మాట తప్పని మడమ తిప్పని సీఎం గారూ..!!

పీఆర్సీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా అనంతపురం కలెక్టరేట్‌ వద్ద నిర్వహించిన ఆందోళనలో ఎస్జీటీ ఉపాధ్యాయుడు, జనవిజ్ఞాన వేదిక గాయకుడు, మిమిక్రీ ఆర్టిస్టు సుగాలి శంకర శివరావు ముఖ్యమంత్రిపై పాడిన పాట సామాజిక

Published : 21 Jan 2022 05:09 IST

ఉద్యోగులకిచ్చిన బాసలు ఏమాయె సారూ?

ఈనాడు, అమరావతి: పీఆర్సీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా అనంతపురం కలెక్టరేట్‌ వద్ద నిర్వహించిన ఆందోళనలో ఎస్జీటీ ఉపాధ్యాయుడు, జనవిజ్ఞాన వేదిక గాయకుడు, మిమిక్రీ ఆర్టిస్టు సుగాలి శంకర శివరావు ముఖ్యమంత్రిపై పాడిన పాట సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఉద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని, పీఆర్సీ అంటూ మోసం చేశారంటూ పాటపాడారు.
‘‘ఓ మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి గారూ!
ఉద్యోగులకిచ్చిన బాసలు ఏమాయే సారూ?
ముద్దుల మీద ముద్దులు పెట్టే ముఖ్యమంత్రి గారూ
మీ పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి మీరూ..।।ఓ।।


పీఆర్సీల హెచ్‌ఆర్‌ఏల సంగతేంది సారూ
ఐఆరునే పీఆర్సీ అంటూ మాయ చేసినారు
సీపీయస్సు రద్దు చేస్తనని మాట ఇచ్చినారు
ఇచ్చిన మాట నిలుపుకోక ఎగతాళి చేసినారు  ।।ఓ।।


నీ రాత మార్చిన గురువులకేమో పంగనామలాయే
బెయిలు ఇచ్చిన జడ్జీలకేమో పాత జీతమాయే
నీ మానసపుత్రిక సచివాలయం ఎక్కిఎక్కి ఏడ్చే
నీ రక్షణ చూసే పోలీసు శాఖ సంబరాలు చేసే ।।ఓ।।


పీఆర్సీ అంతా రివర్స్‌గేరు ఎందుకండి సారూ?
చెట్టును ఎక్కి మొదలు నరకడం నీకు ముప్పే సారూ
అప్పుల మీద అప్పులు చేసి తిప్పలెందుకండీ
వెనకటి వారు ఏలిన రీతిగ మీరు నడుచుకోండి  ।।ఓ।।


నీ పుట్టిని ముంచుట ఎంప్లాయిసుకు బాగా తెలుసులేండి
మునగక ముందే పుట్టిని కాస్త ఒడ్డుకు చేర్చుకోండి
మీరిచ్చిన మాట నిలుపుకోని మా మనసు గెలుచుకోండి ।।ఓ।।


మీరిచ్చిన డబ్బులు వంటనూనెకే ఖర్చు చేస్తిమండి
పెట్రోలు డీజిల్‌ మంటల్లోన మాడుతున్నమండి
ధరల మీద ధరలు పెరిగేను విషయమేంది సారూ?
రాజన్న కొడుకుగా రాజ్యమేలుట నేర్చుకోండి మీరూ।।

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని