నదుల అనుసంధానానికి 4 డీపీఆర్‌లు

దేశంలో నదుల నాలుగు అనుసంధాన ప్రాజెక్టులు ప్రాధాన్యమైనవిగా గుర్తించామని, అందులో గోదావరి-కావేరి అనుసంధానం కూడా ఉందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ తెలిపారు. రాజ్యసభలో భాజపా సభ్యుడు సీఎం

Published : 21 Jan 2022 05:22 IST

కేంద్ర జలశక్తి మంత్రి

ఈనాడు, అమరావతి: దేశంలో నదుల నాలుగు అనుసంధాన ప్రాజెక్టులు ప్రాధాన్యమైనవిగా గుర్తించామని, అందులో గోదావరి-కావేరి అనుసంధానం కూడా ఉందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ తెలిపారు. రాజ్యసభలో భాజపా సభ్యుడు సీఎం రమేష్‌ ప్రత్యేక ప్రస్తావన కింద అడిగిన ప్రశ్నకు  మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.  కెన్‌బెత్వా, దామన్‌గంగా-పింజారి, పార్‌-తపి-నర్మద, గోదావరి-కావేరి అనుసంధాన ప్రాజెక్టుల డీపీఆర్‌లు సిద్ధమయ్యాయన్నారు. కెన్‌బెత్వా అనుసంధాన ప్రాజెక్టుకు తాజాగా నిధుల మంజూరుకు కేంద్రం అనుమతించిందని వివరించారు. దీనికి   రూ.44,605 కోట్లు అంచనావ్యయం కాగా.. ఇందులో కేంద్రం రూ.39,317 కోట్లు ఇస్తుందని తెలిపారు. 3ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లను ఆయా రాష్ట్రాలకు పంపి ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు