మనిషిలో అపార శక్తి
ప్రతి మనిషిలోనూ అపార శక్తి దాగి ఉంటుంది. ఒక్క మరణం తప్ప మనిషికి అసాధ్యం అనేది లేదని ఎన్నో రంగాల్లో రుజువైంది. తమలో అనంత శక్తి దాగున్న విషయం చాలా మందికి తెలియదు.
ప్రతి మనిషిలోనూ అపార శక్తి దాగి ఉంటుంది. ఒక్క మరణం తప్ప మనిషికి అసాధ్యం అనేది లేదని ఎన్నో రంగాల్లో రుజువైంది. తమలో అనంత శక్తి దాగున్న విషయం చాలా మందికి తెలియదు. ప్రాచీన కాలంలో మహర్షులు తమ అలౌకిక అనుభవ బలంతో మనిషి మనసు నిజస్వరూపాన్ని కనుగొన్నారు. నేడు దూరదర్శిని, సూక్ష్మదర్శిని, మరెంతో సాంకేతిక అభివృద్ధి ద్వారా అనేక విశ్వ రహస్యాలను శాస్త్రవేత్తలు ఛేదిస్తున్నారు.
భగవంతుడు ప్రతి మనిషినీ ప్రత్యేక నైపుణ్యాలతో సృష్టించాడు. రూపం, గాత్రం, చిత్రకళ, వాక్చాతుర్యం, రచన, క్రీడలు... ఇలా ప్రతివారిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏ ప్రత్యేకతా లేని మనిషి అంటూ ఉండడు. వాటిని గుర్తించి మెరుగులు దిద్దుకునే ప్రయత్నం చేసేవారే ప్రత్యేక గుర్తింపు పొందుతారు. తనను వేధిస్తున్న మరణ భయాన్ని ప్రత్యక్షంగా పిన్న వయసులోనే అనుభవించి, తానెవరో తెలుసుకున్నారు రమణ మహర్షి. ప్రతి మనిషి ‘నేను ఎవరు?’ అనేది తెలుసుకోవాలని ప్రపంచానికి తెలియజెప్పారు.
సీతాన్వేషణలో సముద్రం దాటాల్సిన అవసరం వచ్చింది. జాంబవంతుడు హనుమంతుడి అసలు శక్తిని ఆయనకు తెలియబరుస్తాడు. హనుమ తన విశ్వరూపం చూపి రామకార్యం సఫలం చేశాడు.
ప్రతిభ ఒక వంతు ఉంటే కృషి మూడు వంతులు ఉన్నప్పుడే లోపల దాగున్న ప్రత్యేకతలు వెలుగు చూస్తాయి. స్వీయ సామర్థ్యం గురించి మనకు తెలియకపోతే వెనకబడిపోతాం. అన్నీ ఉన్న అశక్తులుగా జీవితకాలమంతా మిగిలిపోతాం. అన్ని అంగాలూ ఉండి సోమరితనంతో యాచన చేస్తూ జీవిస్తున్న ఎంతోమందికి నిక్ వుజిసిక్ ఎంతో ఆదర్శప్రాయుడు. ఆయన కాళ్లు చేతులు లేకుండా పూర్తి అంగవైకల్యంతో పుట్టాడు. తల్లిదండ్రులు, స్నేహితులు, సమాజం ప్రోత్సాహాలతో ఎన్నో రంగాల్లో ప్రత్యేకంగా రాణించాడు.
మనిషిలో దాగి ఉండే ఆధ్యాత్మిక శక్తి అంతవరకు ఏ నావా ప్రయాణం చేయని సముద్రం వంటిది. ఎవరూ సంచరించని అంతరిక్షం వంటిది. కాబట్టి ఎవరి మార్గం వారిది. భగవంతుడి అనుగ్రహం పొందడం కోసం అనేకమంది అనేక రకాలుగా ప్రయత్నించారు. శ్రవణ మార్గాన్ని పరీక్షిత్తు మహారాజు ఆచరించాడు. కీర్తన మార్గాన్ని వాల్మీకి, రామదాసులు ఎంచుకున్నారు. స్మరణ మార్గాన్ని ప్రహ్లాదుడు, తులసీదాస్ పాటించారు. పాదసేవన మార్గాన్ని భరతుడు ఆచరించాడు. వందన మార్గాన్ని కృష్ణ పరమాత్మ బోధించాడు. దాస్య భక్తికి హనుమ అంకితమయ్యాడు. సఖ్య భక్తిలో అర్జునుడు, సుగ్రీవుడు తరించారు. ఆత్మ నివేదన భక్తిని ద్రౌపది పాటించింది. అర్చన భక్తిని ప్రస్తుతం మానవులు ఆచరిస్తున్నారు.
తల్లిదండ్రులు పిల్లల్లోని ప్రత్యేకతలను గుర్తించి ప్రోత్సహించాలి. అభిరుచిని బట్టి ప్రోత్సహిస్తే వారిలో మరో బుద్ధుడు, వివేకానందుడు, అబ్దుల్ కలాం వంటివారు సమాజానికి దిశానిర్దేశం చేసే ప్రత్యేక వ్యక్తులుగా ఉద్భవిస్తారు.
ఎం.వెంకటేశ్వరరావు
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu Arrest: హైదరాబాద్‌లో ప్రదర్శనలు చేయొద్దంటే ఎలా?: తెదేపా మహిళా నేత జ్యోత్స్న
-
Chandrababu Arrest: ఏపీలో ప్రజాస్వామ్యానికి ప్రమాదఘంటికలు: నారా బ్రాహ్మణి
-
IRCTC: ఐఆర్సీటీసీ ఆఫర్.. విమాన టికెట్లపై ఆ ఛార్జీలు జీరో
-
Bajaj Pulsar N150: స్పోర్టీ లుక్‌లో కొత్త పల్సర్ N150.. ధర, ఇతర వివరాలివే
-
MGNREGA: బకాయిల వివాదం.. 50లక్షల లెటర్లతో తృణమూల్ సిద్ధం!
-
Sita Ramam: ‘సీతారామం’ సీక్వెల్‌పై ప్రశ్న.. నిర్మాత సమాధానమేంటంటే?