అత్యంత సురక్షిత హెలికాప్టర్‌ అది

రెండు ఇంజిన్లు ఉన్న ఈ రష్యన్‌ తయారీ ఎమ్‌ఐ-17వీ5 హెలికాప్టర్‌ను ఎంతో సురక్షితమైనదిగా భావిస్తారు. 14-15 మంది ప్రయాణించడానికి వీలుగా ఉంటుంది.

Published : 09 Dec 2021 03:13 IST

ఈనాడు, దిల్లీ: రెండు ఇంజిన్లు ఉన్న ఈ రష్యన్‌ తయారీ ఎమ్‌ఐ-17వీ5 హెలికాప్టర్‌ను ఎంతో సురక్షితమైనదిగా భావిస్తారు. 14-15 మంది ప్రయాణించడానికి వీలుగా ఉంటుంది. సీడీఎస్‌ ప్రయాణిస్తున్న నేపథ్యంలో అన్ని ముందు జాగ్రత్తలు తీసుకొనే ఉంటారు. పైగా కోయంబత్తూరు నుంచి కున్నూర్‌ చాలా దగ్గర. అంత దగ్గర దూరంలో, అంత ఘోర ప్రమాదం జరగడం దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రమాద కారణాలేమిటో ఊహకు అందడం లేదు. పర్వత ప్రాంతాల్లో త్వరగా జరిగే వాతావరణ మార్పులు సహజంగా ప్రమాదాలకు కారణమవుతాయి. ఈ సమయంలో ఎక్కువ ఊహాగానాలు సరికాదు.

- తెలంగాణ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని