పంచింది అరకొరే..!

పెట్రోలు, డీజిలుపై ఎక్సైజ్‌ సుంకం రూపంలో కేంద్ర ప్రభుత్వానికి భారీ మొత్తంలో నిధులు సమకూరుతున్నా రాష్ట్రాలకు పంపిణీ చేస్తోంది నామమాత్రంగానే ఉంటోంది. కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాజ్యసభకు తెలిపిన వివరాల ప్రకారం ఒక్క 2020-21 ఆర్థిక సంత్సరంలోనే ఈ రెండు ఇంధనాలపై ఎక్సైజ్‌ సుంకం ద్వారా

Updated : 01 Dec 2021 06:03 IST

కేంద్రానికి వచ్చిన ఆదాయం రూ.3.72 లక్షల కోట్లు
రాష్ట్రాలన్నిటికీ ఇచ్చింది రూ.20 వేల కోట్లే
పెట్రోలు, డీజిలుపై ఎక్సైజ్‌ సుంకాల ద్వారా సమకూరిన మొత్తాల్లో పంపిణీ తీరిది..

దిల్లీ: పెట్రోలు, డీజిలుపై ఎక్సైజ్‌ సుంకం రూపంలో కేంద్ర ప్రభుత్వానికి భారీ మొత్తంలో నిధులు సమకూరుతున్నా రాష్ట్రాలకు పంపిణీ చేస్తోంది నామమాత్రంగానే ఉంటోంది. కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాజ్యసభకు తెలిపిన వివరాల ప్రకారం ఒక్క 2020-21 ఆర్థిక సంత్సరంలోనే ఈ రెండు ఇంధనాలపై ఎక్సైజ్‌ సుంకం ద్వారా కేంద్రానికి రూ.3.72 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. ఈ మొత్తం నుంచి రాష్ట్రాలన్నిటికీ కలిపి  రూ.19,972 కోట్లను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు. 2016 ఏప్రిల్‌ నుంచి 2021 మార్చి వరకు గత ఐదేళ్లలో ఇంధనాలపై వ్యాట్‌ ద్వారా రాష్ట్రాలన్నీ రూ.9.57 లక్షల కోట్లు, కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకాల రూపంలో రూ.12.10 కోట్లు వసూలు చేసినట్లు మంత్రి వెల్లడించారు.

* పెట్రోలు, డీజిలుపై విధించిన సుంకాల వల్ల 2019-2020లో కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం   రూ.1.78 లక్షల కోట్లు కాగా ఆ మరుసటి ఏడాది(2020 ఏప్రిల్‌-2021మార్చి) ఈ మొత్తం రూ.3.72 లక్షల కోట్లు కావడం గమనార్హం. అంటే ఏడాదిలో సుంకాల ఆదాయం రెట్టింపునకు పైగానే పెరిగింది. పన్నుల భారాన్ని పెంచడం వల్లే ఈ పెరుగుదల సాధ్యమైందని స్పష్టమవుతోంది. 2016-17లో రూ.2.22లక్షల కోట్లు, 2017-18లో రూ.2.25లక్షల కోట్లు, 2018-19లో రూ.2.13లక్షల కోట్లు ఎక్సైజ్‌ సుంకం రూపంలో కేంద్రానికి సమకూరాయి.


*  ఎక్సైజ్‌ సుంకాల రూపంలో వసూలై మొత్తం నుంచి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు వాటాలను కేటాయించడం లేదు. కేవలం బేసిక్‌ ఎక్సైజ్‌ డ్యూటీ ద్వారా సమకూరిన మొత్తాన్ని...ఆర్థిక సంఘం నిర్ణయించిన ఫార్ములా ప్రకారం అందజేస్తుంది. దీని వల్ల కేంద్రానికి భారీగా ఆదాయం సమకూరినా రాష్ట్రాలకు దక్కే వాటా చాలా స్వల్పంగా ఉంటోంది.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని