మత సంబంధ పనులకు ఎంపీల్యాడ్స్‌ నిధులా!

ఎంపీ ల్యాడ్స్‌ నిధుల్ని మత సంబంధ పనులకు కేటాయించారంటూ అందిన ఫిర్యాదుపై వాస్తవ/ చర్యల నివేదికను వెంటనే పంపాలని కేంద్ర గణాంక, పథక అమలు శాఖ (ఎంపీ ల్యాడ్స్‌) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శికి

Updated : 28 Nov 2021 04:34 IST

కేటాయింపుపై నివేదిక ఇవ్వండి
ప్రణాళికశాఖ ముఖ్య కార్యదర్శికి మరోసారి కేంద్రం లేఖ

ఈనాడు, అమరావతి: ఎంపీ ల్యాడ్స్‌ నిధుల్ని మత సంబంధ పనులకు కేటాయించారంటూ అందిన ఫిర్యాదుపై వాస్తవ/ చర్యల నివేదికను వెంటనే పంపాలని కేంద్ర గణాంక, పథక అమలు శాఖ (ఎంపీ ల్యాడ్స్‌) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శికి నవంబరు 10న లేఖ రాసింది. ఇదే విషయమై అక్టోబరు 21న ఒక లేఖ రాసినా.. ఇప్పటికీ స్పందన లేదని కేంద్ర గణాంకశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రెమ్య.పి అందులో పేర్కొన్నారు. నివేదికను ప్రధాని కార్యాలయానికి పంపాల్సి ఉన్నందున, తక్షణం స్పందించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీల్యాడ్స్‌ నిధుల్ని నిబంధనలకు విరుద్ధంగా ప్రార్థనాలయాల నిర్మాణాలు, మరమ్మతులకు కేటాయించారని ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రధానమంత్రి కార్యాలయానికి గతంలో ఫిర్యాదు చేశారు. దాన్ని ప్రధాని కార్యాలయం కేంద్ర గణాంక శాఖకు పంపి.. విచారించాలని ఆదేశించింది. దాని ఆధారంగా కేంద్ర గణాంకశాఖ అండర్‌ సెక్రటరీ సునీల్‌కుమార్‌ అక్టోబరు 21న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దానిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో.. ఆ అంశాన్ని గుర్తు చేస్తూ మళ్లీ లేఖ పంపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని