Updated : 02/12/2021 05:39 IST

తరుముకొస్తున్న తుపాను

ఈనాడు, విశాఖపట్నం: అండమాన్‌ వద్ద బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారనుండడంతో ఉత్తరాంధ్ర జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ‘‘అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశలో పయనించి గురువారం నాటికి వాయుగుండంగా బలపడనుంది. ఇది తదుపరి 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారొచ్చు. ఈనెల 4న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, 5న ఉత్తరాంధ్ర అంతటా తీవ్ర వర్షాలు ఉంటాయి. తూర్పుగోదావరి, యానాం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకట్రెండుచోట్ల అతి నుంచి అతి భారీ వర్షాలు కురవొచ్చు. నదీపరీవాహక ప్రాంతాల్లో వరద ముప్పు ఉండొచ్చు. గురువారం ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవొచ్చు’’ అని వివరించింది.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని