ఎయిడెడ్‌ ఆస్తులు కాజేసే యత్నం

ఎయిడెడ్‌ విద్యావ్యవస్థను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం  పలు జీవోలు తీసుకొచ్చింది. ఆ సంస్థల కోట్లాది రూపాయల ఆస్తులు కాజేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పేద విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకోం’ అని అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్‌ఎఫ్‌) రాష్ట్ర కార్యదర్శి రంగన్న హెచ్చరించారు.

Updated : 04 Dec 2021 06:41 IST

పేద విద్యార్థులకు అన్యాయం జరిగితే సహించం
ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర మహాసభల్లో వక్తలు

మహాసభల వేదిక నుంచి అభివాదం చేస్తున్న వందేమాతరం శ్రీనివాస్‌, జైభీమ్‌ సినిమా దర్శకుడు జ్ఞానవేల్‌, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు

కర్నూలు, న్యూస్‌టుడే: ‘ఎయిడెడ్‌ విద్యావ్యవస్థను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం  పలు జీవోలు తీసుకొచ్చింది. ఆ సంస్థల కోట్లాది రూపాయల ఆస్తులు కాజేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పేద విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకోం’ అని అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్‌ఎఫ్‌) రాష్ట్ర కార్యదర్శి రంగన్న హెచ్చరించారు. శుక్రవారం కర్నూలు నగరంలో ప్రారంభమైన ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర మహాసభల్లో ఆయన మాట్లాడారు.  

నూతన విద్యా విధానంతో తీవ్ర నష్టం
కేంద్రంలోని భాజపా ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానంతో విద్యావ్యవస్థ నిర్వీర్యమవుతుందని ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ కార్యదర్శి దినేష్‌ పేర్కొన్నారు. కేంద్రం చర్యలతో పేద విద్యార్థులకు ఉచిత విద్య అందని పరిస్థితులు ఏర్పడనున్నాయని, విద్యావ్యవస్థ అంతా కార్పొరేట్‌ చేతుల్లోకి వెళ్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. నిరంతరం పోరాటాలు చేసి ప్రసుత్త విద్యా విధానాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. మహాసభలకు హాజరైన జైభీమ్‌ సినిమా దర్శకుడు జ్ఞానవేల్‌ మాట్లాడుతూ సమాజాన్ని మార్చగలిగే శక్తి ఒక్క యువతకు మాత్రమే ఉందని పేర్కొన్నారు. సంగీత దర్శకుడు, ఏఐఎస్‌ఎఫ్‌ మాజీ నాయకుడు వందేమాతరం శ్రీనివాస్‌ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో జైభీమ్‌ లాంటి సృజనాత్మక సినిమాలు తీయడం లేదని, ప్రజలను చైతన్యపరిచేలా సినిమాలు తీయాలని కోరారు. తన పాటలతో యువతలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సమావేశంలో ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.సుబ్బారావు, నాయకులు జి.ఈశ్వరయ్య, ఎన్‌.లెనిన్‌బాబు, కె.శివారెడ్డి, రామాంజనేయులు, గిడ్డయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని