సాయుధ బలగాల్లో ఉద్యోగావకాశాలపై అవగాహన

మాతృభూమికి సేవ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారా..? అయితే మీలాంటి వారికి ‘ఈనాడు’ అవకాశం కల్పిస్తోంది. సాయుధ బలగాల్లో చేరాలనుకుంటున్న యువతీయువకులకు అవగాహన కల్పించేందుకు....

Published : 09 Dec 2021 03:16 IST

‘ఈనాడు’ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ సదస్సు

11న ఉదయం 11-12.30 గంటల మధ్య నిర్వహణ

ఈనాడు డిజిటల్‌- హైదరాబాద్‌: మాతృభూమికి సేవ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారా..? అయితే మీలాంటి వారికి ‘ఈనాడు’ అవకాశం కల్పిస్తోంది. సాయుధ బలగాల్లో చేరాలనుకుంటున్న యువతీయువకులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 11న ఆన్‌లైన్‌లో సదస్సు నిర్వహించబోతోంది. ‘సాయుధ బలగాల్లో ఉద్యోగావకాశాలు’ అనే అంశంపై ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకూ ఈ కార్యక్రమం ఉంటుంది. ఇందులో సైన్యం, వాయుసేన, నౌకాదళాల్లో ఉద్యోగ అవకాశాల గురించి వివరిస్తారు. ఉద్యోగ ప్రకటనలు, నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ(ఎన్‌డీఏ), కంబైన్డ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ సర్వీస్‌ ఎగ్జామ్‌(సీడీఎస్‌ఈ), ఎయిర్‌ ఫోర్స్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(ఏఎఫ్‌సీఏటీ) వంటి వాటికి సన్నద్ధానికి మెలకువలు, పరీక్షకు అర్హతల గురించి తెలియజేస్తారు. విజయం సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహం, దేహదారుఢ్య ప్రాధాన్యం, ముఖ్యంగా విద్యార్థినులకు ఉన్న అవకాశాలను వివరిస్తారు. ఇంటర్వ్యూలో పాటించాల్సిన మెలకువల గురించి విపులంగా చెబుతారు. చివరగా అనుమానాలు నివృత్తికి ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉంటుంది. విశాఖలోని తూర్పు నౌకాదళానికి చెందిన లెఫ్టినెంట్‌ కమాండర్‌ విజయలక్ష్మి, కెప్టెన్‌ ఎస్‌.రవీంద్ర ఈ సదస్సులో ప్రసంగిస్తారు. సాయుధ బలగాల్లో చేరాలనే ఉత్సాహం ఉన్నవారు ‘ఈనాడు’ కల్పిస్తున్న ఈ అవకాశాన్ని వినియోగించుకొని శనివారం నిర్వహించే ఆన్‌లైన్‌ సదస్సులో పాల్గొనవచ్చు.

* రిజిస్ట్రేషన్ల కోసం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ  8008055788 నంబరుకు మీ పేరు, ఫోన్‌ నంబరు, ఈ మెయిల్‌ ఐడీ తదితర వివరాలను ఎస్సెమ్మెస్‌ చేయగలరు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు