ఒక్కరోజే 10,057 కరోనా కేసులు

రాష్ట్రంలో రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది. 24 గంటల్లో 10,057 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌తో ఎనిమిది మంది మరణించారు. మంగళవారం ఉదయం 9నుంచి బుధవారం ఉదయం 9గంటల మధ్య 41,713 నమూనాలను పరీక్షించారు. పాజిటివిటీ రేటు 24.1% నమోదైంది.

Updated : 20 Jan 2022 06:10 IST

కరోనాతో 8 మంది మృతి
పాజిటివిటీ రేటు 24.1%

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది. 24 గంటల్లో 10,057 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌తో ఎనిమిది మంది మరణించారు. మంగళవారం ఉదయం 9నుంచి బుధవారం ఉదయం 9గంటల మధ్య 41,713 నమూనాలను పరీక్షించారు. పాజిటివిటీ రేటు 24.1% నమోదైంది. అంటే పరీక్షించిన ప్రతి వంద నమూనాల్లో 24 కేసులు బయటపడ్డాయి. గతేడాది జూన్‌ ఐదో తేదీ తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. గతేడాది అక్టోబరు 27 తర్వాత ఎనిమిది మరణాలు నమోదవడం ఇదే తొలిసారి.

జిల్లాలవారీగా..
యథావిధిగా చిత్తూరు, విశాఖ జిల్లాల్లో అత్యధికంగా 1827, 1822 చొప్పున కేసులొచ్చాయి. అనంతపురం జిల్లాలో 861, తూర్పుగోదావరి 919, గుంటూరు 943, కడప 482, కృష్ణా 332, కర్నూలు 452, నెల్లూరు 698, ప్రకాశం 716, శ్రీకాకుళం 407, విజయనగరం 382, పశ్చిమగోదావరి జిల్లాలో 216 చొప్పున కేసులొచ్చాయి. కొవిడ్‌ కారణంగా విశాఖ జిల్లాలో ముగ్గురు, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు ప్రాణాలు విడిచారు.
* ఈనెల ఒకటో తేదీ నుంచి కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. జనవరి ఒకటిన పాజిటివిటీ రేటు 0.57%గా నమోదైంది. 10న 4.05%, 15న 13.89%గా నమోదైంది. మంగళవారం 6,996 నమోదుకాగా పాజిటివిటీ రేటు 22.67%గా ఉంది. 24 గంటలు గడిచేసరికి కేసులు అమాంతం పెరిగాయి.

చిత్తూరు విద్యాశాఖలో 48మందికి కరోనా
చిత్తూరు విద్య, కొయ్యూరు, పెద్దాపురం, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లాలో విద్యాశాఖలో బుధవారం 48మందికి కరోనా నిర్ధారణ అయింది. వీరిలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థి ఉన్నారు. పాఠశాలల పునఃప్రారంభం రోజున 53మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. రెండో రోజు కేసులు తగ్గినా.. బుధవారం మళ్లీ పెరిగాయి.
 విశాఖ జిల్లా అరకు ఎంపీ మాధవికి పాజిటివ్‌ నిర్ధారణయింది.  
*  మాజీ ఉపముఖ్యమంత్రి, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఎమ్మెల్యే ఎన్‌.చినరాజప్పకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.  

కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష ధర రూ.350
ప్రైవేటు డయాగ్నొస్టిక్‌ ల్యాబ్‌ల్లో వసూలు చేయాల్సిన కొవిడ్‌ నిర్ధారణ (ఆర్టీపీసీఆర్‌) పరీక్ష ధరను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తగ్గించింది. ఐసీఎంఆర్‌ గుర్తింపు పొందిన ల్యాబ్‌ల్లో చేసే ఈ పరీక్షకు రూ.350 మాత్రమే వసూలు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులిచ్చింది. పరీక్ష కోసం ఇప్పటివరకు రూ.475 తీసుకుంటున్నారు. నిర్ణీత ధరను మించి వసూలు చేయకుండా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని