20 రోజుల్లో 26 శాతానికి..

రాష్ట్రంలో 20 రోజుల్లో కరోనా పాజిటివిటీ శాతం 26శాతానికి చేరింది. పరీక్షలు నిర్వహించిన వారిలో జనవరి 1న 0.57శాతం పాజిటివిటీ వస్తే అదే 20న అది 26.60 శాతంగా నమోదైంది. గత అయిదు రోజుల్లోనే పాజిటివిటీ శాతం

Published : 21 Jan 2022 03:15 IST

భారీగా పెరుగుతున్న కరోనా పాజిటివిటీ రేటు
గురువారం 12,615 కేసులు
అయిదుగురి మృతి

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో 20 రోజుల్లో కరోనా పాజిటివిటీ శాతం 26శాతానికి చేరింది. పరీక్షలు నిర్వహించిన వారిలో జనవరి 1న 0.57శాతం పాజిటివిటీ వస్తే అదే 20న అది 26.60 శాతంగా నమోదైంది. గత అయిదు రోజుల్లోనే పాజిటివిటీ శాతం దాదాపు రెండింతలు పెరిగింది. ఈ నెల 15న 13.89శాతం ఉంటే 20న 26.60శాతం వచ్చింది. బుధవారం ఉదయం 9గంటల నుంచి గురువారం ఉదయం 9గంటల మధ్య 47,420 నమూనాలను పరీక్షిస్తే 12,615 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. విశాఖపట్నంలో ముగ్గురు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున అయిదు మంది 24 గంటల్లో కొవిడ్‌తో మృతి చెందారు.

19న ఉదయం నుంచి 20 ఉదయం వరకు 24గంటల్లో 3,674మంది  కోలుకున్నారు. చిత్తూరులో అత్యధికంగా 2,338 కరోనా కేసులు రాగా, విశాఖలో 2,117, గుంటూరులో 1,066, విజయనగరంలో 1,039, నెల్లూరులో 1,012, అనంతపురంలో 951, కర్నూలులో 884, ప్రకాశంలో 853, కడపలో 685, తూర్పుగోదావరిలో 627, శ్రీకాకుళంలో 464, కృష్ణాలో 363, పశ్చిమగోదావరిలో 216 కేసులు బయటపడ్డాయి.


కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి కరోనా

ఈనాడు, దిల్లీ: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి కరోనా వైరస్‌ సోకింది. కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల్లో తనకు పాజిటివ్‌గా తేలినట్లు ఆయన గురువారం ఉదయం ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని, అన్ని రకాల నిబంధనలు పాటిస్తూ హోం క్వారెంటైన్‌లో ఏకాంతంగా ఉంటున్నట్లు చెప్పారు. ఇటీవలి కాలంలో తనను కలిసిన వారంతా కూడా ఐసొలేషన్‌లోకి వెళ్లి, పరీక్ష చేయించుకోవాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని