జూన్‌లోగా తొలి విడత డిజిటల్‌ లైబ్రరీలు

రాష్ట్రవ్యాప్తంగా తొలివిడతలో చేపట్టిన డిజిటల్‌ లైబ్రరీల పనులు జూన్‌లోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. ఇంటర్నెట్‌ కనెక్షన్‌తో పాటు డెస్క్‌టాప్‌, బల్ల, కుర్చీలు, యూపీఎస్‌, ఇనుప అరలు, విద్యుత్‌ దీపాలు, ఫ్యాన్లు వంటివి అమర్చాలని స్పష్టం చేశారు.

Updated : 20 Jan 2022 03:23 IST

సమీక్షలో ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశం

ఈనాడు, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా తొలివిడతలో చేపట్టిన డిజిటల్‌ లైబ్రరీల పనులు జూన్‌లోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. ఇంటర్నెట్‌ కనెక్షన్‌తో పాటు డెస్క్‌టాప్‌, బల్ల, కుర్చీలు, యూపీఎస్‌, ఇనుప అరలు, విద్యుత్‌ దీపాలు, ఫ్యాన్లు వంటివి అమర్చాలని స్పష్టం చేశారు. బుధవారం ఈ పనులపై తన క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్షించారు. తొలివిడతలో 4,530 డిజిటల్‌ లైబ్రరీల పనులు చేపడుతున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. వీటికి అవసరమైన నెట్‌ కనెక్షన్ల ఏర్పాటు వచ్చే నెల నాటికి పూర్తవుతుందన్నారు. మిగిలిన లైబ్రరీల పనులను రెండోవిడతలో చేపట్టాలని సీఎం జగన్‌ సూచించారు.  తద్వారా రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్‌ లైబ్రరీలు ఏర్పాటు చేసినట్లవుతుందన్నారు. వీటి ఏర్పాటుతో ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని