నేడు జిల్లాల్లో రౌండ్‌టేబుల్‌ సమావేశాలు

పీఆర్సీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా పీఆర్సీ సాధన సమితి ప్రకటించిన ఉద్యమ కార్యాచరణ ఆదివారం నుంచే ప్రారంభం కానుంది. అన్ని జిల్లాల్లోనూ ఐకాసల ప్రతినిధులతో రౌండ్‌టేబుల్‌ సమావేశాలు నిర్వహించనున్నారు. వీటి నిర్వహణపై ఐకాస నేతలు శనివారం సుదీర్ఘంగా చర్చించారు.

Published : 23 Jan 2022 03:54 IST

ఈనాడు, అమరావతి: పీఆర్సీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా పీఆర్సీ సాధన సమితి ప్రకటించిన ఉద్యమ కార్యాచరణ ఆదివారం నుంచే ప్రారంభం కానుంది. అన్ని జిల్లాల్లోనూ ఐకాసల ప్రతినిధులతో రౌండ్‌టేబుల్‌ సమావేశాలు నిర్వహించనున్నారు. వీటి నిర్వహణపై ఐకాస నేతలు శనివారం సుదీర్ఘంగా చర్చించారు. రౌండ్‌టేబుల్‌ సమావేశాలకు ఎవరెవరు హాజరుకావాలనే దానిపై జిల్లాలకు సమాచారం పంపారు. ఫిబ్రవరి ఆరో తేదీ అర్ధరాత్రి నుంచి చేపట్టే సమ్మెలోకి ప్రతి ఉద్యోగిని తీసుకురావాలనే లక్ష్యంతో సాధన సమితి ముందుకు కదులుతోంది. ఇప్పటికే చాలా సంఘాలు సమ్మెకు మద్దతు ప్రకటించాయి. మిగతా సంఘాలను కలిసిరావాలని సమావేశాల సందర్భంగా కోరనున్నారు. సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమ్మె నోటీసు అందిస్తారు. ఉద్యమ కార్యాచరణను ముందుకు తీసుకువెళ్లేందుకు రాష్ట్ర స్థాయిలో 12మంది సభ్యులతో ఏర్పాటు చేసిన స్టీరింగ్‌ కమిటీ ఆదివారం సమావేశం కానుంది.

ఉద్యమ కార్యాచరణలోకి వీఆర్వోలు: ఉద్యోగుల సమస్యల కోసం చేపట్టనున్న ఉద్యమ కార్యాచరణలో గ్రామ రెవెన్యూ అధికారులంతా పాల్గొంటారని ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భూపతిరాజు రవీంద్రరాజు, అప్పలనాయుడు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని