మంచిమాట. మంచి మాటలు వినే సహృదయులు ఈ లోకంలో కనిపించడం లేదని కవి ఆవేదన. -
నిలువునా కాల్చేసే ద్వేషం
మానవ సమాజంలో సమదృష్టి, సమభావన చాలా అవసరం. మనిషి పుట్టింది మొదలు మరణించే వరకు అన్నింటి పట్లా ఒకే విధమైన భావం కలిగి ఉండటం చాలా కష్టం. -
అణువణువునా గురువులే
విద్యాభ్యాసం అంటే గురుముఖతా విద్య నేర్చుకోవడమే అని పలువురి అభిప్రాయం. లౌకికమైన విద్యలు వృత్తి వ్యాపారాల్లో ఉపకరిస్తాయే గాని చదువుల్లోని మర్మాలను వివరించవు. నిశితంగా పరికిస్తే విద్యాలయాల్లో బోధించని విద్యలు జీవిత పాఠాలను చెప్పకనే చెబుతాయి. ఎందరెందరో గురువులు అణువణువునా దర్శనమిస్తారు. -
దేవుడిచ్చిన ఇల్లు
దేహం ఒక దేవాలయమని, అందులో ఉండే జీవుడే దేవుడనీ మహర్షుల వాక్కు. భగవంతుడు ప్రసాదించిన ప్రాణధారణ పంజరం వంటి దేహాన్ని రక్షించుకోవడం మనిషికి అత్యావశ్యకం. ప్రాణం అనే చిలుక, దేహం అనే పంజరంలో సురక్షితంగా ఉంటుంది. -
జీవనాధార ప్రకృతి
ప్రకృతి- జీవరాశికి మాతృక, సౌందర్యానికి ప్రతీక. మానసికోల్లాసానికి నెలవు, ఖేదపడిన మనసుకు ఓదార్పు. ఉద్వేగానికి నిర్వేదానికి ఉపశమనం, కృత్రిమ జీవితం నుంచి ఆటవిడుపు. ప్రకృతి మనిషిలో జిజ్ఞాస రేకెత్తిస్తుంది. అన్వేషణకు స్ఫూర్తినిస్తుంది. కవులకు కళాకారులకు ప్రేరణ కలిగిస్తుంది. చిత్రంలోని ప్రకృతి కంటినే ఆహ్లాదపరుస్తుంది. -
ఎవరు వామనుడు?
భగవంతుడి అవతార విభూతి రెండు విధాలుగా ఉంటుందన్నారు అరవింద యోగి. మనిషిగా రావాలనుకొంటే- మనిషి ఆకారాన్ని, స్వభావాన్ని తనలో ఆవాహన చేసుకొని మరీ దిగిరావడాన్ని ‘అవరోహణ’ అన్నారాయన. -
మనసుతో మనం కాసేపు...
జీవితం అనుభూతుల నిలయం. అనుభవాల మణిహారం. సమాజంలో వ్యక్తులతో అనుబంధాలు పూల అల్లికలా అందంగా సుగంధ భరితంగా నెలకొల్పుకోవాలి. అందుకు ప్రపంచం అంతా నిండి ఉండే ప్రేమ, శాంతి, మంచితనం తోడ్పడతాయి. -
సుసంస్కారం
నిర్మానుష్య కీకారణ్యాల్లో ఒంటరిగా నివసించే మనిషికి ఎలాంటి సభ్యత, సంస్కారం, మర్యాదలతో పనిలేదు. అదే ప్రదేశానికి మరో వ్యక్తి వచ్చినప్పుడే వాటి అవసరం తెలుస్తుంది. వాటిని పాటించకపోతే ఘర్షణ తలెత్తుతుంది. -
ఊరొక్కటే- దారులెన్నో....
ఒక ఊరికి వెళ్ళాలంటే చుట్టుపక్కల గ్రామాలవారు దగ్గరిదోవ చూసుకుంటారు. సులువుగా, తొందరగా, సుఖంగా చేరే మార్గం వెదుక్కుంటారు. తెలియకపోతే తోటివాళ్లను వాకబు చేస్తారు. అలా క్షుణ్నంగా తెలుసుకున్న తరవాత నమ్మకం కలుగుతుంది. -
గోవిందం... పరమానందం!
