తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణులపై అత్యధిక అప్పుల భారం

గ్రామీణ ప్రాంతాల్లో అప్పుల ఊబిలో కూరుకుపోయిన అత్యధిక కుటుంబాలు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లోనే ఉన్నాయి. నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆర్గనైజేషన్‌ నిర్వహించిన ఆల్‌ ఇండియా....

Published : 30 Nov 2021 04:54 IST

తొలి రెండు స్థానాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌

ఈనాడు, దిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో అప్పుల ఊబిలో కూరుకుపోయిన అత్యధిక కుటుంబాలు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లోనే ఉన్నాయి. నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆర్గనైజేషన్‌ నిర్వహించిన ఆల్‌ ఇండియా డెట్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ (ఏఐడీఐఎస్‌) 2018 నాటి 77వ సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా పట్టణప్రాంతాల్లో 22.4%, గ్రామీణ ప్రాంతాల్లో 35% కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోయాయి. అందులో తెలంగాణలో 30.2% పట్టణ, 67.2% గ్రామీణ కుటుంబాలు ఉండగా... ఆంధ్రప్రదేశ్‌లో 44.9% పట్టణ, 62.8% గ్రామీణ కుటుంబాలపై ఈ భారం పడింది. అత్యధిక అప్పుల భారం ఉన్న పట్టణ కుటుంబాల్లో కేరళ ప్రథమస్థానంలో ఉంది. అదే గ్రామీణ అప్పుల్లో తెలంగాణ మొదటి, ఆంధ్రప్రదేశ్‌ రెండోస్థానంలో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని