‘మిసెస్‌ ఆంధ్రప్రదేశ్‌’గా గరివిడి మహిళ

విజయనగరం జిల్లా గరివిడి పట్టణానికి చెందిన బి.పద్మావతి ‘మిసెస్‌ ఆంధ్రప్రదేశ్‌’ కిరీటాన్ని దక్కించుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సేవ(ఎన్‌జీవో) సంస్థను నిర్వహిస్తున్న వ్యవస్థాపక

Published : 18 Jan 2022 05:01 IST

గరివిడి, న్యూస్‌టుడే: విజయనగరం జిల్లా గరివిడి పట్టణానికి చెందిన బి.పద్మావతి ‘మిసెస్‌ ఆంధ్రప్రదేశ్‌’ కిరీటాన్ని దక్కించుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సేవ(ఎన్‌జీవో) సంస్థను నిర్వహిస్తున్న వ్యవస్థాపక అధ్యక్షురాలు మమతా త్రివేది ఆన్‌లైన్‌ వేదికగా ఈ అందాల పోటీలను నిర్వహించారు. 2021 సెప్టెంబరులో జరిగిన ప్రాథమిక పోటీల్లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి వంద మంది యువతులు ఎంపిక కాగా వీరిలో 36 మంది అర్హత సాధించారు. ఈ నెల 16న నిర్వహించిన తుది పోటీల్లో మంచి ప్రతిభ చూపిన పద్మావతి ‘మిసెస్‌ ఆంధ్రప్రదేశ్‌’ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. గత ఏడాది ఏప్రిల్‌లో విశాఖపట్నంలో నిర్వహించిన శ్రీమతి వైజాగ్‌ పోటీల్లోనూ ఈమె ఫైనల్స్‌కు అర్హత సాధించినప్పటికీ కొవిడ్‌ కారణంగా పాల్గొనలేకపోయారు. వివాహం అనంతరం విశాఖపట్నంలో స్థిరపడ్డారు. ఈమె తండ్రి రామకృష్ణ గరివిడిలోని ఫేకర్‌ పరిశ్రమలో సెక్యూరిటీ చీఫ్‌గా పనిచేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని