అమరావతి రైతుల ‘సమర సంక్రాంతి’
: రాజధాని అమరావతి రైతుల సంక్రాంతి వేడుకల్లో మూడు రాజధానుల నిర్ణయంపై నిరసన జ్వాలలు హోరెత్తాయి. రంగవల్లిక నుంచి గాలిపటాల వరకు అమరావతి ఆకాంక్ష ప్రతిధ్వనించింది. పండుగైన శనివారం ‘సమర సంక్రాంతి’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు
నిరసనలతోనే వేడుకలు
రంగవల్లిక నుంచి గాలిపటాల వరకు
ప్రతిబింబించిన ఉద్యమ నినాదం
ఈనాడు డిజిటల్, అమరావతి, తుళ్లూరు గ్రామీణం, న్యూస్‌టుడే: రాజధాని అమరావతి రైతుల సంక్రాంతి వేడుకల్లో మూడు రాజధానుల నిర్ణయంపై నిరసన జ్వాలలు హోరెత్తాయి. రంగవల్లిక నుంచి గాలిపటాల వరకు అమరావతి ఆకాంక్ష ప్రతిధ్వనించింది. పండుగైన శనివారం ‘సమర సంక్రాంతి’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. శిబిరాల్లో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. శిబిరం ముందు పొంగళ్లు పెట్టి వంటావార్పు నిర్వహించారు. పిల్లాపాపలతో సంతోషంగా పండగ చేసుకోవాల్సిన తాము రోడ్డునపడి నిరసనలు చేయాల్సిన దుస్థితిని ముఖ్యమంత్రి జగన్ కల్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్’ అని రాసివున్న ఆకుపచ్చ బెలూన్లు, గాలిపటాలను ఎగరవేసి నిరసన తెలిపారు. పెద్దఎత్తున రైతులు, రైతు కూలీలు, మహిళలు పాల్గొన్నారు.
కాగడాలతో భారీ ప్రదర్శన
మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వెలగపూడిలో ఆదివారం రాత్రి రైతులు, మహిళలు, చిన్నారులు భారీ కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ‘అమరావతి మెగా వెలుగు’ కార్యక్రమంలో భాగంగా వెలగపూడి శిబిరం నుంచి మల్కాపురం జంక్షన్ వరకు సుమారు కిలోమీటర్ మేర రహదారికి ఇరువైపులా కాగడాలు, కొవ్వొత్తులు పట్టుకుని నిరసన తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు వచ్చిన వారూ అమరావతికి మద్దతుగా ప్రదర్శనలో పాల్గొన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చారు. కరోనా నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. శిబిరం వద్ద రాజధాని ఐకాస జెండాను ఆవిష్కరించారు. తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి కాగడాలు వెలిగించారు. కార్యక్రమానికి రాజధాని రైతు ఐకాస కన్వీనర్ పువ్వాడ సుధాకర్ అధ్యక్షత వహించారు. తెదేపా మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, కృష్ణా జిల్లా మాజీ జడ్పీ ఛైర్పర్సన్ గద్దె అనురాధ, అఖిల భారత హిందూ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు వెలగపూడి గోపాలకృష్ణ, కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ, అమరావతి మహిళా ఐకాస నేత రాయపాటి శైలజ, జనసేన నేతలు, వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు.
రంగవల్లికలోనూ ఉద్యమ నినాదమే...
అమరావతి రైతులు, మహిళలు చేస్తున్న నిరసనలు 761వ రోజు ఆదివారం కొనసాగాయి. వెలగపూడిలో ‘అమరావతి ఉద్యమ రంగవల్లులు’ పేరుతో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మూడు రాజధానులు వద్దు, అమరావతే ముద్దు, జై అమరావతి, సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ వంటి నినాదాలు రాశారు. వెంకటపాలెం, దొండపాడు, పెదపరిమి, నెక్కల్లులో వెంకటేశ్వరస్వామికి పూజలు చేశారు. కృష్ణాయపాలెం, నీరుకొండ, మోతడక, అబ్బురాజుపాలెం, ఐనవోలు తదితర గ్రామాల్లో నిరసనలు కొనసాగాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
TDP: ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ!.. నారా భువనేశ్వరిపై పాట ఆవిష్కరణ
పల్లెపల్లె తిరిగినాదో అమ్మా భువనమ్మ- ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ జనం గుండెల్లో కొలువైనాది.. కష్టాలు కన్నీళ్లు తుడిపేసింది. -
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!.. ఎన్నికల కోడ్ అంటూ అధికారుల అభ్యంతరం
అధికార పార్టీ నేతల ఫొటోలు, హోర్డింగులు తొలగించడంలో చర్యలు తీసుకోని అధికారులు.. నిరుపేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీన్కు మాత్రం నిబంధనలు వర్తిస్తాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. -
ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు
ఉత్తర కోస్తాలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ప్రధాని సభలో ఆ ముగ్గురు ఎస్పీలు ఏమైనట్లు?
తెదేపా, జనసేన, భాజపా కూటమి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పల్నాడు జిల్లా బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభలో తోపులాటలు చోటుచేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి అంతరాయం ఏర్పడిన ఘటనపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. -
రోజంతా ఆసుపత్రి గదిలో చిక్కుకుపోయిన 5 ఏళ్ల బాలుడు
మాటలు రాని, వినపడని ఓ అయిదేళ్ల చిన్నారి అనుకోని పరిస్థితుల్లో ఆసుపత్రి గదిలో ఒక రోజంతా బందీ అయిపోయిన ఘటన కర్నూలు జిల్లా సర్వజన ఆసుపత్రిలో జరిగింది. -
బోరు వేసుకుంటారా.. రూ. 10 వేలు కట్టండి
తిరుపతిలోని అధికార పార్టీ కార్పొరేటర్ల అసలు రంగును బయటపెడుతూ సోమవారం ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఐదేళ్లూ షాక్.. ఎన్నికలని బ్రేక్!
పాదయాత్ర పేరిట ఊరూవాడా తిరిగిన జగన్... విద్యుత్ ఛార్జీలపై అలవోకగా అబద్ధాలు వల్లెవేశారు. మాటల గారడీతో ప్రజలను బురిడీ కొట్టించారు. -
వైకాపా సైన్యం బరితెగింపు
ఎన్నికల సంఘం నిఘా పరిధిలో ఉన్నామన్న బెరుకు లేదు.. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తున్నామన్న అదురూ లేదు. -
వేతనాల చెల్లింపులపై నేడు ‘చివరి గ్రీవెన్స్ డే’
వేతనాల చెల్లింపులకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా జిల్లా కేంద్రాలలో మంగళవారం నిర్వహించే చివరి ‘గ్రీవెన్స్ డే’(వినతుల స్వీకరణ)లో పరిష్కరించుకోవాలని ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్ సూచించారు. -
జగన్‌పై పోస్టులో అభ్యంతరకర భాగాన్ని తొలగించండి
వైకాపా అధ్యక్షుడు జగన్‌పై తెదేపా ఎక్స్ ఖాతాలో ఉంచిన పోస్టులో అభ్యంతరకరమైన ఓ భాగాన్ని తొలగించాలంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి సోమవారం లేఖ రాసింది. -
కక్షిదారులకు వెంటనే న్యాయం అందించాలి
న్యాయస్థానాల్లో కక్షిదారులకు వేగంగా న్యాయం జరిగేలా న్యాయవాదులు చొరవ తీసుకోవాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. -
ఓఎంఆర్ షీట్లో గల్లంతైన విద్యార్థిని పేరు
విద్యాశాఖ అధికారుల తీరుతో పదో తరగతి విద్యార్థిని అరగంటపాటు తల్లడిల్లాల్సి వచ్చింది. తిరుపతి నగరంలోని సత్యనారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె.వర్షిణి తనకు కేటాయించిన బైపాస్‌లోని రత్నం పరీక్షా కేంద్రం వద్దకు అరగంట ముందుగానే చేరుకుంది. -
కోడ్ కూసే ముందు.. అయినవారికే నిధులు
ఇప్పటికే పలు దఫాలు సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ పరిధిలో రహదారుల పనులు చేసిన గుత్తేదార్లకు మాత్రమే చెల్లింపులు చేశారంటూ ఇతర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. -
కాసులివ్వని కపట ప్రేమ!
పేరుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి డబ్బులు జమ చేస్తున్నట్లు ప్రకటిస్తారు.. రైతులకు మాత్రం సున్నా వడ్డీ లేదు. పెట్టుబడి సాయమూ లేదు. -
గ్రహణం వీడితేనే గట్టెక్కేది!
చుట్టూ నీళ్లలో నిరుపయోగంగా ఉన్న ఈ నిర్మాణాలు టిడ్కో ఇళ్లు. ఒంగోలు నగరం సమీపంలోని చింతల వద్ద తెదేపా హయాంలో నిర్మించారు. -
ఈఏపీసెట్ పరీక్ష తేదీల్లో మార్పు
ఎన్నికల నేపథ్యంలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీసెట్ పరీక్ష షెడ్యూల్ మారనుంది. -
ఉత్తుత్తి సంక్షేమం
‘గడప గడపకు సంక్షేమం’ పేరుతో వైకాపా ప్రభుత్వం పేదలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోంది. -
కోడ్ ఉల్లంఘన విచారణలో జాప్యం: కలెక్టర్ ఆగ్రహం
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వాలంటీర్ల వివరాల సేకరణలో జాప్యం జరగడంతో గుంటూరు జిల్లా కలెక్టర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఇదేం సామాజిక న్యాయం జగన్?
వైకాపా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో సామాజిక న్యాయం నేతి బీర చందంగా ఉంది. రాయలసీమ నాలుగు జిల్లాలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాను కలిపి వైకాపా టికెట్ల కేటాయింపు పరిశీలిస్తే.. జగన్ మార్క్ న్యాయం ఏమిటన్నది స్పష్టమవుతోంది. -
సీపీఎస్ ఉద్యోగుల డబ్బులు రూ.2,800 కోట్లు హాంఫట్
జగన్ సర్కార్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులపై కక్షకట్టినట్లు వ్యవహరిస్తోంది. -
ఆగని సలహాదారు నియామకాల జోరు
ప్రభుత్వశాఖలకు సలహాదారుల నియామకంపై హైకోర్టు అభ్యంతరం చెప్పినా జగన్ ప్రభుత్వ తీరు మారడంలేదు.
తాజా వార్తలు (Latest News)
-
Gadchiroli: గడ్చిరోలిలో ఎదురుకాల్పులు.. నలుగురు మావోయిస్టుల హతం
-
మూడు కార్లలో తాయిలాల సరకు దాటిపోయిందా...?!
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
వంట త్వరగా చేయలేదని భార్యను హతమార్చి.. ఆపై ఆత్మహత్య
-
TDP: ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ!.. నారా భువనేశ్వరిపై పాట ఆవిష్కరణ
-
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!.. ఎన్నికల కోడ్ అంటూ అధికారుల అభ్యంతరం