Published : 30/11/2021 04:54 IST

వ్యవసాయేతర భూములకూ ఎల్‌పీఎన్‌

యాజమాన్య ధ్రువపత్రాల మంజూరు అధికారం తహసీల్దార్‌కు

ఈనాడు, అమరావతి: వ్యవసాయేతర భూములకు యాజమాన్య ధ్రువీకరణపత్రాల మంజూరు, భూములకు విశిష్ఠ సంఖ్య, కొత్తగా ల్యాండ్‌ పార్సిల్‌ నంబర్ల (ఎల్‌పీఎన్‌) కేటాయింపునకు సంబంధించి రెండు గెజిట్‌ నోటిఫికేషన్లను రెవెన్యూ శాఖ సోమవారం విడుదల చేసింది. ఏపీ వ్యవసాయ సాగు భూమి హక్కుల చట్టం-1971లో సాగుభూములతోపాటు వ్యవసాయేతర భూముల వివరాలను పొందుపరచనున్నట్లు రెవెన్యూ శాఖ గెజిట్‌లో పేర్కొంది. దీని ప్రకారం వ్యవసాయేతర భూముల యజమానులకు ధ్రువీకరణపత్రాలను సంబంధిత మండల తహసీల్దార్‌ మంజూరు చేస్తారు. వ్యవసాయేతర భూములకు కూడా ల్యాండ్‌ పార్సిల్‌ నంబరు, విశిష్ఠ సంఖ్యను కేటాయిస్తారు. తహసీల్దార్‌ జారీ చేసే యాజమాన్య ధ్రువీకరణపత్రాలపై అభ్యంతరాలు ఉంటే...ఆర్డీవోను ఆశ్రయించే అవకాశాన్ని కల్పించారు. వ్యవసాయేతర భూముల వివరాలను గ్రామసభల ద్వారా వివరిస్తారు. యాజమాన్య ధ్రువీకరణపత్రం కోసం మీసేవలోనే కాకుండా గ్రామ సచివాలయాల్లో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశాన్నీ కల్పించారు. భూములకు ల్యాండ్‌ పార్సిల్‌ నంబరు (ఎల్‌పీఎన్‌) కేటాయింపుపై మరో గజిట్‌ నోటిఫికేషన్‌ను రెవెన్యూ శాఖ విడుదల చేసింది. రికార్డ్స్‌ ఆఫ్‌ రైట్స్‌ (ఆర్వోఆర్‌) చట్టంలో సవరణలు తెస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌కు అనుగుణంగా ప్రవేశపెట్టిన బిల్లును గత వారం శాసనసభ ఆమోదించింది. భూముల రీ-సర్వే నేపథ్యంలో 12 లేదా 14 అంకెల విశిష్ఠ సంఖ్యతోపాటు ఎల్‌పీఎన్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్వే, డివిజన్‌ సంఖ్యలతోపాటు అదనంగా ఎల్‌పీఎన్‌ ఉంటుందని ఉత్తర్వుల్లో ముఖ్య కార్యదర్శి ఉషారాణి తెలిపారు. ఈ గజిట్‌ నోటిఫికేషన్లపై అభ్యంతరాలుంటే 12 రోజుల్లోగా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శికి తెలియజేయవచ్చు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని