Published : 01/09/2021 02:59 IST

సీఎం ఎక్కడుంటే అదే రాజధాని

మంత్రి గౌతమ్‌రెడ్డి

ఈనాడు డిజిటల్‌, తిరుపతి: రాష్ట్ర రాజధాని అంశంపై మంత్రి గౌతమ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ ఎక్కడుంటే అదే రాజధాని అని పేర్కొన్నారు. ‘పులివెందుల, విజయవాడ, విశాఖపట్నం కావచ్చు.. రేపు మరో ప్రాంతం కావొచ్చు’ అని వ్యాఖ్యానించారు. మంగళవారం తిరుపతిలో జరిగిన చిత్తూరు జిల్లా అభివృద్ధి మండలి సమీక్ష సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారమే 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని 2019 డిసెంబరులో అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్‌ స్వయంగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ‘3 రాజధానుల విషయంలో ఎలాంటి మార్పులూ ఉండబోవు. న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా విజయవాడ, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నాన్ని ప్రకటించాం. నిజానికి రాజ్యాంగంలో రాజధాని అనే ప్రస్తావన లేదు’ అని తేల్చి చెప్పారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని