ధ్వని సౌందర్యం
శబ్దానికి ధ్వని అని పేరు. శబ్దం కానీ, ధ్వని కానీ మౌనాన్ని భంగం చేస్తుంది. అది శ్రుతిమించితే మనశ్శాంతిని పోగొడుతుంది. శబ్దానికి ఎన్నో పేర్లున్నాయి. శబ్దం, నినాదం, విరావం సహా పదిహేడు పేర్లను అమరకోశకారుడు చెప్పాడు.
శబ్దానికి ధ్వని అని పేరు. శబ్దం కానీ, ధ్వని కానీ మౌనాన్ని భంగం చేస్తుంది. అది శ్రుతిమించితే మనశ్శాంతిని పోగొడుతుంది. శబ్దానికి ఎన్నో పేర్లున్నాయి. శబ్దం, నినాదం, విరావం సహా పదిహేడు పేర్లను అమరకోశకారుడు చెప్పాడు.
మానవులు చేసే ధ్వనికి, పశుపక్ష్యాదులు చేసే ధ్వనికి భేదం ఉంది. గిరుల్లో, ఝరుల్లో, తరువుల్లో వాయుసంచారం వల్ల కలిగే ధ్వనుల్లోనూ భేదం ఉంది. ప్రాణుల్లో అన్నింటిలోనూ ధ్వని చేసే స్వభావం ఉంది. ధ్వనులు అన్నీ మధురంగా ఉంటాయని చెప్పడం సాధ్యం కాదు. పక్షి జాతుల్లో పిట్టలు ఒక విధంగా అరిస్తే, చిలుకలు మరో విధంగా అరుస్తాయి. కాకులు ఒక విధంగా అరిస్తే, కోకిలలు ఒక విధంగా అరుస్తాయి. మనుషులకు కాకుల అరుపులు కర్ణకఠోరంగా అనిపిస్తాయి. కోకిలల కూతలు చెవులకు ఇంపుగా ఉంటాయి. కాకులూ నల్లగానే ఉంటాయి. గాడిదల అరుపులు చెవులకు బాధ కలిగిస్తాయి. హంసల కూజితాలు మధురంగా ఉంటాయి. ఏనుగుల ఘీంకారాలు, సింహగర్జనలు భయాన్ని కలిగిస్తాయి. మేఘ గర్జనలూ భీతిని గొలుపుతాయి. భయంకర ధ్వనులను మనిషి ఒక స్థాయి వరకే ఓర్చుకోగలుగుతాడు. శ్రుతిమించితే మనిషి చెవులు శ్రవణశక్తిని కోల్పోతాయి.
రమణీయమైన ధ్వనులను విన్నప్పుడు మనిషి మనసు ఏవో ఆనందలోకాలలో విహరిస్తుందని, పూర్వజన్మ సంస్కారాలను గుర్తుకు తెచ్చే స్వభావం రమణీయగీతాలకు ఉందని కాళిదాస మహాకవి అభిజ్ఞాన శాకుంతలంలో అంటాడు. రాగాల్లో సైతం నవరసాలను పుట్టించే శక్తి ఉందని సంగీతశాస్త్రం చెబుతుంది. అందుకే ఉల్లాసానికి కొన్ని రాగాలు, విషాదానికి కొన్ని రాగాలు, ఉత్తేజానికి కొన్ని రాగాలు, ఉద్బోధకు కొన్ని రాగాలు, హాస్యానికి కొన్ని రాగాలు, భీభత్సానికి కొన్ని రాగాలు... ఇలా సందర్భాన్ని అనుసరించి ఆయారాగాలను సంగీతజ్ఞులు ప్రయోగిస్తారు.
పాటల్లోనే కాదు- మాటల్లోనూ ఇలాంటి వైవిధ్యాలున్నాయి. కొందరి మాటలు కటువుగా అనిపిస్తాయి. కొందరి మాటలు మధురంగా అనిపిస్తాయి. ఇందుకు కారణం శబ్దంలో ఉద్భవించే వైవిధ్యమే! ప్రణవం వంటి మంగళకర శబ్దాలను ఉచ్చరించినప్పుడు మనిషికి కలిగే అనుభూతి దివ్యంగా ఉంటుంది. మంత్రాలలో సైతం అలాంటి మాధుర్యం ఉంటుంది కనుకనే మంత్రజపం వల్ల కలిగే మానసిక ప్రశాంతత మనిషిని ఆత్మానందంలో ఓలలాడిస్తుంది. సాహిత్యాన్ని మధురమైన సంగీతంతో జోడించినప్పుడు మామూలు పదాలు కూడా ఎంతో మధురానుభూతిని కలిగిస్తాయి. కనుక మధురమైన శబ్దానికి ఎంతో ఉత్కృష్టత ఉంది. వేదాల్లోనూ పురాణేతిహాసాల్లోనూ వర్ణించిన మంత్రాలను, స్తోత్రాలను, శ్లోకాలను పఠిస్తున్నప్పుడు కలిగే ఆనందానికి అవధులు ఉండవు.
సెలయేళ్లు చేసే ధ్వనిలోను, నదీప్రవాహంలో వినబడే శబ్దంలోను, మలయపర్వతం నుంచి వీచే గాలుల్లోనూ గాంధర్వవేదాలు వినబడతాయి. ఇరువైపులా దట్టంగా చెట్లతో కూడిన తోవలో నడుస్తున్నప్పుడు వినబడే చెట్ల ఆకుల మర్మరధ్వనులు మనసును ఆహ్లాదపరుస్తాయి.
ధ్వనుల్లో సౌందర్యం ఉంది. శిల్పం ఉంది. మాధుర్యం ఉంది. కవిత్వంలో సైతం అవ్యక్తంగా వినబడే ధ్వనికి ప్రత్యేకత ఉంది. అది ఎల్లవేళలా వినాలనే కుతూహలాన్ని కలిగిస్తుంది.
డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Cyber Crimes: టాస్క్ పేరుతో సైబర్ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర హోంశాఖ
-
Parineeti-Raghav : ఒక్కటైన ‘రాగ్నీతి’.. లీలా ప్యాలెస్లో వైభవంగా వివాహం
-
Economy: దేశ ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో భాజపా ప్రభుత్వం విఫలం: కాంగ్రెస్
-
Tagore Movie: పాటలు వద్దన్న మురగదాస్.. అలా ఛాన్స్ దక్కించుకున్న వినాయక్
-
Manipur : మయన్మార్ సరిహద్దులో కొత్తగా 70కి.మీ మేర కంచె నిర్మాణానికి ప్రణాళిక : మణిపుర్ సీఎం
-
RBI: యథాతథంగానే వడ్డీరేట్లు.. నిపుణుల అంచనా..