జీవితంలో ప్రతి మనిషీ పరితపించేది ఆనందం కోసమే. అది అంత సులభంగా అందుబాటు అయ్యే సిద్ధాన్నం కాదని తెలుసు. కష్టపడి సాధించినప్పుడే రససిద్ధి కలుగుతుంది. ఆ ఆనందరసాన్ని అనుక్షణం ఆస్వాదించాలని ఆశించడం మానవ సహజం. -
నీకు నీవే సృష్టికర్తవి!
ప్రతీ మనిషిని ఆ భగవంతుడు సర్వస్వతంత్రుడిగా సృష్టించాడు. అందుకే మనిషి స్వయంకృషితో ఏం సాధించాలనుకున్నా, ఏది పొందాలనుకున్నా అది అతడి చేతుల్లోనే ఉంది. మనిషి వేసే ప్రతి అడుగూ అతడి జీవితపథాన్ని నిర్దేశిస్తుంది. అందువల్ల మనిషి జీవితంలో ఏది జరిగినా అది అతడి ఉన్నతికేనని ప్రతి ఒక్కరూ భావించాలి. -
దైవసన్నిధి
చీకట్లో ఆకాశంవైపు చూసినప్పుడు మనం అశాశ్వతమని గుర్తొస్తుంది. ఎక్కడినుంచి వచ్చామో, మరణం తరవాత ఎక్కడికి వెడతామో తెలియదు. ఇది తీరికలేని జీవితంలో ఒక విరామాన్ని మాత్రం తీసుకొస్తుంది. -
దైవానుగ్రహం
ఆరాధనలతో అల్లాహ్ దాసులు ఆనందించే రోజులు తిరిగివచ్చాయి. రంజాన్ మాసపు నెలవంక ఆకాశవీధిలో మెరవగానే విశ్వాసుల కళ్ళలో సంతోషం విప్పారుతుంది. వెంటనే వారు చేసే దుఆతో ప్రకృతి పరవశిస్తుంది. అనేక భయ ప్రమాదాలు, ఆకలి బాధలు, ధన ప్రాణ, ఆదాయ నష్టాలు చుట్టుముట్టిన ప్రజలకు రక్షగా నిలిచే రంజాన్ పవిత్ర మాసాన్ని అల్లాహ్ తిరిగి అందించాడు. -
సప్త సూత్రాలు
ఆధ్యాత్మిక జీవన వాహిని- అనంతమైన మధుర మనోజ్ఞ తరంగిణి. ఆధ్యాత్మికత అనేది భావన కాదు, జీవన సంవిధానం. చింతనా మార్గంలో ఎవరికివారు సాగించే అలుపెరగని ప్రయాణం. ఆధ్యాత్మిక ధోరణి అంటే కేవలం పూజాది అభిషేకాలకు పరిమితమైంది కాదు. అంతకుమించిన, అవ్యక్తమైన దార్శనిక శక్తి. -
వినయం భూషణం
విద్యార్జనకు, విషయం తెలుసుకోవాలన్న తపనకు, వినయం గుణసంపదగా భాసిల్లి కార్యసాఫల్య మార్గం సుగమం చేస్తుంది. గురుకుల సంస్కృతిలో, సన్యాస ఆశ్రమాల్లో గురువులు శిష్యుల్లో వినయాన్ని చూసేవారు. -
ధర్మ రక్షణ
సుపరిపాలన అనే మాట తరచుగా వింటుంటాం. రామాయణ మహా భారతాల్లో మంచి పరిపాలన అంటే ఏమిటో పాలకులకు ఎలాంటి లక్షణాలు ఉండాలో, ఏ గుణాలు ఉండకూడదో మహర్షులు చెప్పారు. అనేక క్లిష్ట సమయాల్లో ధర్మ స్థాపన యత్నాల్లో సంఘర్షణల్లో పురాణపురుషుల నుంచి మార్గదర్శనం లభించడం మన ఇతిహాసాల్లో కనిపిస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు