రైతుకు మాతృభాషలో సమాచారం అందాలి

రైతులకు మాతృభాషలో వ్యవసాయ సమాచారాన్ని అందిస్తే వారికి ఉపయుక్తంగా ఉంటుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.

Published : 09 Dec 2021 03:16 IST

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్ష

వీసీ ప్రవీణ్‌కు స్వామినాథన్‌ అవార్డు ప్రదానం


స్వామినాథన్‌ స్మారక పురస్కారాన్ని ప్రవీణ్‌రావుకు ప్రదానం చేస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు,
చిత్రంలో రికారియా అధ్యక్షులు ఎంవీఆర్‌ ప్రసాద్‌, మంత్రి నిరంజన్‌రెడ్డి, నూజివీడు సీడ్స్‌ ఎండీ,
సీఈవో ప్రభాకర్‌రావు, రికారియా ప్రధాన కార్యదర్శి మురళీధరుడు

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: రైతులకు మాతృభాషలో వ్యవసాయ సమాచారాన్ని అందిస్తే వారికి ఉపయుక్తంగా ఉంటుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ దిశగా ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు ప్రయత్నించాలని కోరారు. బుధవారం హైదరాబాద్‌లో జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయ వీసీ డాక్టర్‌ వి.ప్రవీణ్‌రావుకు ఎంఎస్‌ స్వామినాథన్‌ స్మారక అవార్డును ప్రదానం చేశారు. నూజివీడు సీడ్స్‌, భారత వ్యవసాయ పరిశోధన సంస్థ విశ్రాంత ఉద్యోగుల సమాఖ్య (రికారియా) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి, నూజివీడు సీడ్స్‌ ఎండీ, సీఈవో ప్రభాకర్‌రావు, రికారియా అధ్యక్షులు ఎంవీఆర్‌ ప్రసాద్‌లతో కలిసి బుధవారం ఉపరాష్ట్రపతి ఈ అవార్డును బహూకరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రైతులు ప్రత్యామ్నాయ పంటలపైనా.. పాడి, ఆక్వా, హార్టికల్చర్‌ తదితర రంగాలపైనా దృష్టి సారించాలని కోరారు.

సభకు రాకుండా టైమ్‌ ఇవ్వలేదంటే ఎలా?

ప్రస్తుతం పార్లమెంటు నడుస్తుందో లేదో తెలియదని, కొందరు సభకు హాజరుకావడం లేదని, పైగా తమకు సమయం కేటాయించడం లేదని చెబుతున్నారంటూ ఉపరాష్ట్రపతి చమత్కరించారు. పార్లమెంటుకు హాజరై తమ వాణిని వినిపించాల్సిన అవసరం ఉందని, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని