Updated : 02/12/2021 05:24 IST

ఏపీ నుంచి 160.. తెలంగాణ నుంచి 220 లక్షల టన్నులు

 మూడేళ్లలో బియ్యం సేకరణ లెక్కలివీ
తెలుగురాష్ట్రాల్లో సేకరణ ప్రక్రియ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ సంస్థలదే
లోక్‌సభలో కేంద్రమంత్రి వెల్లడి


ఈనాడు, దిల్లీ : గత మూడేళ్లలో తెలంగాణ నుంచి 220 లక్షల మెట్రిక్‌ టన్నులు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 160 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం సేకరించినట్లు కేంద్ర ఆహారం, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి సాద్వీ నిరంజన్‌ జ్యోతి తెలిపారు. ఎఫ్‌సీఐ సమన్వయంతో మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలే సెంట్రల్‌పూల్‌ కింద ఈ మొత్తాన్ని సేకరించినట్లు చెప్పారు. బుధవారం లోక్‌సభలో తెదేపా ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. ఇదే సమయంలో దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి కలిపి 1,563.03 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం సేకరించినట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రెండూ డీసీపీ రాష్ట్రాలే (రాష్ట్ర ప్రభుత్వాలు, వాటి ఏజెన్సీలు బియ్యం సేకరించి, నిల్వ ఉంచి, పంపిణీచేస్తాయి)అని, అందువల్ల సేకరణ రాష్ట్ర ప్రభుత్వాలే తమ పరిధిలోని ఏజెన్సీల ద్వారా చేస్తాయని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ ఆస్తులనేమీ అమ్మకానికి పెట్టలేదని నిరంజన్‌ జ్యోతి చెప్పారు. ఆ సంస్థపై ఉన్న రుణ భారం గురించి కేంద్ర ప్రభుత్వానికి అవగాహన ఉందని పేర్కొన్నారు. 2021 ఫిబ్రవరి 15నాటికి ఎఫ్‌సీఐపై రూ.4,07,404.77 కోట్ల రుణభారం ఉన్నట్లు వెల్లడించారు. తదనంతరం కేంద్ర ప్రభుత్వం రూ.4,62,789 కోట్లు కేటాయించి సమస్యను పరిష్కరించిందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబరు వరకు ఎఫ్‌సీఐ రూ.1,25,200 కోట్ల సబ్సిడీలను అందుకుందని చెప్పారు. అక్టోబరు నెలాఖరు నాటికి ఈ సంస్థపై రుణభారం రూ.46,173 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. ఆహార సబ్సిడీ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎఫ్‌సీఐకి చెల్లిస్తూ వస్తోందన్నారు.


 

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని