ప్రైవేటు లేఅవుట్లలో జగనన్న కాలనీలకు 5% స్థలం

‘కొత్తగా వేసే ప్రైవేటు లేఅవుట్లలో 5% స్థలాన్ని ఇకపై వైఎస్‌ఆర్‌ జగనన్న హౌసింగ్‌ ప్రాజెక్టుకు కేటాయించాలి. సాధ్యం కాదనుకుంటే ప్రాథమిక విలువపై స్థలానికి డబ్బైనా చెల్లించాలి’ అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంబంధిత జీవోను

Updated : 07 Dec 2021 06:04 IST

స్థిరాస్తి వ్యాపారులు విధిగా కేటాయించేలా నిబంధనల్లో సవరణలు

ఈనాడు, అమరావతి: ‘కొత్తగా వేసే ప్రైవేటు లేఅవుట్లలో 5% స్థలాన్ని ఇకపై వైఎస్‌ఆర్‌ జగనన్న హౌసింగ్‌ ప్రాజెక్టుకు కేటాయించాలి. సాధ్యం కాదనుకుంటే ప్రాథమిక విలువపై స్థలానికి డబ్బైనా చెల్లించాలి’ అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంబంధిత జీవోను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ సోమవారం జారీ చేసింది. ఈ మేరకు 2017 లేఅవుట్‌, సబ్‌-డివిజన్‌ నిబంధనలను సవరించారు. ప్రస్తుతం ప్రతి లేఅవుట్‌లో 10% స్థలాన్ని సామాజిక అవసరాల కోసం వ్యాపారులు కేటాయిస్తున్న దానికి ఇది అదనం. ఈ స్థలాన్ని పేదల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్‌ఆర్‌ జగనన్న హౌసింగ్‌ ప్రాజెక్టు కోసం వినియోగించనున్నట్లు పురపాలకశాఖ పేర్కొంది. పట్టణాభివృద్ధి సంస్థలు, పురపాలక సంఘాల పరిధిలో స్థిరాస్తి వ్యాపారులు వేసే లేఅవుట్లకు కొత్తగా తీసుకున్న ఈ నిర్ణయం వర్తిస్తుందని స్పష్టం చేసింది.

లేఅవుట్‌కు 3 కిలోమీటర్లలోపైనా ఇవ్వొచ్చు

* లేఅవుట్‌లో 5% స్థలాన్ని కేటాయించడం సాధ్యం కాదనుకుంటే అక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలోపు అంతే విస్తీర్ణంలో స్థలాన్ని ఇవ్వొచ్చని పురపాలకశాఖ సూచించింది.

* స్థలం ఇవ్వదలచుకోకుంటే లేఅవుట్‌లో ప్రాథమిక విలువపై (బేసిక్‌ వాల్యు) 5% స్థలానికి డబ్బు చెల్లించొచ్చు. స్థలం లేదా డబ్బును జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని పురపాలకశాఖ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని