నేటి నుంచి జూడాల ఆందోళన

జూనియర్‌ వైద్యులు బుధవారం నుంచి ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. తమకు అందజేసే ఉపకార వేతనంలో టీడీఎస్‌ మినహాయిస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు

Published : 01 Dec 2021 03:13 IST

5 నుంచి ఓపీ, 9 నుంచి అత్యవసర సేవలూ బంద్‌

ఈనాడు, అమరావతి: జూనియర్‌ వైద్యులు బుధవారం నుంచి ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. తమకు అందజేసే ఉపకార వేతనంలో టీడీఎస్‌ మినహాయిస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయకపోవడం, నీట్‌ పీజీ కౌన్సెలింగ్‌ నిర్వహణలో జాప్యాన్ని నిరసిస్తూ బుధవారం నుంచి ఆందోళనబాట పట్టాలని నిర్ణయించినట్లు జూనియర్‌ వైద్యుల సంఘం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ‘తెలంగాణ, కేరళ, ఒడిశా, ఇతర రాష్ట్రాల్లో ఉపకార వేతనంపై టీడీఎస్‌ (10%) విధించడం లేదు. దీనిపై ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశాం. నేరుగా చర్చించాం. అయినా నిర్ణయం తీసుకోలేదు’ అని సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో డిసెంబరు 1న నల్లబ్యాడ్జీలు ధరించడం, 2న కళాశాలల వద్ద కొవ్వొత్తుల ర్యాలీ, 3న జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేయడం, 4న సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తామని వెల్లడించారు. డిసెంబరు 5 నుంచి ఓపీడీ సేవలు, 7 నుంచి ఎలెక్టివ్‌ సర్వీసులు నిలిపివేస్తామని, 9 నుంచి అత్యవసర సేవలకూ దూరంగా ఉంటామని ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని