కడియం వాకిట.. కశ్మీర్‌ విల్లో

క్రికెట్‌ బ్యాట్లు, వికెట్ల తయారీకి వినియోగించే విల్లో మొక్కలు తూర్పుగోదావరి జిల్లా కడియపులంకకు చెందిన ఓ నర్సరీలో కనువిందు చేస్తున్నాయి.

Published : 29 Nov 2021 03:12 IST

క్రికెట్‌ బ్యాట్లు, వికెట్ల తయారీకి వినియోగించే విల్లో మొక్కలు తూర్పుగోదావరి జిల్లా కడియపులంకకు చెందిన ఓ నర్సరీలో కనువిందు చేస్తున్నాయి. నాలుగేళ్ల కిందట కశ్మీర్‌ నుంచి తెప్పించి ప్రయోగాత్మకంగా 80 అంట్లు కట్టించి మొక్కలు పెంచుతున్నట్లు నర్సరీ నిర్వాహకుడు మద్దిరెడ్డి రాజు తెలిపారు. ఒక్కో మొక్క రూ.3000 చొప్పున విక్రయిస్తున్నట్లు చెప్పారు. విల్లో మొక్కలు నీటి వసతి ఎక్కువగా ఉన్న శీతల ప్రదేశాల్లో పెరుగుతాయని వేమగిరిలోని ప్రాంతీయ పూల పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డీవీఎస్‌ రాజు తెలిపారు. ఇంగ్లండ్‌, కశ్మీర్‌ ప్రాంతాల్లోని ఈ వృక్షాల నుంచి సేకరించిన కలపను క్రికెట్‌ బ్యాట్లు, వికెట్ల తయారీకి వినియోగిస్తారని చెప్పారు.

-ఈనాడు, రాజమహేంద్రవరం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని