ఏపీలో గంజాయి..మూడేళ్లలో మూడురెట్లు

ఏపీలో దొరికిన గంజాయి పరిమాణం మూడేళ్లలో మూడురెట్లు పెరిగిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ రాజ్యసభలో తెలిపారు. తెదేపా సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ బుధవారం అడిగిన ప్రశ్నకు ఆయన సమాధాన మిచ్చారు.2018లో గంజాయి ఆధారిత మాదక ద్రవ్యాలు

Updated : 02 Dec 2021 04:59 IST

రాజ్యసభలో కేంద్రమంత్రి వెల్లడి

ఈనాడు, దిల్లీ: ఏపీలో దొరికిన గంజాయి పరిమాణం మూడేళ్లలో మూడురెట్లు పెరిగిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ రాజ్యసభలో తెలిపారు. తెదేపా సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ బుధవారం అడిగిన ప్రశ్నకు ఆయన సమాధాన మిచ్చారు.2018లో గంజాయి ఆధారిత మాదక ద్రవ్యాలు 33,930.5 కిలోలు ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ కింద స్వాధీనం చేసుకోగా 2019లో అది 66,665.5 కిలోలకు, 2020లో ఏకంగా 1,06,042.7 కిలోలకు చేరింది. రాష్ట్రంలో గంజాయి సాగును అడ్డుకోవడానికి నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో పలు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. మంత్రి సమాధానం ప్రకారం కేసులు పెరుగుతున్నా శిక్షలు తగ్గుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని