Published : 30/08/2021 04:44 IST

పోలీసుల అదుపులో చింతమనేని!

నర్సీపట్నం గ్రామీణం-దెందులూరు, కొయ్యూరు న్యూస్‌టుడే: పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను విశాఖ జిల్లా కొయ్యూరు మండలం డౌనూరు సమీపంలోని చెక్‌పోస్టు వద్ద పోలీసులు ఆదివారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. శనివారం దెందులూరులో పెట్రో ధరల పెంపును నిరసిస్తూ ఆందోళన చేపట్టిన తర్వాత ఆయన తన సన్నిహితులతో కలిసి మూడు కార్లలో గూడెంకొత్తవీధి మండలం దారకొండలోని దారాలమ్మ ఆలయానికి వచ్చారు. ఆదివారం అమ్మవారిని దర్శించుకున్న అనంతరం చింతపల్లి మీదుగా నర్సీపట్నం వస్తున్నప్పుడు డౌనూరు చెక్‌పోస్టు వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆయనతో పాటు మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. చెక్‌పోస్టు వద్ద రోజూ నలుగురైదుగురు మాత్రమే పోలీసులు విధుల్లో ఉంటారు. అయితే ఆదివారం ఇక్కడ ప్రత్యేక బృందాలు మోహరించాయని స్థానికులు తెలిపారు. సాయుధ పోలీసులు వాహనాలను ఆపినప్పుడు తనను అరెస్టు చేయడానికి జిల్లాలు దాటి రావడం ఏమిటని చింతమనేని ప్రశ్నించారని స్థానికులు చెబుతున్నారు.  ఈ సందర్భంగా కొందరు చరవాణుల్లో కొద్దిపాటి సమయం నిడివిగల వీడియోలను తీశారు. నర్సీపట్నం ప్రాంతంలో పోలీసులు తమను అదుపులోకి తీసుకున్నారని, ఏలూరుకు తీసుకువెళతామని చెబుతున్నారని దెందులూరులోని పార్టీ శ్రేణులకు మాజీ ఎమ్మెల్యే సన్నిహితుల్లో ఒకరు సమాచారం పంపడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఇది తెలిసిన వెంటనే విశాఖ జిల్లా తెదేపా నాయకులు సైతం చింతమనేనిని ఎక్కడకు తీసుకువెళ్లారో తెలుసుకోవడానికి ప్రయత్నించారు.

అదుపులోకి తీసుకున్నాం: విశాఖ ఎస్పీ

‘చింతమనేని ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకున్న మాట వాస్తవమే. ఆయన ముందస్తు సమాచారం ఏదీ లేకుండా ఈ ప్రాంతానికి రావడంతో విచారిస్తున్నాం’ అని విశాఖ జిల్లా ఎస్పీ కృష్ణారావు తెలిపారు. మరో పక్క విచారణ అనంతరం ఆయనను ఇక్కడికి తీసుకురావడానికి జిల్లా నుంచి పోలీసు బృందాన్ని పంపుతున్నామని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ వెల్లడించారు.

వెంటనే విడుదలచేయాలి: అచ్చెన్నాయుడు

ఈనాడు, అమరావతి: చింతమనేని ప్రభాకర్‌ను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆయనను వెంటనే విడుదల చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆదివారం ఒక ప్రకటనలో డిమాండు చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. 

పులివెందులలో 22 మంది తెదేపా నాయకులపై కేసు

పులివెందుల, న్యూస్‌టుడే: కడప జిల్లా పులివెందులలో పెట్రోల్‌ ధరలకు నిరసనగా ర్యాలీ చేపట్టిన 22 మంది తెదేపా నాయకులపై ఆదివారం కేసు నమోదైంది. ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్‌ రవి), తెదేపా కడప పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు లింగారెడ్డి, తెదేపా నాయకత్వ శిక్షణ శిబిరం రాయలసీమ డైరెక్టర్‌ రాంగోపాల్‌రెడ్డి తదితరులపై పోలీసులు కేసులు పెట్టారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని