Updated : 28/11/2021 04:15 IST

Chandrababu: జగన్‌ రైతు వ్యతిరేక విధానాలపై లోక్‌సభలో పోరాడండి

 తెదేపా ఎంపీలకు చంద్రబాబు సూచన
ఈనాడు డిజిటల్‌ - అమరావతి

దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో 93 శాతం కుటుంబాలు అప్పుల్లో ఉన్నాయని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు. వరదలను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. జాతీయ విపత్తుగా ప్రకటించి వరద బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్‌ చేశారు. శనివారం ఇక్కడ జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తెదేపా ఎంపీలతో చంద్రబాబు మాట్లాడారు. ‘కౌలురైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానం, రైతుల ఆత్మహత్యల్లో మూడో స్థానంలో రాష్ట్రం నిలవడం జగన్‌ రైతు వ్యతిరేక చర్యలకు అద్దం పడుతోంది. ఈ అంశాలపై లోక్‌సభలో పోరాటం చేయాలి’ అని సూచించారు. సమావేశంలో తెదేపా ఎంపీలు గల్లా జయదేవ్‌, కేశినేని నాని, కింజరాపు రామ్మోహన్‌నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్‌, పార్టీ జాతీయ రాజకీయ కార్యదర్శి టీడీ జనార్దన్‌, జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.

పార్లమెంట్‌లో చర్చకు పట్టుబట్టాలని ప్రస్తావించిన అంశాలివీ..  
*అత్యధికంగా ఏపీలో ఇంధన ధరలు, జగన్‌ ప్రభుత్వ పన్నులు, ధరల పెరుగుదల, ప్రత్యేక హోదా, మూడు రాజధానుల బిల్లు  
* ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు గంజాయి, హెరాయిన్‌ వంటి మాదకద్రవ్యాల సరఫరా
* విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ
* కరోనా వ్యాక్సినేషన్‌లో ఏపీ వెనుకంజ
* వరి వేయొద్దని మంత్రులు ప్రకటించడం  
* వైఎస్‌ వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ, అడ్వాన్సుగా రూ.కోటి చెల్లింపుపై ఈడీ విచారణ
* పంచాయతీలకు కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్రప్రభుత్వం దుర్వినియోగం చేయడం
* బీసీలకు కేటాయించిన నిధులు, విధులు ఇవ్వకుండా  కంటితుడుపు చర్యగా అసెంబ్లీలో జగన్‌ ప్రభుత్వం బీసీ జనగణనపై చేసిన తీర్మానం  
* వర్సిటీల వీసీలు, ఈసీ మెంబర్లు, సెర్చ్‌ కమిటీల నియామకంలో బీసీలకు జరిగిన అన్యాయం  
* స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాలపై వైకాపా నేతల దాడులు, ఏకపక్షంగా నామినేషన్ల తిరస్కరణ, ఫలితాల తారుమారు, ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం వంటి అరాచకాలు  
* కేంద్రం నియమించిన శివరామకృష్ణ కమిషన్‌ సిఫారసుల మేరకు రాజధానిగా ఏర్పడిన అమరావతిని స్థిరపరచాలనే డిమాండ్‌  
పండించిన పంటలకు మద్దతు ధర లేక, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందక రైతులు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులు

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని