సిరివెన్నెల మరణం నన్నెంతో బాధించింది: ప్రధాని మోదీ

అత్యంత ప్రతిభావంతులైన సిరివెన్నెల మరణం నన్నెంతగానో బాధించింది. ఆయన రచనలలో కవిత్వ పటిమ, బహుముఖ ప్రజ్ఞ గోచరిస్తుంది. తెలుగు భాషా ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేశారు.

Updated : 01 Dec 2021 04:51 IST

అత్యంత ప్రతిభావంతులైన సిరివెన్నెల మరణం నన్నెంతగానో బాధించింది. ఆయన రచనలలో కవిత్వ పటిమ, బహుముఖ ప్రజ్ఞ గోచరిస్తుంది. తెలుగు భాషా ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేశారు.

కోలుకుంటారనుకున్నా: వెంకయ్యనాయుడు

తెలుగుభాషకు పట్టం కడుతూ.. ఆయన రాసిన ప్రతి పాటనూ అభిమానించేవారిలో నేనూ ఒకణ్ని. త్వరలోనే కోలుకుంటారని భావిస్తున్న తరుణంలో ఈ వార్త వినాల్సి రావడం విచారకరం.

సినీ సాహిత్యం ఆయనతో సుసంపన్నం: - జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, సీజేఐ
తెలుగు సినీ నేపథ్య గీతాల్లో సాహిత్యం పాలు తగ్గుతున్న తరుణంలో శాస్త్రి ప్రవేశం పాటకు ఊపిరులూదింది. ఆ సాహితీ విరించికి నా శ్రద్ధాంజలి.

విలువల శిఖరం: సీఎం జగన్‌
తెలుగు సినీ గేయ ప్రపంచంలో విలువల శిఖరం సిరివెన్నెల సీతారామశాస్త్రి. అక్షరాలతో ఆయన భావ విన్యాసాలు తెలుగువారి చరిత్రలో ఉండిపోతాయి.

పాటలతో ప్రజల్లో చైతన్యం: చంద్రబాబు
సీతారామశాస్త్రి జీవితం నేటి యువతకు ఆదర్శం. తన పాటలతో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ప్రజలలో చైతన్యం తీసుకొచ్చారు.

అక్షర తపస్వి ఆయన: పవన్‌ కల్యాణ్‌
బలమైన భావాన్ని, మానవత్వాన్ని, ఆశావాదాన్ని చిన్న చిన్న మాటల్లో పొదిగి జనసామాన్యం గుండెల్లో నిక్షిప్తం చేసేలా గీతరచన చేసిన అక్షర తపస్వి ఆయన.

ఆయన గేయరుషి: విజయ్‌కుమార్‌ రెడ్డి, ఏపీ చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఎండీ

సినిమా పాటలకు సాహిత్యపు విలువలు అద్దిన అక్షరశిల్పి, గేయరుషి సిరివెన్నెల సీతారామశాస్త్రి. కలం ముందుకు సాగినంత కాలం గేయరచనకు గాయం కాకుండా సిరివెన్నెల కాపు కాశారు. సిరివెన్నెల పాటలు గుండెలోతుల్ని స్పృశిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని