Corona:చంద్రబాబుకు కరోనా

తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తెలియజేస్తూ మంగళవారం ట్వీట్‌ చేశారు. తేలికపాటి లక్షణాలు కనిపించడంతో కొవిడ్‌ పరీక్ష చేయించుకుంటే పాజిటివ్‌గా

Updated : 19 Jan 2022 06:04 IST

తేలికపాటి లక్షణాలే
త్వరగా కోలుకోవాలని ప్రముఖుల ఆకాంక్ష

ఈనాడు, అమరావతి: తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తెలియజేస్తూ మంగళవారం ట్వీట్‌ చేశారు. తేలికపాటి లక్షణాలు కనిపించడంతో కొవిడ్‌ పరీక్ష చేయించుకుంటే పాజిటివ్‌గా తేలిందన్నారు. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉంటూ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నానని వివరించారు. తనను కలిసిన వారు కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అంతా సురక్షితంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.

* చంద్రబాబు కొవిడ్‌ బారిన పడడంపై గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆందోళన వ్యక్తంచేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యాన్ని పొందాలని ఆకాంక్షిస్తూ సీఎం జగన్‌ మంగళవారం ట్వీట్‌ చేశారు.

* తెదేపా అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ త్వరగా కోలుకోవాలని మెగాస్టార్‌ చిరంజీవి ఆకాంక్షించారు.

* ‘మామయ్య చంద్రబాబు, లోకేశ్‌ కొవిడ్‌ నుంచి త్వరగా కోలుకోవాలి’ అని జూనియర్‌ ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేశారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సైతం చంద్రబాబు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఉప ముఖ్యమంత్రి ధర్మానకు పాజిటివ్‌

పోలాకి, న్యూస్‌టుడే: ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌కు కరోనా సోకినట్లు శ్రీకాకుళం జిల్లాలోని ఆయన స్వగ్రామం మబుగాం క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం ఓ ప్రకటన వెలువడింది.
 * మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కరోనా బారినపడ్డారు. విజయవాడకు సమీపంలోని గొల్లపూడిలో హోం ఐసొలేషన్‌లో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని