37 చోట్ల రిజిస్ట్రేషన్లు ప్రారంభం

భూముల రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లో 37 చోట్ల దస్తావేజుల రిజిస్ట్రేషన్ల సేవలను ముఖ్యమంత్రి జగన్‌ మంగళవారం ప్రారంభించనున్నారు. తొలివిడత కింద రాష్ట్రంలో ఎంపిక చేసిన 51

Published : 18 Jan 2022 05:01 IST

51 గ్రామాల్లో పూర్తయిన రీ-సర్వేపై నేడు ప్రత్యేక కార్యక్రమం

హాజరుకానున్న సీఎం జగన్‌

ఈనాడు-అమరావతి: భూముల రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లో 37 చోట్ల దస్తావేజుల రిజిస్ట్రేషన్ల సేవలను ముఖ్యమంత్రి జగన్‌ మంగళవారం ప్రారంభించనున్నారు. తొలివిడత కింద రాష్ట్రంలో ఎంపిక చేసిన 51 గ్రామాల్లో రీ-సర్వే పూర్తయింది. ప్రతి భూ కమతానికి విడిగా అక్షాంశ, రేఖాంశాలు, విశిష్ఠ గుర్తింపు సంఖ్య, సమగ్రంగా భూమి వివరాలు తెలిపే క్యూఆర్‌ కోడ్‌తో కూడిన భూకమత పటాన్ని యజమానులకు అందజేస్తారు. గ్రామాల స్థాయిలో భూ రికార్డులను క్రోడీకరించి మ్యాపులు (భూ కమతాలతో కూడిన గ్రామ పటం), ఇతర రికార్డులు గ్రామాల్లోనే అందుబాటులో ఉంచుతారు. ఈ కొత్త రికార్డులను మంగళవారం ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. ఈ కార్యక్రమం కూడా సీఎం చేతుల మీదగా మంగళవారం జరగనుంది. ఈ 51 గ్రామాల్లో 12,776 మంది భూ యజమానులకు చెందిన 29,563 ఎకరాల భూములను రీ-సర్వే చేశారు. వీటి భూ కమతాల సంఖ్య 21,404గా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని