పరివర్తనే ఆధ్యాత్మిక మార్గం
మార్పు మనిషి ప్రతి దశలోనూ సహజం. ఎదుగుదల సృష్టిలో చరాచర ప్రకృతికి ఎంతో అవసరమైన జీవన క్రియ. ప్రగతికి దోహదం చేసేది పరివర్తనే. ఎలా ఉన్నా, ఏది లేకున్నా, మన కర్తవ్యంతో నిమిత్తం లేకుండా మార్పు సంభవిస్తుంటుంది.
మార్పు మనిషి ప్రతి దశలోనూ సహజం. ఎదుగుదల సృష్టిలో చరాచర ప్రకృతికి ఎంతో అవసరమైన జీవన క్రియ. ప్రగతికి దోహదం చేసేది పరివర్తనే. ఎలా ఉన్నా, ఏది లేకున్నా, మన కర్తవ్యంతో నిమిత్తం లేకుండా మార్పు సంభవిస్తుంటుంది.
ఆకలి, భయం, నిద్ర, మైథునాలు ప్రతి ప్రాణికీ ఉండే శారీరక చర్యలు. వాటిని మించి మనిషికి భగవంతుడు బుద్ధిని ఇచ్చి లోక ప్రయోజనాన్ని ఆశించాడని శంకరాచార్య తమ భజగోవిందంలో చెబుతారు. తనకిచ్చిన విచక్షణా జ్ఞానాన్ని ఉపయోగించి ప్రకృతిని రక్షించి, జీవించే హక్కును అన్ని ప్రాణులకు కల్పించి, భగవంతుడి సృష్టిని కాపాడే బాధ్యత మనిషికి దేవుడు కట్టబెట్టిన కర్తవ్యం.
సమాజాన్ని సృష్టించింది భగవంతుడే అయినా- దాని స్థితిని, పోషణను మానవ ధర్మంగా శాసించాడు. వాటిని మనిషికి వేదాలుగా, శాస్త్రాలుగా, ఉపనిషత్తులుగా మలచి రుషుల ద్వారా ప్రబోధించాడు. మనిషికి దేవుడి శాసనమిది!
నోరు లేని, కదలలేని ప్రకృతిని మనిషి తన స్వార్థానికి బలిచేయడం అనాదిగా చూస్తున్న అరాచక ప్రవృత్తి. ఆకలి కోసం ఇతర ప్రాణులు ఆహారాన్ని సంపాదిస్తాయి. రేపటి కోసం మనిషి నేటి సంపదను దోచుకుంటూ ఇతరులకు అందకుండా సంపాదిస్తున్నాడు. మనిషిలోని స్వార్థం, ద్వేషం, అరాచకత్వం నుంచి బయటపడి లోకరక్షణే ధ్యేయం కావాలని భగవంతుడు ఆదర్శాన్ని బోధించడానికి అవతారాలు దాల్చాడు. దుర్గుణాలు పెరిగితే రాక్షసుడు, సద్గుణాలు విస్తరిస్తే దేవతలు. మనిషిని సంకుచితం నుంచి దైవత్వానికి నడిపించే మార్గాన్నే ఆధ్యాత్మిక మార్గంగా మహర్షులు అందించారు.
బాధలు, కష్టాలు చుట్టుముట్టినప్పుడు ప్రతి మనిషీ తాను మారాలని ఆలోచిస్తాడు. ఈ ఉపద్రవం నుంచి బయటపడితే చాలు, తన జీవన విధానాన్ని మార్చుకోవాలని ఆవేదన చెందుతాడు. కేవలం అది ఆపద్ధర్మమే. కష్టాలు తీరగానే మనిషి సహజ గుణమైన స్వార్థం ఎగదన్నుతుంది. కొద్దికాలమే మార్పు వస్తే అది ఆత్మవంచనే కాని ఆధ్యాత్మికం కాదు. పరివర్తన అనేది శాశ్వతమైన సత్య స్వరూపం. పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు, స్తోత్ర పారాయణలు మాత్రమే ఆధ్యాత్మికత కాదు. అవి పవిత్ర కర్మలు. లోక ప్రయోజనాన్ని కూర్చే సేవాతత్వమే సత్యమైన బాట.
శ్రీరాముడు వనవాసం చేయడం ఆధ్యాత్మిక ప్రగతి ప్రయాణంగా రామాయణం చెబుతుంది. రామ వనవాసం వల్ల కుటుంబంలోని స్వార్థపరులకు కనువిప్పు, ప్రజలకు నీతిమంతమైన ఆదర్శ జీవనం, మహర్షులకు రక్షణ, రాక్షసత్వానికి శిక్ష... ఇలా ఎన్నో ప్రయోజనాలు సిద్ధించాయి. అటువంటి ఉన్నతమైన పరివర్తనే ఆధ్యాత్మికత లక్ష్యం.
హింసా మార్గం నుంచి అహింసకు నడిపించేదే అసలైన ఆధ్యాత్మిక మార్పుగా బుద్ధుడు బోధించాడు. అన్ని ధర్మాల్లోకీ అహింస పరమధర్మమని బౌద్ధం ప్రకటించింది. హింసామార్గం కన్న ప్రేమమార్గమే దైవమార్గంగా క్రీస్తు జీవించాడు. మతం ఏదైనా అవి నిర్మించిన మానవతా సౌధాలు మాత్రం- మనిషిలోని మానసికమైన మార్పులు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస పరివర్తనకు మూల సూత్రాలుగా భగవద్గీత, భక్తిసూత్రాలు ప్రకటించాయి. ఏ క్రతువులు చేయకున్నా- మనిషి తనలోని దుర్గుణాలను మార్చుకుని విశ్వ శ్రేయస్సుకు సద్గుణవంతమైన ఒక్క ఆలోచన చేస్తే అదే అతణ్ని మాధవుణ్ని చేస్తుంది.
రావులపాటి వెంకట రామారావు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Immunity boosting: మళ్లీ కరోనా కలకలం.. ఈ ఫుడ్‌తో మీ ఇమ్యూనిటీకి భలే బూస్ట్!
-
Movies News
Anushka Sharma: పన్ను వివాదంలో లభించని ఊరట.. అనుష్క శర్మ పిటిషన్ కొట్టివేత
-
Sports News
Cricket: అత్యంత చెత్త బంతికి వికెట్.. క్రికెట్ చరిత్రలో తొలిసారేమో!
-
General News
Telangana News: రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదు
-
World News
Mobile: ‘ఫోన్ వాడకాన్ని చూసి విస్తుపోయా’.. సెల్‌ఫోన్ పితామహుడు
-
World News
USA: అమెరికాలో భారతీయ టెకీలకు గుడ్ న్యూస్