2022 జులైలో ‘ఆటా’ మహాసభలు

అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో 17వ మహాసభలు, యువ సమ్మేళనం 2022 జులై 1 నుంచి మూడు రోజుల పాటు అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరుగుతాయని ఆటా అధ్యక్షుడు

Updated : 06 Dec 2021 06:00 IST

తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 5 నుంచి 26 వరకు కార్యక్రమాలు


‘ఆటా వేడుకలు, సేవా డేస్‌’ గోడ పత్రికను ఆవిష్కరించిన ప్రతినిధి బృందం జోత్స్నారెడ్డి, కరుణాకర్‌రెడ్డి, గౌతమ్‌గోలి,
తిరుపతిరెడ్డి,రామకృష్ణారెడ్డి, మధు బొమ్మినేని, భువనేష్‌ భోజాల,

సుధీర్‌ బండారు, అనీల్‌ బోది, హరి దామెరలు

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో 17వ మహాసభలు, యువ సమ్మేళనం 2022 జులై 1 నుంచి మూడు రోజుల పాటు అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరుగుతాయని ఆటా అధ్యక్షుడు భువనేష్‌ భూజాల వెల్లడించారు. ఈ ఉత్సవాలకు ముందు మాతృదేశంలో ఆనవాయితీగా నిర్వహించే ‘ఆటా వేడుకలు, సేవా డేస్‌’ కార్యక్రమాలు డిసెంబరు 5 నుంచి 26వ తేదీ వరకు జరుగుతాయన్నారు. ఆదివారం చాపెల్‌రోడ్డులోని స్టాన్లీ మహిళా ఇంజినీరింగ్‌ కళాశాల సమావేశ మందిరంలో గోడపత్రిక ఆవిష్కరణ సభ నిర్వహించారు. ఆటా ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ మధు బొమ్మినేని మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. డిసెంబరు 26న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఆటా వేడుకల మహోత్సవం ఉంటుందని తెలిపారు. సమావేశంలో ఆటా ఇండియా కోఆర్డినేటర్‌ జోత్స్నారెడ్డి, మాజీ అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి, సలహాదారులు గౌతమ్‌ గోలి, తిరుపతిరెడ్డి, జాయింట్‌ సెక్రెటరీ రామకృష్ణారెడ్డి, ఉత్సవ కన్వీనర్‌ సుధీర్‌ బండారు, ఆటా బోర్డు ఆఫ్‌ ట్రస్టీ అనీల్‌ బోది, ప్రతినిధి హరి దామెర ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని