విశాఖ తీరాన ‘అల’జడి!

విశాఖ తీరంలో శనివారం రాత్రి సముద్ర అలలు బీభత్సం సృష్టించాయి. జవాద్‌ తుపాను కారణంగా మూడు రోజులుగా ఇక్కడ అలల తాకిడి ఎక్కువగా ఉంది.

Published : 06 Dec 2021 03:51 IST


అలల తాకిడికి వంగిపోయిన రక్షణ గోడ, ఛిద్రమైన పరిసరాలు

విశాఖ తీరంలో శనివారం రాత్రి సముద్ర అలలు బీభత్సం సృష్టించాయి. జవాద్‌ తుపాను కారణంగా మూడు రోజులుగా ఇక్కడ అలల తాకిడి ఎక్కువగా ఉంది. తుపాను దిశ మార్చుకొని ఒడిశా వైపు పయనించడంతో నగరానికి ముప్పు తప్పిందని భావిస్తుండగా.. రాత్రి వేళ కెరటాలు బీభత్సం సృష్టించాయి. బీచ్‌రోడ్డులోని నోవాటెల్‌ హోటల్‌ ఎదురుగా ఉన్న పిల్లల పార్కు నుంచి దుర్గాలమ్మ గుడి వరకు సుమారు 200 మీటర్ల దూరం తీరాన్ని ధ్వంసం చేశాయి. పార్కు గోడ కూలిపోయింది. భూకంపం తర్వాతి పరిస్థితిని తలపించేలా నేల చీలిపోయి పచ్చిక బయళ్లు కిందకు కుంగిపోయాయి. అప్రమత్తమైన పోలీసులు ఆదివారం ఆ ప్రాంతంలో రాకపోకలను నిషేధించారు. సందర్శకులను అనుమతించలేదు.


సముద్రం వైపు కుంగిన పార్కులోని ప్రాంతం

- న్యూస్‌టుడే, పెదవాల్తేరు


వెనక్కి తగ్గిన సాగరం..

తుపాను అలజడి తగ్గడంతో తీరంలో అలలు కాస్త వెనక్కి వెళ్లాయి. దీంతో విశాఖపట్నం తీరంలోని తెన్నేటి పార్కు సమీపానికి గత ఏడాది  కొట్టుకు వచ్చిన బంగ్లాదేశ్‌ నౌక అడుగుభాగం మొత్తం బయటకి కన్పిస్తోంది. దీంతో సందర్శకులు నౌక చెంతకు వెళ్లి ఫొటోలు దిగుతున్నారు. సముద్రపు నీటిలో మునిగి ఉండే రాళ్లు సైతం బయటపడి ఆకట్టుకుంటున్నాయి.

- ఈనాడు, విశాఖపట్నం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని