ఆనంద దీపం
సృష్టిలో ఓ ఒరవడి ఉంది. తగిలిన దెబ్బపైనే ఎదురుదెబ్బ తగులుతుంది. వెతికేది ఏదీ వెంటనే కనిపించదు. ఒక వాహనం కోసం ఎదురు చూస్తుంటే- ఎక్కవలసిన వాహనం తప్పించి మిగిలినవన్నీ వస్తుండటం ఎంతోమందికి అనుభవమే.
సృష్టిలో ఓ ఒరవడి ఉంది. తగిలిన దెబ్బపైనే ఎదురుదెబ్బ తగులుతుంది. వెతికేది ఏదీ వెంటనే కనిపించదు. ఒక వాహనం కోసం ఎదురు చూస్తుంటే- ఎక్కవలసిన వాహనం తప్పించి మిగిలినవన్నీ వస్తుండటం ఎంతోమందికి అనుభవమే. తాను ఎక్కవలసిన రైలు జీవితకాలం ఆలస్యం అన్న ఛలోక్తి చాలామంది వినే ఉంటారు.
అనుకున్నది అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎలా అవుతుందని ప్రశ్నిస్తారు తత్వవేత్తలు. జీవితం మూన్నాళ్ల ముచ్చట అనే మాట వింటుంటాం. బాల్య కౌమార యౌవనాలు వడివడిగా గడిచిపోతాయి. గృహస్థ జీవితం భారంగా సాగుతుంది. అప్పుడే వెంట్రుకలు తెల్లబడ్డాయి, ముసలితనం వచ్చేసిందన్న బెంగ బాధిస్తుంది. మలి వయసులో కాలగమనం- ముందు రోజులకన్నా భారమవుతుంది. శరీరంలో ఎక్కడో ఒకచోట ప్రతి దినం బాధ అనుభవించడం వృద్ధాప్యంలో పరిపాటి అవుతుంది. నిజంగా నువ్వు ఏమిటో ఆ వాస్తవాన్ని అంగీకరిస్తే అంతటా ఆనందమే అన్నది మనస్తత్వ నిపుణుల మాట. చిన్నతనంలో తన రూపం గురించి ఎలాంటి అంచనా, ఆలోచన ఉండవు. యౌవనంలో అందచందాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఆకాశంలో నక్షత్రాల్లా అక్కడక్కడా తలపై తెల్ల వెంట్రుకలు కనపడగానే నిరాశ ఆవహిస్తుంది. తనకు ఏదో జరిగిపోతోందని బెంగ పెట్టుకుంటాడు; దాచిపెట్టేందుకు అనేక ఉపాయాలను ఆశ్రయిస్తాడు.
ప్రకృతికి, కాలానికి ఓ ఒరవడి ఉంది. అదో ప్రవాహం. కాలం జలపాతంలా ముందుకు ఉరుకుతుందే తప్ప వెనకచూపు ఉండదు. సాగిపోయే కాలప్రవాహంలో ప్రాణులు సమిధలు. ప్రాణుల ఉనికి ప్రపంచంలో తాత్కాలికం. వెలిగించిన దీపాలు నూనె నిండుకోగానే ఆరిపోయినట్లు భగవంతుడు వెలిగించిన చిరుదీపాలైన ప్రాణులు ఆయువు తీరగానే నూనె దీపాల్లాగా కొడిగడతాయి. ప్రకృతిలో వివిధ జీవుల ఉపాధులు, వాటి స్వభావాలు ఇవీ అని తెలుసుకొని జ్ఞాని అనిపించుకుంటాడు మనిషి. ప్రకృతి ఒరవడిని, పోకడను, సృష్టికి మూలకారణమైన భగవంతుడి గుణ రూప వైభవాలను తెలుసుకొని ప్రేమిస్తాడు. సంపాదించిన సంపద ఒకనాటికి పోవచ్చు. అపురూపంగా చూసుకొనే శరీరం పడిపోవచ్చు. ఒకప్పుడు వైభవంగా వెలుగొందిన సామ్రాజ్యాలు, నగరాలు నేడు కనిపించవు. అవశేషాలుగా మారిన వాటిని దర్శించినప్పుడు వాటి పూర్వ స్థితిని అంచనా వేయడం సాధ్యం కాకపోవచ్చు.
మార్పు ప్రకృతి లక్షణం. ప్రతిరోజూ సూర్యుడు కొత్తగా పుడతాడు. అస్తమిస్తాడు. ప్రతి పక్షానికీ నిండు చంద్రుడు కొత్తగా ప్రత్యక్షమై ప్రకాశిస్తాడు. పూర్ణిమ పూర్తికాగానే చీకటి పక్షం ప్రారంభమవుతుంది. చీకటి తారస్థాయికి చేరినప్పుడు అది ఓ అమావాస్య అవుతుంది. తారలు మినుకుమినుకుమంటూ ప్రకాశిస్తాయి. అయితే భయపడనవసరం లేదు, చీకటి శాశ్వతం కాదన్నట్లు శుక్ల పాడ్యమి నాడు చంద్రోదయమవుతుంది.
ప్రకృతికి ఓ విలక్షణ స్వభావం ఉంది. అదే ఒరవడి! పోకడ! ప్రకృతి తెచ్చే మార్పును అంగీకరిస్తే చాలామటుకు మనిషికి ఎదురయ్యే ప్రతికూలత దూరమై ప్రశాంతత వెల్లివిరుస్తుంది. కనిపించేది ఏదీ శాశ్వతం కాదు. యుగాలు సైతం మారతాయి. సూర్యభగవానుడు తూర్పున ఉదయించే ప్రతిరోజూ కొంగొత్త అనుభవమై విరాజిల్లుతుంది. మనసును దోచేస్తుంది. అన్నీ ఒకేలా ఉన్నా, అన్ని ఉదయాలూ ఒకటి కావు. అవి పంచే అనుభవాలు వేటికవే ప్రత్యేకం. ప్రతి కొత్త ఉదయం భగవంతుడు మనిషికి అనుగ్రహించిన కొత్త అనుభవాలకు ముఖద్వారం. సానుకూల ఆలోచనలతో ప్రతి నూతన ఉదయానికి స్వాగతం పలికి జీవితాన్ని ఆహ్లాదభరితం చేసుకునేవారి జన్మ ధన్యం. ప్రకృతి అణువణువునా దైవం ప్రకాశిస్తాడు. ఆ ప్రకాశాన్ని అందిపుచ్చుకొని మనిషి ఆనంద దీపాన్ని వెలిగించుకోవాలి!
గోపాలుని రఘుపతిరావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రేమే దైవం
ఈ లోకంలో సమస్తాన్నీ కలిపే ఒకే ఒక శక్తి ప్రేమ. ఆ ప్రేమ స్వచ్ఛమైనది. స్వార్థం లేనిది. ద్వేషాన్ని, పశుతత్వాన్ని మనిషి నుంచి తొలగించే దివ్యౌషధం ప్రేమ. అలాంటి ప్రేమ అందరిలో ఉంటే అసమానతలు, ఘర్షణలు, అసూయ, అశాంతి తొలగిపోతాయి. కులమతాలకు అతీతమైన నవసమాజ నిర్మాణానికి కూడా ప్రేమ ఎంతగానో దోహదపడుతుంది. -
నిజ స్వభావం
మనిషి జీవితానికొక పరమార్థం ఉండాలనేవారు శాక్యముని. జీవితానికి అర్థం లేకపోతే బతుకు వ్యర్థమే. నాకెందుకు పుట్టావురా అని కన్నతల్లి ఈసడించుకొనే జీవితం నిరర్థకం. -
శోక పురాణం
పుట్టగానే శిశువు చేసే మొదటి పని ఏడవడం. ‘చిన్నపిల్లలకు ఏడుపే బలం’ అనేది నానుడి. చిన్న వయసులో బాలలకు ఏ ఇతర వ్యాయామాలూ ఉండవు. కాబట్టి ఏడవడం వల్ల అవయవాలు బాగా కదిలి శారీరక వ్యాయామం జరుగుతుంది. -
రంగులహేల... హోలీ!
జీవితం వర్ణమయం. ప్రతి వర్ణం ఒక్కో అనుభూతిని ఆవిష్కరిస్తుంది. ఆ వర్ణాలన్నీ ముంగిట నిలిచి మురిపిస్తే అది రంగుల హరివిల్లుగా, హోలీ పర్వంగా సాకారమవుతుంది. వసంత రుతువు అడుగిడే తరుణంలో ప్రకృతి రసాకృతిని ధరిస్తుంది. ఆకుపచ్చని పొదరిళ్లు, పూలపుంతలతో ముస్తాబవుతాయి. ఆమని పేరంటానికి ప్రకృతి నవ వధువై సింగారించుకుంటుంది. ఆ సందర్భంలో విచ్చేసే అందమైన... -
ప్రవచనం
‘విద్వాంసులేమో అసూయాగ్రస్తులు, ప్రభువులా గర్వాంధులు, ఇక సామాన్యులు అజ్ఞానులు. నేను చెప్పదలచుకున్న సుభాషితం నాలోనే నశించిపోతోంది’ అని వాపోయాడు భర్తృహరి. సుభాషితం అంటే మంచిమాట. మంచి మాటలు వినే సహృదయులు ఈ లోకంలో కనిపించడం లేదని కవి ఆవేదన. -
నిలువునా కాల్చేసే ద్వేషం
మానవ సమాజంలో సమదృష్టి, సమభావన చాలా అవసరం. మనిషి పుట్టింది మొదలు మరణించే వరకు అన్నింటి పట్లా ఒకే విధమైన భావం కలిగి ఉండటం చాలా కష్టం. -
అణువణువునా గురువులే
విద్యాభ్యాసం అంటే గురుముఖతా విద్య నేర్చుకోవడమే అని పలువురి అభిప్రాయం. లౌకికమైన విద్యలు వృత్తి వ్యాపారాల్లో ఉపకరిస్తాయే గాని చదువుల్లోని మర్మాలను వివరించవు. నిశితంగా పరికిస్తే విద్యాలయాల్లో బోధించని విద్యలు జీవిత పాఠాలను చెప్పకనే చెబుతాయి. ఎందరెందరో గురువులు అణువణువునా దర్శనమిస్తారు. -
దేవుడిచ్చిన ఇల్లు
దేహం ఒక దేవాలయమని, అందులో ఉండే జీవుడే దేవుడనీ మహర్షుల వాక్కు. భగవంతుడు ప్రసాదించిన ప్రాణధారణ పంజరం వంటి దేహాన్ని రక్షించుకోవడం మనిషికి అత్యావశ్యకం. ప్రాణం అనే చిలుక, దేహం అనే పంజరంలో సురక్షితంగా ఉంటుంది. -
జీవనాధార ప్రకృతి
ప్రకృతి- జీవరాశికి మాతృక, సౌందర్యానికి ప్రతీక. మానసికోల్లాసానికి నెలవు, ఖేదపడిన మనసుకు ఓదార్పు. ఉద్వేగానికి నిర్వేదానికి ఉపశమనం, కృత్రిమ జీవితం నుంచి ఆటవిడుపు. ప్రకృతి మనిషిలో జిజ్ఞాస రేకెత్తిస్తుంది. అన్వేషణకు స్ఫూర్తినిస్తుంది. కవులకు కళాకారులకు ప్రేరణ కలిగిస్తుంది. చిత్రంలోని ప్రకృతి కంటినే ఆహ్లాదపరుస్తుంది. -
ఎవరు వామనుడు?
భగవంతుడి అవతార విభూతి రెండు విధాలుగా ఉంటుందన్నారు అరవింద యోగి. మనిషిగా రావాలనుకొంటే- మనిషి ఆకారాన్ని, స్వభావాన్ని తనలో ఆవాహన చేసుకొని మరీ దిగిరావడాన్ని ‘అవరోహణ’ అన్నారాయన. -
మనసుతో మనం కాసేపు...
జీవితం అనుభూతుల నిలయం. అనుభవాల మణిహారం. సమాజంలో వ్యక్తులతో అనుబంధాలు పూల అల్లికలా అందంగా సుగంధ భరితంగా నెలకొల్పుకోవాలి. అందుకు ప్రపంచం అంతా నిండి ఉండే ప్రేమ, శాంతి, మంచితనం తోడ్పడతాయి. -
సుసంస్కారం
నిర్మానుష్య కీకారణ్యాల్లో ఒంటరిగా నివసించే మనిషికి ఎలాంటి సభ్యత, సంస్కారం, మర్యాదలతో పనిలేదు. అదే ప్రదేశానికి మరో వ్యక్తి వచ్చినప్పుడే వాటి అవసరం తెలుస్తుంది. వాటిని పాటించకపోతే ఘర్షణ తలెత్తుతుంది. -
ఊరొక్కటే- దారులెన్నో....
ఒక ఊరికి వెళ్ళాలంటే చుట్టుపక్కల గ్రామాలవారు దగ్గరిదోవ చూసుకుంటారు. సులువుగా, తొందరగా, సుఖంగా చేరే మార్గం వెదుక్కుంటారు. తెలియకపోతే తోటివాళ్లను వాకబు చేస్తారు. అలా క్షుణ్నంగా తెలుసుకున్న తరవాత నమ్మకం కలుగుతుంది. -
గోవిందం... పరమానందం!
జీవితంలో ప్రతి మనిషీ పరితపించేది ఆనందం కోసమే. అది అంత సులభంగా అందుబాటు అయ్యే సిద్ధాన్నం కాదని తెలుసు. కష్టపడి సాధించినప్పుడే రససిద్ధి కలుగుతుంది. ఆ ఆనందరసాన్ని అనుక్షణం ఆస్వాదించాలని ఆశించడం మానవ సహజం. -
నీకు నీవే సృష్టికర్తవి!
ప్రతీ మనిషిని ఆ భగవంతుడు సర్వస్వతంత్రుడిగా సృష్టించాడు. అందుకే మనిషి స్వయంకృషితో ఏం సాధించాలనుకున్నా, ఏది పొందాలనుకున్నా అది అతడి చేతుల్లోనే ఉంది. మనిషి వేసే ప్రతి అడుగూ అతడి జీవితపథాన్ని నిర్దేశిస్తుంది. అందువల్ల మనిషి జీవితంలో ఏది జరిగినా అది అతడి ఉన్నతికేనని ప్రతి ఒక్కరూ భావించాలి. -
దైవసన్నిధి
చీకట్లో ఆకాశంవైపు చూసినప్పుడు మనం అశాశ్వతమని గుర్తొస్తుంది. ఎక్కడినుంచి వచ్చామో, మరణం తరవాత ఎక్కడికి వెడతామో తెలియదు. ఇది తీరికలేని జీవితంలో ఒక విరామాన్ని మాత్రం తీసుకొస్తుంది. -
దైవానుగ్రహం
ఆరాధనలతో అల్లాహ్ దాసులు ఆనందించే రోజులు తిరిగివచ్చాయి. రంజాన్ మాసపు నెలవంక ఆకాశవీధిలో మెరవగానే విశ్వాసుల కళ్ళలో సంతోషం విప్పారుతుంది. వెంటనే వారు చేసే దుఆతో ప్రకృతి పరవశిస్తుంది. అనేక భయ ప్రమాదాలు, ఆకలి బాధలు, ధన ప్రాణ, ఆదాయ నష్టాలు చుట్టుముట్టిన ప్రజలకు రక్షగా నిలిచే రంజాన్ పవిత్ర మాసాన్ని అల్లాహ్ తిరిగి అందించాడు. -
సప్త సూత్రాలు
ఆధ్యాత్మిక జీవన వాహిని- అనంతమైన మధుర మనోజ్ఞ తరంగిణి. ఆధ్యాత్మికత అనేది భావన కాదు, జీవన సంవిధానం. చింతనా మార్గంలో ఎవరికివారు సాగించే అలుపెరగని ప్రయాణం. ఆధ్యాత్మిక ధోరణి అంటే కేవలం పూజాది అభిషేకాలకు పరిమితమైంది కాదు. అంతకుమించిన, అవ్యక్తమైన దార్శనిక శక్తి. -
వినయం భూషణం
విద్యార్జనకు, విషయం తెలుసుకోవాలన్న తపనకు, వినయం గుణసంపదగా భాసిల్లి కార్యసాఫల్య మార్గం సుగమం చేస్తుంది. గురుకుల సంస్కృతిలో, సన్యాస ఆశ్రమాల్లో గురువులు శిష్యుల్లో వినయాన్ని చూసేవారు. -
ధర్మ రక్షణ
సుపరిపాలన అనే మాట తరచుగా వింటుంటాం. రామాయణ మహా భారతాల్లో మంచి పరిపాలన అంటే ఏమిటో పాలకులకు ఎలాంటి లక్షణాలు ఉండాలో, ఏ గుణాలు ఉండకూడదో మహర్షులు చెప్పారు. అనేక క్లిష్ట సమయాల్లో ధర్మ స్థాపన యత్నాల్లో సంఘర్షణల్లో పురాణపురుషుల నుంచి మార్గదర్శనం లభించడం మన ఇతిహాసాల్లో కనిపిస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం