పొరుగుసేవల ఉద్యోగుల వేతనాల పెంపు

రాష్ట్రంలో నాలుగు కేటగిరీల్లో పనిచేస్తున్న పొరుగు సేవల ఉద్యోగుల వేతనాలను పెంచారు. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ సోమవారం ఉత్తర్వులు

Published : 18 Jan 2022 08:05 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో నాలుగు కేటగిరీల్లో పనిచేస్తున్న పొరుగు సేవల ఉద్యోగుల వేతనాలను పెంచారు. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. పెంచిన వేతనాలు ఈ నెల నుంచే అమల్లోకి వస్తాయని వెల్లడించారు. అయితే ఏపీ పొరుగు సేవల సంస్థ పరిధిలోని వారికే ఈ పెంపు వర్తిస్తుంది.

* కేటగిరీ 1లోని సీనియర్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ స్టెనో, సీనియర్‌ అకౌంటెంట్‌, ట్రాన్స్‌లేటర్‌, డేటా ప్రాసెసింగ్‌ అధికారులకు గతంలో ఉన్న రూ.17,500 నుంచి ఇప్పుడు రూ.21,500కు పెంచారు.

* కేటగిరీ 2లోని జూనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ స్టెనో, డ్రైవర్‌, టైపిస్ట్‌, టెలిఫోన్‌ ఆపరేటర్‌, స్టోర్‌కీపర్‌, ఫొటోగ్రాఫర్‌, డేటా ఎంట్రీ ఆఫీసర్‌, డేటా ప్రాసెసింగ్‌ ఆపరేటర్‌, ఎలక్ట్రీషియన్‌, మెకానిక్‌, ఫిట్టర్‌, లైబ్రేరియన్‌, ల్యాబ్‌ అసిస్టెంట్‌, సినిమా/ఆడియో విజువల్‌ ఆపరేటర్‌, సూపర్‌వైజర్‌, మేనేజర్‌ వంటి వారికి రూ.15,000గా ఉన్న వేతనాన్ని రూ.18,500కు పెంచారు.

* కేటగిరీ 3లోని ఆఫీస్‌ సబార్డినేట్‌, వాచ్‌మెన్‌, మాలి, కామటి, కుక్‌, చౌకీదార్‌, సైకిల్‌ ఆర్డర్లీ, లిప్ట్‌ ఆపరేటర్‌, ల్యాబ్‌ అటెండెంట్‌, డఫేదార్‌, జమేదార్‌, జిరాక్స్‌ ఆపరేటర్‌, రికార్డు అసిస్టెంట్‌, షరాఫ్‌/క్యాషియర్‌లకు రూ.12,000గా ఉన్న వేతనాన్ని రూ.15వేలకు పెంచారు.

ఒప్పంద ఉద్యోగుల మినిమమ్‌ టైం స్కేలు

ఒప్పంద ఉద్యోగులకు మినిమమ్‌ టైం స్కేలును పొడిగిస్తూ (ఎక్స్‌టెన్షన్‌) ఉత్తర్వులిచ్చారు.

1993కు ముందు చేరిన వారికీ

25-11-1993కు ముందు నియమితులైన పూర్తికాల (ఫుల్‌టైం) /ఎన్‌ఎంఆర్‌/ రోజువారీ వేతనదారులు/ కన్సాలిడేటెడ్‌ పే/ పార్ట్‌టైం ఉద్యోగులకూ మినిమం టైం స్కేలుకు సమానంగా ఇచ్చే వేతనాలను కొత్త వేతన సవరణలోనూ కొనసాగిస్తున్నట్లు రావత్‌ మరో ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని