Updated : 28/11/2021 03:13 IST

ఎంఎస్‌ అంటున్నారు

విదేశాల్లో పీజీకే ప్రాధాన్యం
ఇక్కడ ఎంటెక్‌ చేసేవారు తక్కువే

ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్‌లో బీటెక్‌ తర్వాత మన రాష్ట్రంలో ఎంటెక్‌ చదివే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. బీటెక్‌ పూర్తవగానే ఉద్యోగాల్లో చేరిపోతున్నారు. పీజీ చదివే వారు కూడా రాష్ట్రంలోని కళాశాలలకంటే విదేశాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అక్కడ ఎంఎస్‌ తర్వాత రూ.లక్షల వేతనాలతో ఉద్యోగాలు వస్తున్నాయి. మనదేశంలో ఎంటెక్‌ అదనపు అర్హతతో పెద్దగా ప్రయోజనం ఉండటంలేదు. ఫలితంగా ఐఐటీలు, ఇతర సంస్థలు, రాష్ట్ర కళాశాలల్లో కలిపి ఏటా సరాసరిన 9 వేలలోపు మందే ఎంటెక్‌ చేస్తున్నారు. అదే సమయంలో విదేశాల్లో ఎంఎస్‌ చేస్తున్న రాష్ట్ర విద్యార్థుల సంఖ్య 25 వేలకుపైగా ఉంటోంది. వీరిలో అమెరికాకు వెళ్లేవారు అత్యధికంగా 15 వేల వరకు ఉంటారని అంచనా. బ్రిటన్‌, ఆస్ట్రేలియా, కెనడా తదితర దేశాలకు వెళ్లే వారు మరో 10 వేల వరకు ఉంటారు.

బీటెక్‌తోనే ఆపేస్తున్నారు
బీటెక్‌లో ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు వస్తుండడంతో విద్యార్థులు చేరిపోతున్నారు. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలూ ఎంటెక్‌ అడగడం లేదు. పీజీ చేసినా వేతనంలో మార్పు ఉండడం లేదు. ఎంటెక్‌తో అధ్యాపకుల వృత్తిలో అడుగు పెట్టాలనుకున్నా ఇక్కడ వేతనాలు తక్కువగా ఉంటున్నాయి. దీంతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల్లో చేరడం, లేదంటే ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్లడం చేస్తున్నారు.


మెరుగైన అవకాశాల కోసమే...
మంచి అవకాశాల కోసమే విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారు. డిజిటలైజేషన్‌ కారణంగా బీటెక్‌ వారికి ఉద్యోగాలు ఎక్కువగా లభిస్తున్నాయి. ఎంటెక్‌పై ప్రత్యేకంగా ఏమీ ఉండటం లేదు. మెరిట్‌ విద్యార్థులు ఐఐటీలు, విదేశాల్లో చదివేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

- హేమచంద్రారెడ్డి, ఛైర్మన్‌, ఉన్నత విద్యామండలి

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని